P Krishna
Rameshwaram Bomb Blast Case: ఇటీవల బెంగుళూరులోని రామేశ్వరం కేఫ్ లో జరిగిన బాంబు పేలుళ్ల ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ కేసును ఎన్ఐఏ సీరియస్ గా తీసుకొని దర్యాప్తు చేస్తుంది.
Rameshwaram Bomb Blast Case: ఇటీవల బెంగుళూరులోని రామేశ్వరం కేఫ్ లో జరిగిన బాంబు పేలుళ్ల ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ కేసును ఎన్ఐఏ సీరియస్ గా తీసుకొని దర్యాప్తు చేస్తుంది.
P Krishna
ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. బాంబు దాడులు, ఊచకోతలతో అలజడి సృష్టిస్తున్నారు. వారి లక్ష్యాలు ఏవైనా ఎంతోమంది అమాయకుల ప్రాణాలు బలి అవుతున్నాయి. ఏ క్షణంలో బాంబ్ పేలుళ్లు జరుగుతాయో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. భారత్ లో అలజడి సృష్టించేందుకు కొంతమంది ముష్కరులు బాంబ్ బ్లాస్ట్, కాల్పులకు తెగబడుతూ భయబ్రాంతులు సృష్టిస్తున్నారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగుళూరు రామేశ్వరం కేఫ్ బ్లాంబ్ బ్లాస్ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నింధితుడిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. వివరాల్లోకి వెళితే..
బెంగుళూరులోని రామేశ్వరం కేఫ్ లో బాంబు పేలుడు తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో పదిమంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. అందులో కేఫ్ సిబ్బంది.. కస్టమర్లు ఉన్నారు. తాజాగా రామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ ఘటనలో కీలక నింధితులు ముస్సార్ విర్ హుస్సేన్ షాజిబ్, పేలుడు ప్రధాన సూత్రదారి అబ్దుల్ మతీన్ తాహా ని ఎన్ఐఏ అధికారులు ఎట్టకేలకు శుక్రవారం అరెస్ట్ చేశారు. బాంబ్ బ్లాస్ పేలుళ్ల అనంతరం వీరు అస్సాం, పశ్చిమ బెంగాల్ లో తలదాచుకున్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు తెలిపాయి. కాకపోతే దీనిపై ఎన్ఐఏ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. నిందితుడు ముస్పావిర్ హుస్సేన్ షాజిత్ ధరించిన క్యాప్ సహాయంతో ఆచూకీ లభించింది. మతిన్ తహాను అదుపులోకి తీసుకొని విచారించగా.. హుస్సేన్ షాజీబ్ గురించి పూర్తి వివరాలు అందించినట్లు సమాచారం.
రామేశ్వరం కేఫ్ బ్లాస్టింగ్ తర్వాత ఎన్ఐఏ ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకొని దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలోనే ఉగ్రవాద కార్యకలాపాలపై అనుమానంతో ఇప్పటికే జైల్లో ఉన్న ఉగ్రవాదులను విచారించి ఈ కేసులో ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఈ సమయంలో అనుమానిత ఉగ్రవాది షరీక్, జైల్లో ఉన్న మతిన్, ఇప్పుడు కస్టడీలో ఉన్న హుస్సేన్ మధ్య సంబంధాలు ఉన్నట్లే తెలిందని అధికారులు అంటున్నారు. మార్చి 1 న బెంగుళూర్ లోని రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనలో 10 మంది గాయపడ్డారు. మాస్క్, టోపీ ధరించిన ఓ వ్యక్తి కేఫ్ లోకి వెళ్లి అక్కడ బ్యాగ్ వదిలి బయటకు వచ్చిన కొద్ది నిమిషాల్లోనే బ్లాస్టింగ్ జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు అయ్యాయి.
#RameshwaramCafe accused arrested from #WestBengal pic.twitter.com/hmtccWxVXT
— JOKER (@TheJokerBhai) April 12, 2024