nagidream
How Many Years Took For Ambani Wealth Become Zero, Netizens Calculations: రజినీకాంత్ నటించిన అరుణాచలం సినిమాలో 30 రోజుల్లో 30 కోట్లు ఖర్చు పెడితే 300 కోట్లు వస్తాయని ఒక ఛాలెంజ్ ఉంటుంది. ఆ ఛాలెంజ్ లో అరుణాచలం 30 రోజుల్లో 30 కోట్లు ఖర్చు పెట్టి చూపిస్తారు. అలా ముకేష్ అంబానీ రోజుకి కోటి కాదు 3 కోట్లు, 10 కోట్లు ఖర్చు పెట్టినా గానీ ఈ జన్మకు మాత్రం అంబానీ సంపద కరగదట. అంతలా ఆయన సంపద ఉంది.
How Many Years Took For Ambani Wealth Become Zero, Netizens Calculations: రజినీకాంత్ నటించిన అరుణాచలం సినిమాలో 30 రోజుల్లో 30 కోట్లు ఖర్చు పెడితే 300 కోట్లు వస్తాయని ఒక ఛాలెంజ్ ఉంటుంది. ఆ ఛాలెంజ్ లో అరుణాచలం 30 రోజుల్లో 30 కోట్లు ఖర్చు పెట్టి చూపిస్తారు. అలా ముకేష్ అంబానీ రోజుకి కోటి కాదు 3 కోట్లు, 10 కోట్లు ఖర్చు పెట్టినా గానీ ఈ జన్మకు మాత్రం అంబానీ సంపద కరగదట. అంతలా ఆయన సంపద ఉంది.
nagidream
ముకేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ఉన్నారు. అలాంటి అంబానీ ఆస్తి సున్నా అవ్వాలంటే ఎన్ని రోజులు పడుతుందో తెలుసా? విచ్చలవిడిగా ఖర్చు పెట్టినా గానీ వందేళ్లు సరిపోవడం లేదు. సుమారు వెయ్యేళ్ళు పడుతుంది ఆయన సంపద ఆవిరి అవ్వాలంటే. రజినీకాంత్ నటించిన అరుణాచలం సినిమా చూసే ఉంటారు. ఆ మూవీలో 30 రోజుల్లో 30 కోట్లు ఖర్చు చేయాలి. కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయన్నట్టు ఆ సినిమాలో 30 రోజుల్లో 30 కోట్లు ఖర్చయిపోతాయి. కానీ ముకేష్ అంబానీ విషయంలో అలా కాదు. రోజుకు 3 కోట్లు, 5 కోట్లు ఖర్చు పెట్టినా గానీ ఆస్తి సున్నా అవ్వడం అనేది అసాధ్యమని నెటిజన్స్ కొత్త లెక్కలు వేస్తున్నారు.
జూలై 12న అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహ వేడుక జరిగిన విషయం తెలిసిందే. ముకేశ్ అంబానీ తన కుమారుడి పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపారు. ఈ పెళ్ళికి దేశ, విదేశాల నుంచి ప్రముఖ సినీ, రాజకీయ, వ్యాపారవేత్తలు, క్రీడాకారులు హాజరయ్యారు. అంబానీ ఇంట పెళ్లి అంటే ఆ మాత్రం ఉండాలి అనేంతగా పండగలా జరిపారు. అయితే ఇంత ఘనంగా చేసినప్పటికీ అనంత్ అంబానీ తన కుమారుడి పెళ్లి కోసం ఖర్చు చేసింది కేవలం 0.5 శాతం మాత్రమేనట. ఇది సామాన్య, మధ్యతరగతి వాళ్ళ ఇంట్లో చేసే పెళ్లి ఖర్చులతో పోలిస్తే చాలా తక్కువ అట. అన్ని లక్షల కోట్ల ఆస్తి ఉండి కూడా ముకేష్ అంబానీ కేవలం 5 వేల కోట్లతో పెళ్లి జరిపించేశారని అంటున్నారు.
కాగా అనంత్ అంబానీ పెళ్లితో మరోసారి ముకేశ్ అంబానీ ఆస్తి ఎంత అనే దాని మీద చర్చ మొదలైంది. ముకేష్ అంబానీ ఏ పని చేయకుండా రోజూ కోట్లు ఖర్చు పెడుతూ పోతే ఆ సంపద కరగడానికి ఎన్నేళ్లు పడుతుంది అంటూ నెటిజన్స్ లెక్కలు వేస్తున్నారు. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి కానీ అంబానీ సంపద మాత్రం అంత త్వరగా కరగదని నెటిజన్స్ కి అర్థమైంది. ముకేష్ అంబానీ బిజినెస్ పరంగా ఎలాంటి ఖర్చులు చేయకుండా.. ఎలాంటి పని చేయకుండా ఆస్తి మీద ఆధారపడి జీవిస్తూ రోజూ ఎంత ఖర్చు పెడితే ఆయన సంపద ఆవిరైపోతుంది.. అలా జరగడానికి ఎన్నేళ్లు పడుతుంది అనే లెక్కలు వేస్తున్నారు.
అంబానీ రోజుకు 3 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా గానీ అంబానీ సంపద జీరో అవ్వడానికి 932 సంవత్సరాల 6 నెలలు పడుతుందట. అంటే 3,40,379 రోజులు పడుతుందట. అంటే ఇంకో 9 తరాల వాళ్ళు కూర్చుని తిన్నా గానీ ఆస్తి కరగదన్నమాట. ఇక బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ముకేష్ అంబానీ సంపద ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 2 లక్షల కోట్లు పెరిగింది. బ్లూమ్ బర్గ్ నివేదిక ప్రకారం.. అంబానీ సంపద 121 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే మన కరెన్సీ ప్రకారం రూ. 10 లక్షల కోట్లకు పైనే అన్న మాట. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో 11వ స్థానంలో ఉన్నారు ముకేష్ అంబానీ. భారతదేశంతో పాటు ఆసియాలోనే అత్యంత సంపన్నుడుగా ముకేష్ అంబానీ ఉన్నారు.