iDreamPost
android-app
ios-app

అమెజాన్‌లో ఇంత దారుణమా? టార్గెట్‌ పూర్తైతేనే వాష్‌రూమ్‌కి.. యువకుడి ఆవేదన!

  • Published Jun 15, 2024 | 2:11 PM Updated Updated Jun 15, 2024 | 2:11 PM

Amazon Warehouse: చాలా సంస్థలు తమ కంపెనీలో పని చేసే కార్మికుల, ఉద్యోగులక ఆరోగ్యం, వారి భద్రతకు ఎంతో ప్రాధాన్యత ఇస్తాయి. కానీ మరికొన్ని సంస్థలు మాత్రం తమ వద్ద పని చేసే వారిని బానిసలు గా భావిస్తుంటాయి

Amazon Warehouse: చాలా సంస్థలు తమ కంపెనీలో పని చేసే కార్మికుల, ఉద్యోగులక ఆరోగ్యం, వారి భద్రతకు ఎంతో ప్రాధాన్యత ఇస్తాయి. కానీ మరికొన్ని సంస్థలు మాత్రం తమ వద్ద పని చేసే వారిని బానిసలు గా భావిస్తుంటాయి

  • Published Jun 15, 2024 | 2:11 PMUpdated Jun 15, 2024 | 2:11 PM
అమెజాన్‌లో ఇంత దారుణమా? టార్గెట్‌ పూర్తైతేనే వాష్‌రూమ్‌కి.. యువకుడి ఆవేదన!

ప్రతి ఒక్కరు జీవనోపాధి కోసం కూలీలుగా అనేక రకాల పనులు చేస్తుంటారు. అంతేకాక  వివిధ సంస్థల్లో ఉద్యోగులుగా చేరుతుంటారు. ఈ క్రమంలో చాలా సంస్థలు తమ కంపెనీలో పని చేసే కార్మికుల, ఉద్యోగులక ఆరోగ్యం, వారి భద్రతకు ఎంతో ప్రాధాన్యత ఇస్తాయి. కానీ మరికొన్ని సంస్థలు మాత్రం తమ సంస్థలో పని చేసే వారిని బానిసలు గా భావిస్తుంటారు. అందుకే బాగా పని ఒత్తిడి పెడుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా అమెజాన్ ఇండియా సంస్థ విషయంలో ఓ యువకుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. అక్కడ ఉండే మేనెజర్లు తమకు టార్గెట్ పూరయ్యే వరకు వాష్ రూమ్, వాటర్ బ్రేక్ ఇవ్వరంటూవెల్లడించారు. మరి..ఎక్కడ, అసలు సంగతి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

హర్యానా రాష్ట్రంలోని మనేసర్ ప్రాంతంలో అమెజాన్ ఇండియా కు చెందిన ఐదు గిడ్డంగులు ఉన్నాయి. ఇక్కడ అనేక మంది పని చేస్తున్నారు. వస్తువుల ఎగుమతి, దిగుమతి ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉందని ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తాను సంపాదిస్తున్న డబ్బులు, అక్కడ పడుతున్న శ్రమ గురించి చెప్పుకొచ్చాడు. మనేసర్ లో ఉన్న అమెజాన్ కి చెందిన ఐదు గిడ్డుంగుల్లో వారానికి ఐదు రోజులు పని చేయాలని, రోజుకు 10 గంటల చెప్పున పని ఉంటుందని, ఫలితంగా నెలకు రూ.10 వేల జీతం వస్తుందని ఆ యువకుడు వెల్లడించారు. ఇదే సమయంలో అక్కడ పనిచేసే సీనియర్లు బాగా ఇబ్బంది పెట్టే వారని పేర్కొన్నాడు. షిఫ్ట్ సమయంలో టైమ్ వృథా చేయకూడదని వాష్ రూమ్ లలో ఎవరైనా ఉంటారేమో అని కూడా చెక్ చేస్తుంటారని  ఆ యువకుడు తెలిపాడు.

భోజన విరామం,లేదా టీ బ్రేక్ సమయంలో కూడా కనీసం 30 నిమిషాలు విరామం లేకుండా పని చేయాలని, అలా చేసినా కూడా రోజుకు నాలుగు ట్రక్కుల కంటే ఎక్కువ దించలేమని తెలిపాడు. అయినా కూడా పనిని మరింత పెంచాలని సీనియర్లు ఒత్తిడి తీసుకువస్తుంటారని, వారు అనుకున్న పని పూర్తి చేసేవరకు కనీసం నీరు తాగడానికి, వాష్‌రూమ్ వంటి వాటికి కూడా వెళ్ళమని తమ చేత వాగ్దానం చేయించారని  తెలిపాడు. అలానే  మహిళలు కూడా తమలాగే ఇబ్బందులు పడుతున్నారని తెలిపాడు. అక్కడ పని చేసే ప్రదేశంలో మహిళలు అనారోగ్యానికి గురైతే విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేక రూమ్ లు కూడా లేవని పేర్కొన్నాడు. ఎవరైన మహిళలు అనారోగ్యానికి గురైతే.. వాష్‌రూమ్ లేదా లాకర్ రూమ్‌లో ఉండాల్సి వస్తుందని అన్నాడు.

ప్రతి రోజు తొమ్మిది గంటలు నిలబడే పని చేయాలని, పనిచేసే కార్మికులకు కనీస సదుపాయాలు లేవని ఆ యువకుడు వాపోయాడు. ఇక ఈ వ్యాఖ్యలపై అమెజాన ఇండియా సంస్థ అధికారులు కూడా స్పందించారు. ఇలాంటి కఠినమైన నిబంధనలు ఎప్పుడూ పెట్టలేదని, ఒక వేళ మాకు తెలియకుండా ఇలాంటివి జరుగుతున్నాయా అనే విషయంపై విచారణ చేస్తాని తెలిపారు. ఇక ఆ కార్మికులు చెప్పింది నిజమైతే అలాంటి నిబంధనలను పూర్తిగా నిలిపివేస్తామని పేర్కొన్నారు. తమ సంస్థలో పనిచేసే ఉద్యోగుల ఆరోగ్యం, భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు. మొత్తంగా ఈ ఇష్యూ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio