iDreamPost
android-app
ios-app

రిటైర్డ్ టీచర్లకు ఏటా రూ.83లక్షలు చెల్లించాలి: ఇన్ఫోసిస్ మూర్తి

  • Published Nov 15, 2023 | 9:58 PM Updated Updated Nov 15, 2023 | 9:58 PM

పదవి విరమణ చేసిన టీచర్ల గురించి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. టీచర్లు, పరిశోధకులకు మెరుగైన జీతాలు చెల్లించడంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు.

పదవి విరమణ చేసిన టీచర్ల గురించి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. టీచర్లు, పరిశోధకులకు మెరుగైన జీతాలు చెల్లించడంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు.

  • Published Nov 15, 2023 | 9:58 PMUpdated Nov 15, 2023 | 9:58 PM
రిటైర్డ్ టీచర్లకు ఏటా రూ.83లక్షలు చెల్లించాలి: ఇన్ఫోసిస్ మూర్తి

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణమూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాఫ్ట్ వేర్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాక తరచూ ఏదో వివిధ అంశాలపై స్పందిస్తూ వార్తాల్లో నిలుస్తుంటారు. ఇటీవలే భారత యువతత వారానికి 78 గంటలు పనిచేయాలంటూ ఆయన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పలువురు ప్రముఖులు కూడా స్పందించారు. తాజాగా టీచర్ల విషయంపై  నారాయణమూర్తి కీలక కామెంట్స్ చేశారు. దేశం అభివృద్ధి చెందాలంటే  టీచర్లకు ఏటా రూ.లక్ష అమెరికా డాలర్లు(మన కరెన్సీలో రూ.83లక్షలు) చెల్లించాలని మూర్తి అన్నారు. బుధవారం ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

బుధవారం ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం జరిగింది. దీనికి నారాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని టీచర్లను, పరిశోధకులను గౌరవించాలని, వారికి మెరుగైన జీతాలు చెల్లించాలని ఆయన తెలిపారు. అంతేకాక వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ప్రతిదేశం పురోగతికి నాలుగు దశలుంటాయని, మొదటి దశలో దేశంలోని పౌరులు ఎలాంటి ఆవిష్కరణలు చేయరని, కొత్తగా ఏమీ ఆలోచించరని పేర్కొన్నారు.

అలానే రెండో దశలో, ఇతర దేశాల ఆవిష్కరణల సహాయంతో ఉత్పత్తులు, సేవలను ప్రారంభిస్తారని, మూడో దశలో, ఒక దేశం ఇతర అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగానే ఉన్నత విద్య, పరిశోధనలతో మెరుగైన నాణ్యత, ఉత్పాదకత కోసం ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తారుని తెలిపారు. ఇక నాలుగో దశ విషయానికి వస్తే.. ఈ దశలో ఏ దేశంపై ఆధారపడకుండా స్వతంత్రంగా తమ అవసరాలకు తగ్గట్టు ఆవిష్కరణలు చేస్తారని. అంతేకాక ఇతర దేశాల అవసరాలు కూడా తీరుస్తారని చెప్పుకొచ్చారు. ఈ దశతోనే దేశం అభివృద్ధి చెందుతుందని అందుకోసం విద్య, పరిశోధనలు ఎంతో అవసరం నొక్కి చెప్పారు.

దేశంలోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ పొల్యూషన్ కంట్రోల్, ట్రాఫిక్ నిర్వహణ, స్వచ్ఛమైన నీటిని అందించడం అనేవి మొదటి దశలోనే ఉన్నాయన్నారు. పేదప్రజల జీవితాలను ప్రభావితం చేసే ప్రతి మారుమూల ప్రాంతం నాలుగో దశకు చేరాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. పదవీ విరమణ పొందిన టీచర్లను నేషనల్ ఎడ్యూకేషనల్ ప్రాసెస్ లో భాగం చేయడం వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చని నారాయణమూర్తి అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా స్టేమ్(సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథమెటిక్స్‌)రంగంలో నిష్ణాతులైన 10వేల మంది రిటైర్డ్ టీచర్లను మన దేశంలో నియమించాలన్నారు. వారితో సుమారు 2500 “ట్రైన్ ది టీచర్” కాలేజీలను ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్న టీచర్లకు ట్రైనింగ్ ఇప్పించాలన్నారు. ఆ టీచర్ల కోసం ఏటా లక్ష అమెరికా డాలర్లు చెల్లించాలి. ఏటా వీరికి రూ.8300కోట్లు చొప్పున ఇరవై  ఏళ్లకు రూ.1.66లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. త్వరలో దేశం రూ.415లక్షల కోట్ల జీడీపీ లక్ష్యంగా ఎదుగుతుందని కాబట్టి ఉపాధ్యాయులకు చెల్లించేది దేశానికి పెద్ద ఆర్థిక భారం కావపోవచ్చని ఆయన పేర్కొన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ ఇండియా-2020 విధానాన్ని 29 జులై 2020న ప్రవేశపెట్టారు. 2030 వరకు దేశం సుస్థిరాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో జాతీయ విద్యా విధానం ఏర్పాటు చేశారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom