iDreamPost
android-app
ios-app

అనంత్‌ అంబానీ పెళ్లి.. 5 స్టార్‌ హోటల్స్‌ ధీటుగా అల్ట్రా లగ్జరీ ఏర్పాట్లతో

  • Published Feb 26, 2024 | 9:04 AM Updated Updated Feb 26, 2024 | 10:44 AM

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, అపర కుబేరుడు ముకేశ్ అంబానీ- నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ లకు మరి కొద్ది రోజుల్లో వివాహం జరగనుంది. అయితే ఈ వివాహ వేడుకలకు సంబంధించి ముకేశ్ అంబానీ కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే..

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, అపర కుబేరుడు ముకేశ్ అంబానీ- నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ లకు మరి కొద్ది రోజుల్లో వివాహం జరగనుంది. అయితే ఈ వివాహ వేడుకలకు సంబంధించి ముకేశ్ అంబానీ కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే..

  • Published Feb 26, 2024 | 9:04 AMUpdated Feb 26, 2024 | 10:44 AM
అనంత్‌ అంబానీ పెళ్లి.. 5 స్టార్‌ హోటల్స్‌ ధీటుగా అల్ట్రా లగ్జరీ ఏర్పాట్లతో

ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ముకేశ్ అంబానీ ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. మరికొద్ది రోజులలో ముకేశ్ అంబానీ- నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ కు వివాహం జరగనుంది. ఇప్పటికే ఈ వివాహ వేడుకలకు సంబంధించి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి సర్వం సిద్ధమవుతుంది.  అయితే, అంబానీ వారి ఇంట్లో పెళ్లి అంటే 5 స్టార్ హోటళ్లు లోని ఓ రేంజ్ లో ఘనంగా నిర్వహిస్తారు. ఇక ఈ పెళ్లికి ప్రపంచ నలుమూలల నుంచి అతిరథ మహారథులు హాజరవుతారు. కానీ, ఈ పెళ్లి వేడుకలకు వచ్చిన అతిథులకు 5 స్టార్ హోటళ్ల సదుపాయం లేకపోవడంతో.. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా ముకేశ్ అంబానీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

అపర కుబేరుడు ముకేశ్ అంబానీ- నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ కు.. ఎన్‌కోర్ హెల్త్ కేర్ సీఈఓ వీరేన్ మర్చంట్- శైలా మర్చంట్ చిన్న కుమార్తె రాధికా మర్చంట్‌ కు ఈ ఏడాది జులై 12వ తేదిన వివాహం జరగనుంది. ఇప్పటికే ఈ వివాహ వేడుకలకు సంబంధించి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు అంతా సర్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే.. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మార్చి 1 నుంచి మూడు రోజుల పాటు ముందస్తు పెళ్లి వేడుకలు నిర్వహించనున్నారు. అయితే అంబానీ ఇంట్ల పెళ్లాంటే ప్రపంచ నలుమూలల నుంచి అతిథులు హాజరవుతారు. కానీ, ఈ వివాహ వేడుకలు నిర్వహించడానికి జామ్‌నగర్‌లో 5 స్టార్ హోటళ్లు లేకపోవడంతో.. ముకేశ్ అంబానీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ పెళ్లికి వచ్చిన అతిథులకు సౌకర్యం కల్పించడం కోసం 5 స్టార్ హోటళ్లకు తలదన్నే విధంగా అల్ట్రా- లగ్జరీ టెంట్లను ఏర్పాటు చేస్తున్నారు. కాగా, అతిథుల కోసం ఏర్పాటు చేసే ఈ టెంట్లలో టైల్డ్ బాత్‌రూమ్‌లు సహా సకల సౌకర్యాలు ఉంటాయి.

ఇక ఈ ముందస్తు వివాహ వేడుకలకు సంబంధించి ఆహ్వానాలు అందిన వారిలో బాలీవుడ్ ప్రముఖులతో పాటు, దేశ, విదేశీ వ్యాపారస్తులు, క్రీడ రంగంలోని ప్రముఖ క్రికెటర్లు హాజరవుతున్నారు. అలాగే హాలీవుడ్ నుంచి పాప్ గాయని రిహన్నాతో పాటు దిల్జీత్ దోసాన్జ్, ఇతర గాయకులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. కాగా, ఈ మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు ఢిల్లీ, ముంబై నుంచి ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేస్తున్నారు. మరి, అతిథులకు కోసం ముకేశ్ అంబానీ ఏర్పట్లు చేస్తున్న సౌకర్యల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.