iDreamPost
android-app
ios-app

సామాన్యుల నెత్తిన మరో పిడుగు.. భారీగా పెరగనున్న మందుల ధరలు

  • Published Jun 20, 2024 | 11:12 AM Updated Updated Jun 20, 2024 | 11:12 AM

పెరుగుతున్న ధరలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనాల నెత్తని మరో బాంబు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. జనాలు ఎక్కువగా ఉపయోగించే పలు ట్యాబ్లెట్స్‌ రేట్లను పెంచేందుకు రెడీ అయ్యింది. ఆ వివరాలు..

పెరుగుతున్న ధరలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనాల నెత్తని మరో బాంబు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. జనాలు ఎక్కువగా ఉపయోగించే పలు ట్యాబ్లెట్స్‌ రేట్లను పెంచేందుకు రెడీ అయ్యింది. ఆ వివరాలు..

  • Published Jun 20, 2024 | 11:12 AMUpdated Jun 20, 2024 | 11:12 AM
సామాన్యుల నెత్తిన మరో పిడుగు.. భారీగా పెరగనున్న మందుల ధరలు

ఎన్నికలు ముగిశాయి. దాంతో అన్నింటి రేట్లకు రెక్కలు వచ్చాయి. పప్పులు, ఉప్పులు మొదలు సబ్బులు, షాంపులు, నూనె ఇలా ప్రతి దాని ధరలు పెరుగుతూనే ఉన్నాయి. నెల క్రితం వరకు స్థిరంగా ఉన్న వీటి ధరలు.. ఎన్నికలు అయిపోగానే దూసుకుపోతున్నాయి. నిత్యవసరాల ధరలకు తోడు.. కూరగాయల రేట్లు కూడా భారీగా పెరుగుతున్నాయి. టమాటా సహా మిగతా కూరగాయల ధరలన్ని.. 100 రూపాయలు దాటేశాయి. పెరుగున్న ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇక ఇప్పట్లో ధరలు దిగి వచ్చే అవకాశం లేదంటున్నారు. ఇవి చాలదన్నట్లు కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ట్యాబెట్ల్స్‌ రేట్లను పెంచేందుకు రెడీ అవుతోంది. ఆ వివరాలు..

కేంద్ర ప్రభుత్వం మరోసారి సామాన్యలకు భారీ షాక్‌ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే నిత్యవసరాల ధరలు విపరీతంగా పెంచేందుకు అనుమతిచ్చి ప్రభుత్వం.. ఇప్పుడు ట్యాబ్లెట్స్ ధరలను పెంచడానికి సిద్ధం అవుతోంది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) ఈ మేరకు ప్రకటన చేసింది. డయాబెటిస్, బీపీ సహా 54 రకాల జబ్బుల ఔషధాల ధరలను పెంచుతున్నట్లు వెల్లడించింది. సమాజంలో ఎక్కువ మంది బీపీకి వినియోగించే టెల్మిసార్టన్, క్లోర్తాలిడోన్, సిల్నిడిపైన్ కలిపిన మాత్రలు రిటైల్ ధర ఒక్కో టాబ్లెట్‌కు రూ.7.14గా నిర్ణయించింది కేంద్రం.

The prices of medicines will increase drastically

అలానే సిప్రోఫ్లోక్సాసిన్ యాంటీ బాక్టీరియల్ ఇంజక్షన్ ధర మిల్లీలీటర్ (మి.లీ)కు రూ.0.23గా ప్రభుత్వం సవరించింది. అలానే నేటి కాలంలో జనాలు అధికంగా వినియోగించే మెటా ఫార్మిన్, లినాగ్లిస్టిన్, సిటాగ్లిస్టిన్ రేట్లను ఒక్క ట్యాబ్లెట్‌కు రూ.15-రూ.20కు పెంచుతున్నట్లు చెప్పుకొచ్చింది. యాంటీ బ్యాక్టీరియల్ ఇంజెక్షన్ సిప్రోఫ్లోక్సాసిన్, కాల్షియం, విటమిన్ డీ3 పిల్స్ ధరలు సైతం భారీగా పెరిగాయి. వీటితో పాటు కొలెస్ట్రాల్‌కు చికిత్స కోసం వినియోగించే అటోర్వాస్టాటిన్, ఆస్పిరిన్ కలయిక క్యాప్సూల్స్ రిటైల్ రేట్లను కూడా ఎన్‌పీపీఏ పెంచుతున్నట్లు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సామాన్యులకు భారంగా మారనుంది.

క్యాల్షియం, విటమిన్ డి3 ట్యాబ్లెట్ల ధరను ఒక్కో ట్యాబ్లెట్‌ ధరను రూ.7.82గా నిర్ణయించడంతో పాటు యూరో హెడ్ ప్లాస్టిక్ బాటిళ్లతో కూడిన 500 ఎంఎల్ గ్లూకోజ్ ప్యాక్ ధర కూడా పెంచింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, ఎన్‌పీపీఏ నిర్ణయం మేరకు.. మధుమేహం, రక్తపోటు, గుండె సమస్యలు, మల్టీవిటమిన్‌లు, బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు, అలర్జీలకు సంబంధించిన ట్యాబ్లెట్స్, ఫార్ములేషన్‌ ఔషధాల రేట్లను మోదీ ప్రభుత్వం సవరించింది. దీనిపై సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలు కాపాడే మందుల ధరలను కూడా ఇంత భారీగా పెంచుతారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.