New SIM Card: నేటి నుంచి కొత్త రూల్స్.. అతిక్రమిస్తే రూ.10 లక్షలు జరిమానా!

కొత్త సిమ్ కార్డుల జారీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది. డిసెంబర్ 1 నుంచి ఆ కొత్త నిబంధనలు అమలు కానున్నాయి. వాటిని అతిక్రమిస్తే.. రూ.10 లక్షలు జరిమానా విధించనున్నారు. మరి.. ఆ రూల్స్ ఏంటంటే..

కొత్త సిమ్ కార్డుల జారీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది. డిసెంబర్ 1 నుంచి ఆ కొత్త నిబంధనలు అమలు కానున్నాయి. వాటిని అతిక్రమిస్తే.. రూ.10 లక్షలు జరిమానా విధించనున్నారు. మరి.. ఆ రూల్స్ ఏంటంటే..

ప్రస్తుతం సమాజం ఎక్కువగా ఫోన్ పైనే నడుస్తుంది. మొబైల్ లేకుండా క్షణం కూడా ఉండలేకపోతున్నారు నేటి కాలం మనుషులు. ఇక కొందరు అయితే తమ ఫోన్స్ లో తరచూ సిమ్ కార్డులు మారుస్తూ ఉంటారు. ఇలా తరచూ సిమ్ కార్డులు మారుస్తూ ఉగ్రవాద కార్యకలాపాలకు,నేరాలకు పాల్పడే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. వినియోదారుడి నుంచి సరైన ధృవపత్రాలు లేకుండా, ఇష్టానుసారంగా సిమ్ కార్డులు జారీ చేయడం కారణంగా నేరాలు, ఇతర దారుణాలు జరుగుతున్నాయి. సిమ్ కార్డుల విక్రయానికి సంబంధించి డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ రానున్నట్లు గత ఆగష్టు నెలలోనే కేంద్రం చెప్పింది. ఈ నేపథ్యంలో కేంద్రం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త రూల్స్ ప్రకారం.. పీఓఎస్ ఏజెంట్లు చట్ట వ్యతిరేఖ కార్యకలాపలకు పాల్పడకుండా టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ లేదా లైసెన్స్ దారు అగ్రిమెంట్ పై సంతకం చేయాలి. నియమ, నిబంధనలను అతిక్రమించిన ఏజెంట్లకు రూ.10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. అంతేకాకుండా వారి  లైసెన్స్ ను కూడా రద్దు చేసే అవకాశం ఉంది. కొత్త సిమ్ కార్డును విక్రయించే విషయంలో టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ చాలా జాగ్రత్తగా ఉండాలి. సిమ్ కార్డు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారుడు తప్పనిసరిగా వ్యక్తిగత  వివరాలను అందించాలి.

సిమ్ కార్డు విక్రయించే ఏజెంట్ కొనుగోలు చేసే వ్యక్తి ఆధార్ కార్డు క్యూర్ స్కాన్ చేసి వివరాలు సేకరిస్తాడు. ఇక్కడ మరోక విషయం గుర్తుంచుకోవాలి. ఒక సిమ్ డిస్ కనెక్ట్ అయిన 3 నెలలు లేదా 90 రోజుల తరువాత  కొత్త వినియోదారుడికి ఆ ఫోన్ నెంబర్ ను కేటాయించాలి.  ఇక కేంద్రం తీసుకొచ్చిన కొత్త రూల్స్  ప్రకారం.. ఒక వ్యక్తి, ఒక ఐడీ కార్డుపై గరిష్టంగా  9 సిమ్ కార్డులు మాత్రమే తీసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ కొనుగోలు చేయకూడదు.

అయితే కమర్షియల్ , వ్యాపారం, కార్పొరేట్ అకౌంట్లకు మాత్రం ఈ రూల్ వర్తించదు. కానీ ఎన్ని సిమ్ కార్డులు కొనుగోలు చేయవచ్చనే అంశం మాత్రం వెల్లడి కాలేదు.సిమ్ కార్డుల విక్రయానికిసంబంధించిన కొత్త రూల్స్ డిసెంబర్ 1 నుంచే రానున్నట్లు ఆగష్టు నెలలోనే కేంద్రం తెలిపింది. ఆ నిర్ణయం ప్రకారమే.. నేటి నుంచి పై కొత్త రూల్స్ ను అమలులోకి రానున్నాయి. మరి.. కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ  కొత్త రూల్స్ , జరిమాన అంశం సరైనదేనా?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments