P Krishna
జాతీయ రహదారులపై టోల్ గేట్ వద్ద కొన్నిసార్లు వాహనాలు ఆగిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఇకపై ఆ కష్టాలకు చెక్ బెట్టబోతుంది కేంద్రం.
జాతీయ రహదారులపై టోల్ గేట్ వద్ద కొన్నిసార్లు వాహనాలు ఆగిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఇకపై ఆ కష్టాలకు చెక్ బెట్టబోతుంది కేంద్రం.
P Krishna
టోల్.. దీన్నే టోల్ టాక్స్ అని కూడా పిలుస్తారు.. ఇది వాహనదారులకు చెల్లించాల్సిన ట్యాక్స్. హైవేలు, ఇంటర్ స్టేట్ ఎక్స్ ప్రెస్ వేలు, టర్న్ పైక్, సొరంగాలు, వంతెనల వంటి కొన్ని రహదారులపై టోల్ టాక్స్ వసూలు చేయబడుతుంది. టోల్ పన్నును జాతీయ రహదారి రుసుము అని కూడా పిలుస్తారు. రహదారి మౌలిక సదుపాయాల కోసం వాహనదారుల నుంచి టోల్ పన్ను వసూలు చేయబడుతుంది. కొన్ని సందర్బాల్లో టోల్ గేట్ వద్ద విపరీతంగా రద్దీ ఉంటుంది.. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుంది. ముఖ్యంగా పండుగలు, ప్రత్యేక రోజుల్లో ఈ ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. తర్వలో టోల్ గేట్ కష్టాలు తీరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
బారత్ లో ఇకపై టోల్ గేట్ వద్ద గంటల కొద్ది వెయిటింగ్ చేయాల్సిన పనిలేదు. భారత్ లో అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. ఒకప్పుడు రహదారులపై టోల్ గేట్స్ వద్ద భారీ క్యూ లైన్స్ దర్శనమిచ్చేవి. ఫాస్టాగ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత టోల్ పేమెంట్ విధానం ఈజీగా మారింది. త్వరలో మరో అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. దీంతో టోల్ గేట్ వద్ద గంటల కొద్ది వెయిట్ చేయకుండానే ఆటోమెటిగ్ గా టోల్ చెల్లింపులు జరిగిపోనున్నాయి. శాటిలైట్ ఆధారిత టోల్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్ లో శాటిలైట్ సిస్టమ్ గురించి తెలిపారు. రాబోయే కొద్ది రోజుల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు.
ఇకపై టోల్ పాయింట్స్ కూడా తొలగిస్తామని తెలిపారు. ఈ వ్యవస్థలో మీరు రోడ్డు ఎక్కగానే మీ నంబర్ ప్లేట్ ఫోటో ఆటోమెటిక్ గా తీసుకుంటుంది.. మీరు ఎక్కడ నుంచి ఎక్కడికి ప్రవేశిస్తారు.. ఎక్కడ నిష్క్రమిస్తారు అన్న విషయాలు మొత్తం క్రోడీకరించి.. ఆటోమెటిగ్ గా మీ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు కట్ అవుతాయి. ఇందుకోసం వాహనదారులు పాస్టాగ్ కు తమ ఖాతాను లింక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధానం వల్ల సమయం కూడా బాగా సేవ్ అవుతుందని తెలిపారు.