Krishna Kowshik
పొద్దున్న లేచిన దగ్గర నుండి అర్థరాాత్రి వరకు ఏదో ఒక స్పామ్ కాల్ లేదా బిజినెస్ కాల్స్ సెల్ ఫోన్ యూజర్లను ఇబ్బందికి గురి చేస్తుంటాయి. పనిలో ఉండగానే.. ఏదో పనున్నట్లుగా వస్తుంది కాల్. తీరా చూస్తే.. ఫలానా కంపెనీ అంటూ విసిగిస్తుంటారు. ఇంట్రస్ట్ లేదన్న వినిపించుకోరు.
పొద్దున్న లేచిన దగ్గర నుండి అర్థరాాత్రి వరకు ఏదో ఒక స్పామ్ కాల్ లేదా బిజినెస్ కాల్స్ సెల్ ఫోన్ యూజర్లను ఇబ్బందికి గురి చేస్తుంటాయి. పనిలో ఉండగానే.. ఏదో పనున్నట్లుగా వస్తుంది కాల్. తీరా చూస్తే.. ఫలానా కంపెనీ అంటూ విసిగిస్తుంటారు. ఇంట్రస్ట్ లేదన్న వినిపించుకోరు.
Krishna Kowshik
పనిలో బిజీగా ఉన్నప్పుడు.. కాల్ వస్తుంది తీరా చూస్తే బ్యాంకు నుండి కాల్ చేస్తున్నామండి లోన్ కావాలా లేదా క్రెడిట్ కార్డు తీసుకుంటారా..? లేక మరోటి అంటూ ఫోన్. ఆఫీసుకు బయలుదేరాదామని రెస్ట్ రూంలో ఫ్రెష్ అవుతుండగా.. ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఆదరా బాదరగా నీళ్లు పోసుకుని బయటకు వచ్చి చూస్తే అదే స్పామ్ కాల్. చివరకు అర్థరాత్రి మద్దెల దరువుగా ఏదో ఒక కాల్ వస్తుంది. వద్దు, ఇంట్రస్ట్ లేదు అని చెప్పినా వినిపించుకోకుండా ఫోన్స్ చేస్తూనే ఉంటారు. చివరకు ఈ కాల్స్ మూలంగా కొన్ని సార్లు ఫోన్లు సైలెంట్‌లో పెట్టుకోవాల్సి వస్తుంది. చివరకు ఎమర్జెన్సీ కాల్స్ వచ్చినా కూడా ఏదో కంపెనీ నుండి కాల్ వస్తుందంటూ పట్టించుకోకుండా ఉన్న రోజులున్నాయి.
ప్రతి రోజు ఒక్కసారైన ఈ బిజినెస్ కాల్స్‌కు బాధితులవుతున్నారు యూజర్స్. సెల్ ఫోన్ యూజర్లకు తలనొప్పిగా మారాయి ఈ కాల్స్. స్పామ్ కాల్స్, ప్రమోషనల్ ఆర్ బిజినెస్ కాల్స్ తో విసిగిపోయారా.. అయితే మీకొక గుడ్ న్యూస్. ఈ స్పామ్ అండ్ అన్ వాంటెడ్ బిజినెస్ కాల్స్ పై దృష్టి సారించింది మోడీ సర్కార్. ఇప్పుడు ఇలాంటి కాల్స్, సందేశాలకు కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టనుంది. అస్తమాను విసిగించే బిజినెస్ కాల్స్ విషయంపై మోడీ సర్కార్ గుర్తించింది. వాటికి చెక్ పెట్టేందుకు ముసాయిదా మార్గదర్శకాలను రూపొందించడానికి ప్రజల అభిప్రాయాలను సేకరించాలని భావిస్తోంది. ఈ మేరకు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది.
జులై 21లోపు తమ అభిప్రాయాలను తెలియజేయాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది. ప్రజాభిప్రాయం తర్వాత ముసాయిదా మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేయనుంది.టెలికాం సంస్థలు, టెలికాం రెగ్యులేషన్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI)లతో సంప్రదింపులు జరిపి ప్రభుత్వం ఈ మార్గదర్శకాలు రూపొందించనుంది. యూజర్ పర్మిషన్ లేకుండా వచ్చే కాల్స్, అన్ వాంటెడ్ బిజినెస్ ప్రమోషన్స్ కిందకు వస్తాయి. రిజిస్టర్ చేయని నంబర్, ఎస్ఎంఎస్ హెడర్లను ఉపయోగించడం, యూజర్ కాల్ కట్ చేసిన మళ్లీ కాల్ చేస్తే వాటిని బ్యాన్ చేస్తాయి. ఈ మార్గదర్శకాలు వస్తే.. ఫోన్లకు రెస్ట్ వచ్చినట్లే. వీటి ధాటికి తట్టుకోలేక తర్వలో ఫోను సెలైంట్ లో పెట్టుకో అవసరం ఇక రాకపోవచ్చేమో బహుశా. మరీ ఎలాంటి మార్గదర్శకాలు తీసుకువస్తుందే చూడాలి.