iDreamPost
android-app
ios-app

పేరుకు ముఖేష్ అంబానీ అల్లుడు.. కానీ రోల్స్ రాయిస్, బెంట్లీ, బెంజ్ కార్లని కాదని..

  • Published Jul 13, 2024 | 5:47 PM Updated Updated Jul 13, 2024 | 5:47 PM

Mukesh Ambani Son In Law Using Normal Car: సంపన్నులు ఎలాంటి కార్లను వాడతారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వాళ్ళు బ్రాండ్ నే చూస్తారు. రోల్స్ రాయిస్, బెంట్లీ, జాగ్వార్ వంటి లగ్జరీ కార్లను మాత్రమే వాడతారు. ముకేశ్ అంబానీ కుటుంబంలో కూడా ఇంతే. ఆ కుటుంబంలో దాదాపు అందరూ ఖరీదైన లగ్జరీ కార్లనే వాడతారు. అయితే ఒక్కరు మాత్రం సాధారణ లగ్జరీ కారు వాడతారు. అది ఎవరిదో తెలుసా?

Mukesh Ambani Son In Law Using Normal Car: సంపన్నులు ఎలాంటి కార్లను వాడతారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వాళ్ళు బ్రాండ్ నే చూస్తారు. రోల్స్ రాయిస్, బెంట్లీ, జాగ్వార్ వంటి లగ్జరీ కార్లను మాత్రమే వాడతారు. ముకేశ్ అంబానీ కుటుంబంలో కూడా ఇంతే. ఆ కుటుంబంలో దాదాపు అందరూ ఖరీదైన లగ్జరీ కార్లనే వాడతారు. అయితే ఒక్కరు మాత్రం సాధారణ లగ్జరీ కారు వాడతారు. అది ఎవరిదో తెలుసా?

పేరుకు ముఖేష్ అంబానీ అల్లుడు.. కానీ రోల్స్ రాయిస్, బెంట్లీ, బెంజ్ కార్లని కాదని..

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహ వేడుక సందర్భంగా అంబానీ ఇంట ఖరీదైన కార్లు సందడి చేస్తున్నాయి. ప్రముఖ సెలబ్రిటీలంతా రోల్స్ రాయిస్ కార్లు, బెంట్లీ, బెంజ్ వంటి లగ్జరీ కార్లలో సందడి చేస్తున్నారు. రామ్ చరణ్ రీసెంట్ గా కొనుగోలు చేసిన రోల్స్ రాయిస్ స్పెక్ట్రా కారులో దిగారు. అతిథులే రోల్స్ రాయిస్ వంటి లగ్జరీ కార్లలో వస్తే అంబానీ కుటుంబ సభ్యులు ఏ కార్లలో వస్తారో ప్రత్యేకించి చెప్పాలా? వాళ్ళు కూడా అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లలోనే సందడి చేస్తారు. ముఖేష్ అంబానీ ఇంట్లో ఎక్కువగా రోల్స్ రాయిస్, బెంట్లీ వంటి కార్లే కనిపిస్తాయి. కుటుంబ సభ్యులందరూ ఈ లగ్జరీ కార్లనే వాడుతుంటారు. అయితే సంపన్న కుటుంబాల్లో కూడా ఎవరో ఒకరు చాలా నిరాడంబరంగా ఉంటారు.

ముకేశ్ అంబానీ కుటుంబంలో కూడా చాలా సింపుల్ గా ఉండే వ్యక్తి ఉన్నారు. అతనే ముఖేష్ అంబానీ అల్లుడు ఆనంద్ పిరమల్. రోల్స్ రాయిస్, బెంట్లీ కార్లను కాదని ఒక సాధారణ లగ్జరీ కారులో ప్రయాణిస్తున్నారు. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహ వేడుకలో ఆనంద్ పిరమల్ సాధారణ లగ్జరీ కారులో కనిపించడం నెటిజన్స్ దృష్టిని ఆకర్షించింది. టయోటా కామ్రీ సెడాన్ కారులో అంబానీ ఇంటికి విచ్చేశారు. అయితే ఇలా కనిపించడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో కూడా ఆనంద్ పిరమల్, ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ ఇద్దరూ టయోటా కామ్రీ సెడాన్ కారులో రెస్టారెంట్ కి వెళ్లారు. అయితే వీళ్ళ కాన్వాయ్ లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కార్లలో మహీంద్రా, ఎంజీ గ్లాస్టర్స్, ల్యాండ్ రోవర్ డిస్కవరీ, రోల్స్ రాయిస్ వంటి కార్లు ఉన్నాయి. అయినప్పటికీ ఆనంద్ పిరమల్, ఇషా అంబానీ ఇద్దరూ టయోటా కామ్రీ సెడాన్ లోనే ప్రయాణించారు.   

ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే.. అంబానీ కుటుంబ సభ్యులు కారు వెనుక సీట్లో కూర్చుంటారు. కానీ అంబానీ అల్లుడు ఆనంద్ మాత్రం కారు ముందు సీట్లో కూర్చుని కనిపించడం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షించింది. ఏ ఫంక్షన్స్ కి వెళ్లినా ఆనంద్ పిరమల్.. ముందు సీట్లోనే కూర్చుంటారు. అంతేకాదు అంబానీ కుటుంబ సభ్యుల్లా ఖరీదైన చెప్పులు, దుస్తుల్లో కాకుండా క్యాజువల్ చెప్పులు, దుస్తుల్లో కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంబానీ అల్లుడైనా ఎంత సింప్లిసిటీ అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక టయోటా కామ్రీ సెడాన్ విషయానికొస్తే.. దీని ధర రూ. 46.17 లక్షలు. అంబానీ ఇంట్లో ఉన్న లగ్జరీ కార్లతో పోలిస్తే దీని ధర తక్కువే. అంబానీ కుటుంబ సభ్యులందరూ కోట్ల విలువైన కార్లు వాడుతున్నారు. ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ వాడే రోల్స్ రాయిస్ ఫాంటమ్ 8 ధర రూ. 12 కోట్లు.  

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)