Neha Public School: VIDEO: ఛీ.. ఈమె ఓ టీచరా? ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చే ఘటన

VIDEO: ఛీ.. ఈమె ఓ టీచరా? ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చే ఘటన

ఓ మంచి సమాజం నిర్మించాలంటే ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉంటుంది. విద్యతో పాటు ఉన్నత వ్వక్తిత్వాన్ని పిల్లలకు నేర్పించగల అవకాశం టీచర్లకు ఉంటుంది. తెల్లకాగితం లాంటి వారి మనుసులపై మానవత్వం, మంచితనం, ఉన్నత విలువలతో కూడిన జీవితం భవిష్యత్తులో ఎలా గడపాలో వారికి వివరిస్తూ.. వారిని సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత, హక్కు ఉపాధ్యాయులకు ఉంటుంది. తల్లిదండ్రులు చెప్పినా వినని పిల్లలు టీచర్ల చెప్పింది వింటారు. వారిపై ఉపాధ్యాయుల ప్రభావం అంతబలంగా ఉంటుంది. చాలా విద్యార్థులు.. తమ స్కూల్‌ డేస్‌లో టీచర్లనే తమ స్ఫూర్తిగా తీసుకుంటూ ఉంటారు. వారేది చెబితే అది చేస్తారు.

సరిగ్గా వారి ఆలోచన శక్తి పెరుగుతున్న సమయంలో వీలైనంత మంచిని, ఉన్నత విలువలను, మానవత్వ స్ఫూర్తిని వారి మెదడులో నింపే ప్రయత్నం ఉపాధ్యాయలు చేయాలి. అప్పుడే వారి నుంచి విద్యాబుద్ధులు నేర్చుకున్న ఆ విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగి, కన్నవారికి, ఈ సమాజానికి ఉపయోగపడతారు. కానీ, ఇక్కడ ఓ టీచరమ్మ మాత్రం.. విద్యార్థుల హృదయాల్లో విధ్వేషపు విషబీజాలను నాటుతోంది. ఆ పసి మనసులపై మతం పేరిట నల్లరాతలు రాస్తోంది. సభ్యసమాజం, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ప్రతిఒక్కరూ సిగ్గుతో తలదించుకునేలా ఉన్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన జరిగిన స్కూల్‌పై, ఆ టీచర్‌పై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు. ఇంతకీ అసలక్కడ ఏం జరిగింది? ఈ ఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లోని నేహా పబ్లిక్‌ స్కూల్‌లో ఓ టీచరమ్మ.. తన తరగతిలోంచి ఓ విద్యార్థిని నిలబెట్టి అతన్ని మతం పేరిట తిట్టడమే కాకుండా తోటి విద్యార్థుల్లో వేరే మతానికి చెందిన విద్యార్థులతో నిలబెట్టిన విద్యార్థిని చెప్పదెబ్బలు కొట్టించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఈ అసల విద్యా, ఉన్నత విలువలు నేర్పాల్సిన పాఠశాల్లలో ఇలాంటి పనులు ఏంటి అంటూ ప్రజలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. దెబ్బలు తిన్న విద్యార్థి మతంతో అసలు ఆ టీచర్‌కు ఏంటి సంబంధమని, అయినా దెబ్బలు తిన్న విద్యార్థి విషయం పక్కనపెడితే.. అతన్ని కొట్టిన విద్యార్థుల్లో మతం పేరిటి విధ్వేషం నింపడం ఏంటని? ఇప్పుటి నుంచే వారిలో ఇంత విధ్వేషం నింపితే.. రేపొద్దున వారు పెరిగి పెద్దగైతే.. వారి ఆలోచన విధానం, వారి ప్రవర్తన ఎలా ఉంటుందో కనీస అవగాహన ఆ టీచరమ్మకు లేదా?

ఓ విద్యార్థి తప్పుదారిలో వెళ్తే దండించో, బుజ్జగించో సరైన దారిలో పెట్టాల్సిన ఓ ఉపాధ్యాయురాలు.. ఇలా దగ్గరుండి విద్యార్థులను విధ్వేషం వైపు నిడిపిస్తే ఈ సమాజం ఎటు పోవాలి, ఆ విద్యార్థులు తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? చదువు నేర్చుకుని గొప్ప స్థాయికి వస్తారని వారు కలలు కంటుంటే.. స్కూల్‌లో మతం పేరిట మనసుల్లో విషం నింపుతుంటే వారి కలలు నేరవేరుతాయా? అని సోషల్‌ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఓ విద్యార్థిని మతం పేరిట తిట్టించడం, కొట్టించడంతోనే పైశాచిక ఆనందం పొందే ఇలాంటి టీచర్లు సమాజానికి ఎంత చేటు చేస్తున్నారో ఇప్పుడు అర్థం కాకపోయినా.. ఈ విషబీజం పెరిగి పెద్దదై.. రేపు విధ్వంసానికి కారణం కావచ్చు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: దేశంలోనే తొలిసారి అల్పాహార స్కీం.. పిల్లలకు స్వయంగా వడ్డించిన సీఎం

Show comments