Arjun Suravaram
MS Dhoni Plays Dandiya: రిలయన్స్ ఇండస్ట్రీస్ బాస్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్‌ల ప్రీవెడ్డింగ్ వేడుకలు జరుగుతున్న సంగతిత తెలిసిందే. ఈ కార్యక్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సందడి చేశాడు.
MS Dhoni Plays Dandiya: రిలయన్స్ ఇండస్ట్రీస్ బాస్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్‌ల ప్రీవెడ్డింగ్ వేడుకలు జరుగుతున్న సంగతిత తెలిసిందే. ఈ కార్యక్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సందడి చేశాడు.
Arjun Suravaram
ప్రపంచ కుబేరుల్లో ఒకరు, భారతీయ సంపన్నుడు, రిలయన్స్ గ్రూప్స్ అధినేత ముకేస్ అంబానీ ఇంట పెళ్లి సందడి జరుగుతున్న సంగతి తెలిసింది. ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహం జులైలో జరగనుంది. ఈ నేపథ్యంలో గుజరాత్ జామ్‌నగర్‌లో శుక్రవారం ప్రీ వెడ్డింగ్ సందడి మొదలైంది. ఈ వేడుకల్లో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొంటున్నారు. ఇక ప్రముఖ క్రికెటర్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని కూడా హాజరయ్యారు. తన భార్యతో కలిసి దాండియా ఆడుతూ సందడి చేశాడు.
రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ , వీరెన్ మర్చంట్- శైలా మర్చంట్ దంపతుల కుమార్తె రాధికా మర్చంట్‌తో వివాహం జరగనుంది. అయితే ప్రస్తుతం గుజరాత్ లోని జామ్ నగర్ లో ఈ కాబోయే దంపతుల ప్రీ వెడ్డింగ వేడుక జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అంబానీ ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. దాదాపు రూ.1000 కోట్లు వరకు ఈ వేడుకకు ఖర్చు చేస్తున్నారు. అలానే వంటల విషయానికి వస్తే..దాదాపు 2500 రకాల వంటలను తయారు చేయిస్తున్నారు. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. ఇక అనంత అంబానీ, రాధిక మర్చంట్ ల ప్రీ వెడ్డింగ్ వేడుకకి భారత్ సహా ప్రపంచదేశాల నుంచి దిగ్గజ పారిశ్రామిక వేత్తలు సహా సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు ఈ వేడుక కోసం వెళ్లారు. శుక్ర, శని, ఆదివారం వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. ఏ రోజు ఏ కార్యక్రమం నిర్వహించే విధంగా ప్రత్యేకంగా షెడ్యూల్ సిద్ధం చేశారు. అతిథులను ఉత్సాహంగా ఉంచుతూ జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను ఇచ్చేలా ప్లాన్ చేశారు.
కాగా ఈ వేడుకల్లో పలువురు క్రికెటర్లు పాల్గొన్నారు. టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వంటి ఆటగాళ్లు జామ్‌నగర్‌కు వచ్చారు. అంతేకాకుండా విదేశీ ఆటగాళ్లైన డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్, కీరన్ పొలార్డ్, రషీద్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్ కూడా అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకకు హాజరయ్యారు.
ఇలా ఈ వేడుకకు వచ్చే అతిథుల జాబితా చాలా పెద్దగా ఉంటే. మరోవైపు వేడుకల్లో భాగంగా రెండో రోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ తన సతీమణి సాక్షితో కలిసి సందడి చేశారు. సంప్రదాయ దుస్తులు ధరించి దాండియా ఆడుతూ ధోనీ దంపతులు అలరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Video of the Day is here, Our Mahi – Sakshi and DJ Bravo Playing Dandiya !! 🥳😍#MSDhoni #WhistlePodu #Dhoni @msdhoni
🎥 via @instantbolly pic.twitter.com/TQvTiATbKE— TEAM MS DHONI #Dhoni (@imDhoni_fc) March 3, 2024