iDreamPost
android-app
ios-app

ప్రధానిపై ఓ నెటిజన్ ఆకతాయి పని! మోదీ రియాక్షన్ కి అంతా ఫిదా!

  • Published May 07, 2024 | 1:35 PM Updated Updated May 07, 2024 | 1:35 PM

Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ డ్యాన్స్‌ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. దీనిపై మోదీ స్పందిస్తూ చేసిన కామెంట్స్‌ వైరల్‌గా మారాయి. ఆ వివరాలు..

Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ డ్యాన్స్‌ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. దీనిపై మోదీ స్పందిస్తూ చేసిన కామెంట్స్‌ వైరల్‌గా మారాయి. ఆ వివరాలు..

  • Published May 07, 2024 | 1:35 PMUpdated May 07, 2024 | 1:35 PM
ప్రధానిపై ఓ నెటిజన్ ఆకతాయి పని! మోదీ రియాక్షన్ కి అంతా ఫిదా!

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం నడుస్తోంది. నేడు మూడో దశ పోలింగ్‌ జరుగుతుంది. 93 నియోజకవర్గాల్లో నేడు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈసారి 400 సీట్లు గెలిచి మరోసారి అధికారంలోకి రావాలని కాషాయ పార్టీ బలంగా ప్రయత్నిస్తుండగా.. బీజేపీని ఢీకొట్టడం కోసం ప్రతిపక్షాలు శ్రమిస్తున్నాయి. మండుటెండలను సైతం లెక్క చేయకుండా.. హోరాహోరిగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ఎన్నికల హీటును పెంచుతున్నారు నేతలు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. ఎన్నికల క్షేత్రంలో దూసుకుపోతున్నారు.

ఇదే సమయంలో నేతలకు సంబంధించి కొన్ని ఫేక్‌ వీడియోలు, వార్తలు కూడా సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఆ తర్వాత కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డ్యాన్స్‌ చేస్తోన్న వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. అది చూసిన మోదీ.. వావ్‌.. ఈ వీడియో చూసి నేను కూడా బాగా నవ్వుకున్నాను అని కామెంట్‌ చేయడం విశేషం. ఆ వివరాలు..

ఎన్నికలకు సమరం మోగిన దగ్గర నుంచి నేతలకు సంబంధించి బోలేడు వార్తలు, వీడియోలు సోషల్‌ మీడియాలో దర్శనం ఇస్తున్నాయి. ఇందులో కొన్ని వివాదాలు రాజేస్తే.. కొన్ని అందరిని నవ్విస్తూ.. అలరిస్తున్నాయి. మోదీ వీడియో కూడా ఈ కోవలోకే వస్తుంది. మరి దీన్ని ఎవరు క్రియేట్‌ చేశారో తెలియదు కానీ.. ప్రధాని మోదీ.. కుర్రాడిలా మారి.. ఎంతో హుషారుగా డ్యాన్స్‌ వేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. క్రిష్ణ అనే ట్విట్టర్‌ యూజర్‌ తన ఎక్స్‌ ఖాతాలో మోదీ డ్యాన్స్‌ వీడియోని పోస్ట్‌ చేశాడు. ఈ వీడియో పోస్ట్‌ చేసినందుకు గాను.. ది డిక్టేటర్‌ నన్ను అరెస్ట్‌ చేయిండని భావిస్తున్నాను.. అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ వీడియో తెగ వైరల్‌ అయ్యింది.

ఇక చివరకు ఇది ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి చేరింది. మన సీఎం సోషల్‌ మీడియాలో ఎంత యాక్టీవ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాంతో ట్విట్టర్‌లో వైరల్‌ అవుతోన్న తన డ్యాన్సింగ్‌ వీడియోపై మోదీ స్పందిస్తూ.. ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు. నా డ్యాన్స్‌ వీడియో చూసి మీ అందరిలాగే నేను కూడా చాలా ఎంజాయ్‌ చేశాను.. నవ్వుకున్నాను అని కామెంట్‌ చేశాడు. దాంతో ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాను ఓ ఊపు ఊపుతుంది.

అలానే మోదీ డ్యాన్సింగ్‌ వీడియోతో పాటుగా.. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ డ్యాన్స్‌ చేస్తున్నట్లుగా ఉన్న వీడియోని కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. తన డ్యాన్స్‌ వీడియోపై మోదీ సరదాగా స్పందిస్తే.. దీదీ మాత్రం ఫుల్లు గరమైతాంది. ఈ వీడియోను క్రియేట్‌ చేసిన వారిని గుర్తించి.. అరెస్ట్‌ చేసేన పనిలో ఉన్నారు పశ్చిమ బెంగాల్‌ పోలీసులు.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler