iDreamPost
android-app
ios-app

వీడియో: ‘కన్యాదానం’పై నీతా అంబానీ స్పీచ్.. పెళ్లిలో అతిథుల భావోద్వేగం!

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసింది. అయితే ఈ వేడుక అనంతరం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నీతా అంబానీ చెప్పిన మాటలకు అక్కడి వారు భావోద్వేగానికి గురయ్యారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసింది. అయితే ఈ వేడుక అనంతరం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నీతా అంబానీ చెప్పిన మాటలకు అక్కడి వారు భావోద్వేగానికి గురయ్యారు.

వీడియో: ‘కన్యాదానం’పై నీతా అంబానీ స్పీచ్.. పెళ్లిలో అతిథుల భావోద్వేగం!

ప్రపంచ కుబేరుడైన ముఖేశ్ అంబానీ గురించి  ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గత ఐదు నెలల నుంచి వారి ఇంట పెళ్లి వేడుకలకు జరుగుతున్న సంగతి తెలిసింది. ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం అంగరంగ వైభవంగా జరిపించారు. తరతరాలు గుర్తుంచుకునేలా అనంత్ అంబానీ పెళ్లి వేడుకను ముకేశా అంబానీ దంపతులు నిర్వహించారు. ఇటీవల జూలై 12వ తేదీన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం జరిగింది. తాజాగా అతిథులతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ చెప్పిన మాటలకు అక్కడి వారు భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం  వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ సతీమణి నీతా అంబానీ..తన చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ– రాధికా మర్చంట్  పెళ్లి  వేడుకలో ‘కన్యాదానం’ ప్రాముఖ్యను ఉద్వేగభరితంగా వివరించారు. ఆమె మాటలకు అంబానీ కుటుంబసభ్యులతో పాటు అతిథుల కళ్లు చమర్చాయి. ఆడపిల్లలు లక్ష్మీ స్వరూపులని, ఏ తల్లిదండ్రులైనా వారిని వేరే ఇంటికి పంపించాలని కోరుకోరని ఆమె అన్నారు. ఇంకా నీతా అంబానీ మాట్లాడుతూ…హిందూ సంప్రదాయంలో కన్యాదానం అనేది చాలా గొప్పదని తెలిపింది. ఒక ఆడబిడ్డ కొన్నేళ్లుగా తన కుటుంబంతో పెంచుకున్న అనుబంధం, ఆప్యాయతను ఎలా దూరం కాగలదు. పుట్టింటి బంధం శాశ్వతంగా ఉంటుందని ఆమె అన్నారు. అలానే కుమార్తెను మరొకరికి బదిలీ చేయడానికి ఆమె ఆస్తి కాదనీ, మన కుటుంబానికి దక్కిన ఆశీర్వాదం అని ఆమె పేర్కొన్నారు. పెళ్లి అనే బంధంతో ఇప్పుడామె  తన కొత్త  ఫ్యామిలీతో పంచుకుంటుందని నీతా అంబానీ అన్నారు.

మన సంస్కృతీ సంప్రదాయాలు మహిళలకు ఎంతో గౌరవం ఇచ్చాయని, వారు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని పవిత్ర గ్రంథాలు నేర్పించాయని ఆమె తెలిపారు. అమ్మాయిలు మన ఇళ్లను స్వర్గంగా మారుస్తారని, వివాహ బంధం అనేది.. నూతన దంపతుల మధ్య, వారి కుటుంబాల మధ్య సంపూర్ణ సమానత్వమనే పునాదిపై ఆధారపడి ఉంటుంని ఆమె అన్నారు. వధువు తల్లిదండ్రులు వరుడిని తమ కొడుకుగా అంగీకరించడం, తమ కుమార్తెను ఒక వ్యక్తి చేతుల్లో పెట్టడమే కన్యాదానానికి నిజమైన అర్థమైని ఆమె తెలిపారు. తాను కూడా ఒక అమ్మాయికి తల్లిని, అత్తను కూడా అని తెలిపింది. ఆడపిల్లలు పుట్టగానే అష్టైశ్వర్యాలు లభిస్తాయని, కుటుంబాల్లో ఆనందం అనే వెలుగులతో విరాజిల్లుతాయని నీతా వివరించారు. ఇక నీతా అంబానీ చెప్పిన మాటలకు అక్కడి వచ్చిన అతిథులు భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.