iDreamPost
android-app
ios-app

లోకల్‌ ట్రైన్‌లో గొడవ.. అందరూ చూస్తుండగా మెడపట్టి..

  • Published Oct 12, 2023 | 7:04 PM Updated Updated Oct 12, 2023 | 7:04 PM
  • Published Oct 12, 2023 | 7:04 PMUpdated Oct 12, 2023 | 7:04 PM
లోకల్‌ ట్రైన్‌లో గొడవ.. అందరూ చూస్తుండగా మెడపట్టి..

మనుషుల్లో విచక్షణ బాగా తగ్గిపోయింది. మంచి ఏదో.. చెడు ఏదో బొత్తిగా గుర్తించలేని స్థితిలోకి వెళ్లిపోతున్నారు. క్షణికావేశంలో దారుణాలకు పాల్పడుతున్నారు. చంపడానికి కూడా వెనకాడ్డం లేదు. తాజాగా, ఓ లోకల్‌ ట్రైన్‌లో ఓ దారుణ సంఘటన చోటుచేసుకుంది. రైలు డోరు దగ్గర ఇద్దరు వ్యక్తులు గొడవపడ్డారు. ఓ వ్యక్తి తెరిచి ఉన్న డోరు దగ్గర ఉన్న వ్యక్తిని మెడపట్టి బయటకు తోసే ప్రయత్నం చేశాడు. కొంచెం ఉంటే అతడి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. అదృష్టం కొద్దీ బతికాడు.

ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం ముంబై లోకల్‌ ట్రైన్‌లో ప్రయాణిస్తున్న ఓ ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. లోపలికి వెళ్లకుండా అడ్డంగా నిలబడ్డ ఓ వ్యక్తిని డోరు దగ్గర ఉన్న వ్యక్తి లోపలికి జరగమన్నాడు. దీంతో ఇద్దరికీ గొడవైంది. లోపల ఉన్న వ్యక్తి డోరు దగ్గర నిలబడ్డ వ్యక్తిని గొంతుపట్టి బయటకు తోయబోయాడు. అయితే, ఆ డోరు దగ్గర ఉన్న వ్యక్తి పక్కనే ఉన్న రేలింగ్‌ పట్టుకుని నిలదొక్కుకున్నాడు. లేదంటే కిందపడిపోయేవాడు.

 తర్వాత కూడా లోపల ఉన్న వ్యక్తి.. బయట ఉన్న వ్యక్తిని కిందకు తోయబోయాడు. పక్కన ఉన్న మరో వ్యక్తి డోరు దగ్గర ఉన్న వ్యక్తికి సపోర్టుగా నిలిచాడు. లోపల ఉన్న మిగిలిన వారు కూడా డోరు దగ్గర ఉన్న వ్యక్తికి అండగా నిలిచాడు. దీంతో ‍ప్రత్యర్థి వెనక్కు తగ్గాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు డోరు దగ్గర గొడవలు పడేవారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetCasibomCasibomCasibomjojobetbetwooncasibomcasibombetcio giriş