P Krishna
Heart Touching Video: ప్రపంచంలో దేవుడికి బదులు అమ్మను సృష్టించారని పెద్దలు అంటుంటారు.. అమ్మ ప్రేమను దేనితోనూ పోల్చలేం. బిడ్డ ఉన్నత స్థానంలో ఉంటే ఏ తల్లైనా ఎంతో గర్వంగా, సంతోషంగా ఉంటుంది.
Heart Touching Video: ప్రపంచంలో దేవుడికి బదులు అమ్మను సృష్టించారని పెద్దలు అంటుంటారు.. అమ్మ ప్రేమను దేనితోనూ పోల్చలేం. బిడ్డ ఉన్నత స్థానంలో ఉంటే ఏ తల్లైనా ఎంతో గర్వంగా, సంతోషంగా ఉంటుంది.
P Krishna
నవమాసాలు మెసి కనీ పెంచే తల్లి బిడ్డలకు ఏ చిన్న ఇబ్బంది కలిగినా తట్టుకోలేదు. బిడ్డ పుట్టినప్పటి నుంచి తాను చనిపోయే వరకు బిడ్డల సంతోషం కోసం అహర్శిశలూ శ్రమిస్తుంది. పిల్లలకు ఏ కష్టమొచ్చినా అల్లాడిపోతుంది. సమాజంలో ఉన్నత స్థానంలో ఉండాలని ప్రతి తల్లి భావిస్తుంది. సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొడుకు సాధించిన విజయానికి ఓ తల్లి ఎంతో ఉప్పొంగి పోయింది. కొడుకును హత్తుకొని తన సంతోషాన్ని వ్యక్తపరిచింది. హృదయాలు కదిలించేలా వీరిద్దరి ఎమోషన్ కి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..
తన పిల్లలు విజయాన్ని సాధిస్తే ఏ తల్లైనా ఆనందంతో ఉప్పొంగిపోతుంది. అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొడుకు తాను సాధించిన విజయాన్ని గురించి చెప్పగానే కూరగాయలు అమ్ముకుంటున్న తల్లి సంతోషంతో ఉప్పొంగిపోయింది. ఈ హార్ట్ టచింగ్ వీడియో మహారాష్ట్ర పబ్లిక్ వర్క్స్ శాఖా మంత్రి రవీంద్ర చవాన్ షేర్ చేశారు. వీడియోలో ఉన్న ప్రకారం.. ఓ పెద్దావిడ రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముతుంది. అక్కడికి వచ్చిన తన కొడుకు ఆమెకు ఏదో చెప్పగానే సంతోషంతో లేచి ఆ గుండెలకు హత్తుకొని ఏడుస్తుంది. ఆ తల్లి ఆనందాన్ని చూసి కొడుకు ఎలా ఓదార్చాలో తెలియక అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఈ వీడియోలో ఉన్న యువకుడు యోగాశ్. తాను సీఏ పూర్తి చేశానని తల్లికి చెప్పడంతో ఆమె ఇలా ఆనందంతో ఉప్పోంగిపోయింది. యోగోష్ తల్లిపేరు తొంబరే మవాషి. ధానే సబర్బన్ డోంబివిలి ఈస్ట్ ప్రాంతంలోని గాంధీ నగర్ ల కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంది.
మనిషి పట్టుదలతో ఏదైనా సాధించవొచ్చు.. కోరుకున్న లక్ష్యాన్ని పొందాలనే దృఢ సంకల్పం ఉండాలి. యోగేశ్ ఎన్నో కఠినమైన పరిస్థితులు ఎదుర్కొని ఈ స్థాయిలో విజయం సాధించాడు. అందుకే ఆ తల్లి కోడుకు కష్టాన్ని గుర్తు చేసుకొని ఎమోషన్ అయ్యింది. ఎంతో కఠినమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన యోగేశ్ అభినందించకుండా ఉండలేం.. అతని విజయానికి సంతోషిస్తునాను’ అంటూ మంత్రి రవీంద్ర చవాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలో నెట్టింట వైరల్ అవుతుంది. యోగేశ్ విజయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.. భవిష్యత్ లో అతడికి మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నారు.
योगेश, तुझा अभिमान आहे.
डोंबिवली पूर्व येथील गांधीनगर मधील गिरनार मिठाई दुकानाजवळ भाजी विकणाऱ्या ठोंबरे मावशींचा मुलगा योगेश चार्टर्ड अकाऊंटंट (C.A.) झाला.
निश्चय, मेहनत आणि परिश्रमांच्या बळावर योगेशने खडतर परिस्थितीशी तोंड देत हे दैदीप्यमान यश मिळवलं आहे. त्याच्या या… pic.twitter.com/Mf8nLV4E61
— Ravindra Chavan (@RaviDadaChavan) July 14, 2024