iDreamPost
android-app
ios-app

మహిళల కోసం మొబైల్ బస్టా స్టాప్.. ఎక్కడంటే!

  • Published Nov 18, 2023 | 12:04 PM Updated Updated Nov 18, 2023 | 12:04 PM

ఇటీవల మహిళలపై అఘాయిత్యాలు, లైంగిక వేధింలు నానాటికీ ఎక్కువై పోతున్నాయి. ఒంటరిగా మహిళలు బయటకు రావాలంటేనే భయంతో వణికిపోతున్నారు.

ఇటీవల మహిళలపై అఘాయిత్యాలు, లైంగిక వేధింలు నానాటికీ ఎక్కువై పోతున్నాయి. ఒంటరిగా మహిళలు బయటకు రావాలంటేనే భయంతో వణికిపోతున్నారు.

  • Published Nov 18, 2023 | 12:04 PMUpdated Nov 18, 2023 | 12:04 PM
మహిళల కోసం మొబైల్ బస్టా స్టాప్.. ఎక్కడంటే!

దేశంలో రోజు రోజుకీ మహిళలై అఘాయిత్యాలు, అత్యాచారాలు, లైంగి వేధింపులు పెరిగిపోతున్నాయి. ఒంటరిగా మహిళలు బయటికి వెళ్లాంటే భయపడే పరిస్థితి నెలకొంది. చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళల వరకు కామాంధులు ఎవరినీ వదలడం లేదు. నిత్యం మహిళలపై వేధింపుల కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఇటీవల బస్ స్టాప్, బస్సుల్లో సైతం కొంతమంది ఆకతాయిలు మహిళలను వేధిస్తున్నట్లు పలు కేసులు నమోదు అయ్యాయి.. పోలీసులు అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఎలాంటి మార్పు రావడం లేదు. మహిళల ఇబ్బందులు కొంత మేరకు తొలగించేందుకు మొబైల్ బస్ స్టాప్ ఏర్పాటు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ మొబైల్ బస్ట్ స్టాప్ వల్ల చిరు ఉద్యోగాలు చేసుకునే మహిళలకు ఎంతో ఉపయోగం ఉంటుందని అంటున్నారు. ఇంతకీ ఈ మొబైల్ బస్టాప్ ఎక్కడ అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

సాధారణంగా మహిళలు తమకు కలిగే ఇబ్బందులు తోటి మహిళలతో చెప్పుకొని బాధపడుతుంటారు. మా ఇంటి నుంచి బస్ స్టాప్ కి వెళ్లడానికి రెండు కిలోమీటర్లు నడవాలి.. అంత దూరం నడిచి వెళ్లి ఉద్యోగం చేయాలంటే ఇబ్బంది అవుతుంది.. అందుకే మానేశాను అని ఒకరు, నేను సూపర్ మార్కెట్ లో జాబ్ చేన్నాను.. బస్ స్టాప్ కి వెళ్లాంటే నాలుగు కిలో మీటర్లు, రాత్రి పూట బస్ స్టాప్ లో ఆకతాయిలతో ఇబ్బంది..అందుకే జాబ్ చేయలేకపోతున్నా అంటూ ఒక యువతి, నేను ఇండ్లలో పని చేస్తుంటాను.. బస్ స్టాప్ కి రావాలంటే మూడు కిలో మీటర్లు.. అంత దూరం నడిచి వెళ్లి పనులు చేయాలంటే ఎంతో కష్టంగా ఉందని ఓ మహిళ తమ కష్టం చెప్పుకొని బాధపడుతుంది. ఇలా చిన్న ఉద్యోగాల నుంచి సాఫ్ట్ వేర్ కంపెనీల్లో చేసే మహిళల వరకు దూర ప్రయాణాల గురించి బాధపడటం.. తప్పని పరిస్థితుల్లో ఉద్యోగాలు మానివేయడం జరుగుతుంది. అలాంటి వారి ఇబ్బందులు తెలుసుకొని బెంగుళూరులోని పలు సంఘాలు, కళాకారులు ‘అల్లి సెరోనా’ పేరుతో వేధిక ఏర్పాటు చేసుకొని ‘మొబైల్ బస్ స్టాప్ ఇన్ స్టాటేషన్’ వినూత్నమైన టూర్ ఏర్పాటు చేశారు. ఈ సృజనాత్మక ఆలోచన ఇప్పుడు ఎంతో మంది మహిళలకు ధైర్యాన్ని నింపింది.

‘మొబైల్ బస్ స్టాప్ ఇన్ స్టాటేషన్’ చిన్న చిన్న ప్రాంతాలకు కూడా వెళ్తుంది. ఒక ప్రాంతంలో మూడు రోజుల పాటు ఏర్పాటు చేస్తారు. సాధారణంగా బస్ స్టాప్ కంటే ఎంతో సౌకర్యవంతంగా మొబైల్ బస్ స్టాప్ ని ఏర్పాటు చేశారు. టికెట్ కౌంటర్, సిట్టింగ్ ఏర్పాట్లు, నిలబడటానికి ఖాళీ ప్రదేశం, న్యూస్ పేపర్ స్టాండ్ ఇలా ఎన్నో అద్భుతంగా ఏర్పాట్లు చేశారు. ఎంతోమంది మహిళలు బస్ స్టాప్ ల కోసం కిలోమీటర్ల దూరం నడాల్సి వస్తుంది.. ఇంట్లో పని చేసుకొని అంత దూరం నడిచే ఓపిక లేక ఉద్యోగం మానేస్తున్నారు. అలాంటి మహిళల కష్టాలు తీర్చడానికి, వారి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లడానికి మొబైల్ బస్ స్టాప్ ప్రక్రియను ఏర్పాటు చేసినట్లు ‘అల్లి సెరోనా’ క్రియేటర్ తనిషా అన్నారు. ప్రస్తుతం బస్ స్టాప్ లో అరకొర సౌకర్యాలతో ఉన్నాయి.. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ‘ట్రావెలింగ్ బస్ స్టాప్ ఇన్ స్టాలేషన్’ డ్రీమ్ బస్ స్టాప్ కు రూపకల్పన చేసింది అల్లి సెరోనా నిర్వాహకులు అంటున్నారు. తాము రూపొందించిన ఈ వినూత్న ప్రక్రియ వల్ల మెట్రో పాలిటన్ ట్రాన్స్ పోర్ట్ కార్పోరేషన్ లో స్పందన కనిపిస్తుంది.. పారిశ్రామిక వాడల్లో కూడా బస్సులు అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ‘అల్లి సెరోనా’ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.