iDreamPost
android-app
ios-app

నర్సింగ్ స్టూడెంట్ నిర్ణయంతో షాక్‌లో తల్లిదండ్రులు.. రాత్రి ఎవరూ లేని టైంలో

  • Published Aug 06, 2024 | 4:00 AM Updated Updated Aug 06, 2024 | 7:13 AM

Nursing Student Fell Down From Hostel Building In Bengaluru: మలయాళీ నర్సింగ్ స్టూడెంట్ తీసుకున్న నిర్ణయం ఆమె తల్లిదండ్రులను షాక్ కి గురి చేసింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆమె కూతురు తమ ఆశల మీద నీళ్లు చల్లేసింది.. రాత్రి ఎవరూ లేని సమయంలో హాస్టల్ లో..

Nursing Student Fell Down From Hostel Building In Bengaluru: మలయాళీ నర్సింగ్ స్టూడెంట్ తీసుకున్న నిర్ణయం ఆమె తల్లిదండ్రులను షాక్ కి గురి చేసింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆమె కూతురు తమ ఆశల మీద నీళ్లు చల్లేసింది.. రాత్రి ఎవరూ లేని సమయంలో హాస్టల్ లో..

నర్సింగ్ స్టూడెంట్ నిర్ణయంతో షాక్‌లో తల్లిదండ్రులు.. రాత్రి ఎవరూ లేని టైంలో

ఈ మధ్య కాలంలో అమ్మాయిలు అబ్బాయిలతో పాటు సమానంగా ఉంటున్నారు. మంచి విషయాలలోనే కాకుండా చెడు విషయాల్లో కూడా అబ్బాయిలతో పోటీ పడుతున్నారు. తప్పుడు నిర్ణయాలతో తల్లిదండ్రులను ఏడిపిస్తున్నారు. కొడుకులా కాకుండా కూతురిలా పెంచి.. చదివిస్తుంటే కన్నవాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లేసి వెళ్లిపోతున్నారు. ఇటీవల కాలంలో కన్నవాళ్ళకి ద్రోహం చేసి వదిలేసి వెళ్ళిపోతున్న వారిలో అమ్మాయిలు కూడా ఉంటున్నారు. అబ్బాయిలే అనుకుంటే అమ్మాయిలు అంతకంటే దారుణంగా తయారవుతున్నారు. చదువుకొని ప్రయోజకురాలు అయ్యి తిరిగి వస్తుందనుకున్న కూతురు.. ఆ తల్లిదండ్రుల కన్నీళ్లకు కారణమైంది. తాజాగా ఓ అమ్మాయి తీసుకున్న నిర్ణయంతో ఆమె తల్లిదండ్రులు షాక్ లోకి వెళ్లిపోయారు. హాస్టల్ లో రాత్రి ఎవరూ చూడని సమయం చూసి.. 

మలయాళీ నర్సింగ్ స్టూడెంట్ బెంగళూరు లోని హాస్టల్ లో శవమై కనిపించింది. కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోని పుత్తుకోడ్ గ్రామానికి చెందిన గంగాధరన్ కూతురు అతుల్య గంగాధరన్ (19).. విద్యోదయ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ చదివేది. బీఎస్సీ మొదటి సంవత్సరం విద్యార్థిని అయిన అతుల్య.. నిన్న ఆదివారం రాత్రి హాస్టల్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అతుల్య హాస్టల్ లో ముగ్గురు క్లాస్ మేట్స్ తో కలిసి ఉంటుంది. అమ్మాయి హాస్టల్ బిల్డింగ్ పై నుంచి పడిపోయినట్టు సమాచారం రావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. అతుల్య మరణానికి కారణం ఏంటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎవరైనా తోసేశారా? లేక ఆమెనే ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది.  

ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా డిప్రెషన్ తో బాధపడుతుందని.. అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. అయితే డిప్రెషన్ కి గల కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. కాగా కాలేజ్ యాజమాన్యం విద్యార్థిని తల్లిదండ్రులకు, బంధువులకు సమాచారం అందించారు. ఆదివారం రాత్రి సమయంలో హాస్టల్ భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందని వెల్లడించారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని మంగళవారం నాడు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. ఆమె ఐడీ కార్డు ప్రకారం.. ఆమె 2023లో కాలేజ్ లో చేరింది. 2027లో నర్సింగ్ పూర్తి చేసుకుని తల్లిదండ్రుల ఆశలను నిజం చేయాల్సి ఉంది. కానీ అంతలోనే ఆమె దారుణ నిర్ణయం తీసుకుంది. దీంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంకో మూడేళ్ళలో బీఎస్సీ పూర్తి చేసి ఉద్యోగం సంపాదించి.. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటుందని భావిస్తే ఆ తల్లిదండ్రుల ఆశలను సమాధి చేసి వెళ్ళిపోయింది.