iDreamPost
android-app
ios-app

పెళ్లికొడుకు తండ్రితో పెళ్లికూతురు తల్లి జంప్! ఇలా తయారయ్యారు ఏంటిరా?

  • Published Jul 17, 2024 | 10:28 AM Updated Updated Jul 17, 2024 | 10:28 AM

ఇద్దరు స్నేహితులు బంధువులు కావాలని భావించారు. దీంతో తన కొడుక్కి, ఇటు కూతురికి పెళ్లి చేయాలని అనుకున్నారు. చివరకు జులై 17న పెళ్లి డేట్ ఫిక్స్ చేశారు. ఇల్లంతా సందడి నెలకొని ఉంది. అంతలో..

ఇద్దరు స్నేహితులు బంధువులు కావాలని భావించారు. దీంతో తన కొడుక్కి, ఇటు కూతురికి పెళ్లి చేయాలని అనుకున్నారు. చివరకు జులై 17న పెళ్లి డేట్ ఫిక్స్ చేశారు. ఇల్లంతా సందడి నెలకొని ఉంది. అంతలో..

  • Published Jul 17, 2024 | 10:28 AMUpdated Jul 17, 2024 | 10:28 AM
పెళ్లికొడుకు తండ్రితో పెళ్లికూతురు తల్లి జంప్! ఇలా తయారయ్యారు ఏంటిరా?

పదిహేను రోజుల్లో పెళ్లి. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఇళ్లల్లో సందడి నెలకొంది. ఇరు కుటుంబాల మధ్య మాటలు సాగుతున్నాయి. పెళ్లికి అవసరమైన సామాగ్రి సిద్ధం చేస్తున్నారు. ఇంచుమించు షాపింగ్ పూర్తయ్యింది. పెళ్లికి కావాల్సిన వస్తువులన్నీకొన్నారు. పెళ్లి కార్డులు పంచడం దగ్గర నుండి పెళ్లి మండపం వరకు అన్ని పనులు పూర్తయ్యాయి. అంతలో బంధువుల రాకపోకలు సాగుతున్నాయి. ఇరు నివాసాల్లోనూ కోలాహలం నెలకొంది. పెళ్లి రోజులు దగ్గర పడుతున్నాయి. అందరిలోనూ ఆనందంతో పాటు కాస్తంత టెన్షన్ నెలకొంది. అంతలో పిడుగు లాంటి వార్త. వధువు తల్లి, వరుడు తండ్రి జంప్ అయ్యారని. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కసగంజ్ జిల్లాలో చోటుచేసుకుంది.

కసగంజ్ జిల్లాలోని గంజ్ దుండ్వారా కొత్వాలి ప్రాంతంలోని ఓ గ్రామంలో రెండు కుటుంబాలు కుమారుడికి, కుమార్తెకు వివాహం చేయాలనుకున్నారు. బాలిక తండ్రి.. పప్పు కూలి పనులు చేసుకుని బతుకుతుంటాడు. ఈ రిక్షా నడిపే షకిల్ అనే వ్యక్తితో స్నేహం ఉంది. ఈ స్నేహ బంధాన్ని వియ్యంకుల బంధంగా మార్చుకోవాలనుకుని భావించాడు. దీంతో పప్పు కూతురికి, షకీల్ కొడుక్కి వివాహం నిశ్చయించారు. జులై 17న ఈద్ రోజున వీరి వివాహం చేయాలని నిర్ణయించారు పెద్దలు. అయితే వివాహం నిశ్చయమైన తర్వాత.. కుమార్తె తల్లి సంధి,పెళ్లి కొడుకు షకీల్‌కు మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. నిత్యం ఫోనులో మాట్లాడుకునే వారు. అలా ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారు. పిల్లలకు పెళ్లి చేయాల్సిన పెద్దలు.. తమ ప్రేమను వెతుక్కుంటూ వెళ్లిపోయారు.

ఇద్దరు జంప్ అయిపోయాక.. వీళ్లిద్దరూ ఎక్కడకు వెళ్లారో తెలియక వెతకసాగారు. ఇదిలా ఉంటే పెళ్లి కూతురు తల్లికి ఇప్పటికే ఆరుగురు పిల్లలు ఉండగా.. మేనకోడలిని కూడా దత్తత తీసుకుని పోషిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే షకీల్‌కు కూడా పది మంది సంతానం ఉన్నట్లు సమాచారం. ఈ పెళ్లి సంబంధం విషయం గురించి మాట్లాడుతూ.. ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారు. జులై 17న పిల్లలకు పెళ్లి చేయాలనుకున్న సమయంలోనే వీళ్లిద్దరూ లేచిపోయారు. అయితే తొలుత వీరి కోసం వెతికారు. ఎంతకు కనిపించకపోవడంతో అప్పుడు కానీ బోధపడలేదు.. ఈ ఇద్దరు జంప్ అయ్యారని. భార్యా బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. తన భార్యను షకీల్ మభ్య పెట్టి తనతో తీసుకెళ్లాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా, బుధవారం జరగాల్సిన పెళ్లి జరుగుతుందో లేదో తెలియాల్సి ఉంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş