iDreamPost
android-app
ios-app

పిల్లల ప్రాణాలు తీస్తున్న దగ్గు సిరప్‌లు.. క్వాలిటీ టెస్టులో ఫెయిల్

  • Published Jul 24, 2024 | 9:36 PM Updated Updated Jul 24, 2024 | 9:36 PM

Dangerous Cough Syrups: పిల్లలకు దగ్గు తగ్గడానికి వాడే దగ్గు సిరప్ లలో విషపూరిత పదార్థాలు ఉన్నాయని, అవి ప్రాణాలకే ప్రమాదమని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. దగ్గు సిరప్ లను టెస్ట్ చేయగా వాటిలో చాలా సిరప్ లు ఫెయిలయ్యాయని తేలింది.

Dangerous Cough Syrups: పిల్లలకు దగ్గు తగ్గడానికి వాడే దగ్గు సిరప్ లలో విషపూరిత పదార్థాలు ఉన్నాయని, అవి ప్రాణాలకే ప్రమాదమని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. దగ్గు సిరప్ లను టెస్ట్ చేయగా వాటిలో చాలా సిరప్ లు ఫెయిలయ్యాయని తేలింది.

పిల్లల ప్రాణాలు తీస్తున్న దగ్గు సిరప్‌లు.. క్వాలిటీ టెస్టులో ఫెయిల్

దగ్గు తగ్గడానికి వాడే సిరప్ లు ప్రాణాంతకమని.. మరణానికి దారి తీసే అవకాశాలు ఉన్నాయని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) వెల్లడించింది. వంద కంటే ఎక్కువ ఫార్మా యూనిట్ల నుంచి సేకరించిన దగ్గు సిరప్ నమూనాలను టెస్ట్ చేసింది. ఈ క్వాలిటీ టెస్టులో ఆ దగ్గు సిరప్ లు విఫలమయ్యాయని సీడీఎస్సీఓ తన నివేదికలో పేర్కొంది. క్వాలిటీ టెస్టులో భాగంగా ఈ దగ్గు సిరప్ లపై పరీక్షలు చేసిన సీడీఎస్సీఓ.. చాలా సిరప్ లలో విషపూరిత పదార్థాలు ఉన్నట్లు గుర్తించింది. 7087 బ్యాచులకు చెందిన దగ్గు సిరప్ లను పరీక్షించగా అందులో 353 బ్యాచులకు చెందిన సిరప్ లు నాణ్యత ప్రమాణాలను పాటించలేదని తేలింది. డైథలీన్ గ్లైకాల్, ఇథలీన్ గ్లైకాల్ పీహెచ్ వంటివి తగిన మోతాదుల్లో లేవని నివేదికలో పేర్కొంది. వీటి పరిమాణం 9 బ్యాచుల్లో ఎక్కువగా ఉన్నాయని.. కొన్ని సిరప్ లలో ఎక్కువగా ఉందని సీడీఎస్సీఓ గుర్తించింది. ఈ కారణంగా ఆ సిరప్ లు ప్రాణాంతకమని వెల్లడించింది.

ఇండియా ఉత్పత్తి చేసే దగ్గు సిరప్ లు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతున్నాయి. అయితే వరల్డ్ వైడ్ 141 మంది పిల్లల మరణాలకు ఇండియా నుంచి వచ్చే దగ్గు సిరప్ లే కారణమని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో భారత ప్రభుత్వం దగ్గు సిరప్ నాణ్యతను పరీక్షించడం మొదలుపెట్టింది. ఇండియాలో తయారయ్యే దగ్గు, జలుబు సిరప్ ల కారణంగా గాంబియా దేశంలో కిడ్నీ సమస్యతో సుమారు 70 మంది చిన్నారులు మరణించారని 2022 అక్టోబర్ లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. ఆ తర్వాత సంబంధిత అధికారులు దగ్గు సిరప్ తయారీ యూనిట్లలో తనిఖీలు నిర్వహించి.. ఫార్మా గ్రేడ్ ప్రొఫైలిన్ గ్లైకాల్ వాడకంపై తయారీదారులకు అవగాహన కల్పించారు.

ఎగుమతి కోసం ఉద్దేశించిన తయారీదారుల నుంచి దగ్గు సిరప్ నమూనాలను పరీక్షించడానికి గుర్తింపు పొందిన ల్యాబ్ లకు అనుమతి ఇవ్వాలని 2023 మే నెలలో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ).. రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్ ని ఆదేశించింది. జూన్ నెల నుంచి దగ్గు సిరప్ ని ప్రభుత్వ ల్యాబ్స్ లో పరీక్షించి సర్టిఫికెట్ అందించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ)ని కోరింది. ఈ క్రమంలోనే క్వాలిటీ టెస్టులో కొన్ని దగ్గు సిరప్ లు ఫెయిల్ అయ్యాయి. నాణ్యత ప్రమాణాలను పాటించకుండా తయారు చేసినట్లు తేలింది. ఈ సిరప్ లు వాడితే ప్రాణాంతకమని, మరణానికి దారి తీసే అవకాశాలు ఉన్నాయని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వెల్లడించింది.