చిన్నారి సంకల్పం, మంత్రి కృషితో ఊరికి బడి!

Seethakka: నేటికాలంలో ఊరి కోసం, ప్రజల కోసం ఆలోచించే వారు కొందరు చాలా అరుదుగా ఉంటారు. ఇలాంటి వారు ఎక్కువగా యువత, పెద్దవారి ఉంటారు. వీరితో పాటు కొందరు చిన్నారులు కూడా సమాజ సేవ గురించి ఆలోచిస్తుంటారు. అలా ఓ విద్యార్థి తన సంకల్పంతో తమ గ్రామానికి పాఠశాలను తెప్పించింది.

Seethakka: నేటికాలంలో ఊరి కోసం, ప్రజల కోసం ఆలోచించే వారు కొందరు చాలా అరుదుగా ఉంటారు. ఇలాంటి వారు ఎక్కువగా యువత, పెద్దవారి ఉంటారు. వీరితో పాటు కొందరు చిన్నారులు కూడా సమాజ సేవ గురించి ఆలోచిస్తుంటారు. అలా ఓ విద్యార్థి తన సంకల్పంతో తమ గ్రామానికి పాఠశాలను తెప్పించింది.

ప్రస్తుతం సమాజం గురించి ఆలోచన చేసే వారు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ఎవరి స్వార్థం వారిదే అన్నట్లు నేటి కాలం తీరు సాగుతోంది. తమ కుటుంబం బాగుంటే చాలు అనుకునే వారే ఎక్కుయ్యారు. ఇలాంటి రోజుల్లో కూడా ఊరి కోసం, ప్రజల కోసం ఆలోచించే వారు కొందరు ఉంటారు. ఇలాంటి వారు ఎక్కువగా యువత, పెద్దవారి ఉంటారు. వీరితో పాటు కొందరు చిన్నారులు కూడా సమాజ సేవ గురించి ఆలోచిస్తుంటారు. అందుకే కొన్ని వేదికలపై మెరిసిన సందర్భంలో తమ గ్రామానికి కావాల్సిన అవసరాల గురించి ప్రస్తావిస్తుంటారు. గతంలో అలాంటి ఘటనలు అనేకం జరిగాయి. తాజాగా ఓ చిన్నారి తన సంకల్పంతో తమ గ్రామానికి పాఠశాలను వచ్చేలా చేసింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి..

తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా తాడ్వాయి మండలం తక్కళ్ల పాడు  గొత్తి కోయ గూడెం గ్రామానికి  చెందిన పునేం తులసి తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటుంది. ఈ చిన్నారి గత నెల 2వ తేదీన డ్రామా జూనియర్స్ లో పాల్గొంది. అదే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క వచ్చారు. ఇక తులసి చేసిన అద్భుత ప్రదర్శనకు సీతక్క  అక్కున  చేర్చుకుని అభినందించారు.  అదే ప్రోగ్రామ్ లో ఆ చిన్నారి..తమ ఊరి గురించి ప్రస్తావించింది. తమ ఊరిలో స్కూల్ లేదని, మేము చదువుకోవాలని, మాకు పాఠశాల భవనం నిర్మించాలనే మంత్రిని తులసి కోరింది. దీంతో స్పందించిన సీతక్క అతి త్వరలోనే పాఠశాల భవనం నిర్మిస్తామని హామి ఇచ్చింది.

అలానే 15 రోజుల వ్యవధిలోనే జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీల చొరవతో డాక్టర్ తరుణ్ రెడ్డి కొంత ఆర్థిక సాయంతో పాఠశాల భవనాన్ని నిర్మించారు. మంగళవారం ఆ భవనాన్ని  మంత్రి సీతక్క ప్రారభించారు. ఈ సందర్భంగా  తక్కళ్ల పాడు గూడెం ప్రజలు సీతక్కకి ఘనంగా స్వాగతం పలికారు.  మంత్రికి స్థానిక  ప్రజలు శాలువాలు కప్పి అభినందించారు. ఇక చిన్నారితో కలిసి పాఠశాల భవనాన్ని ప్రారంభించిన ఫోటోలను సీతక్క  సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో చిన్నారి సంకల్పం, మంత్రి కృషితో ఆ మారుమూల గ్రామానికి పాఠశాల వచ్చిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కూడా ఐదవ తరగతి చదువుతున్న బాలుడు..సీఎం రేవంత్ రెడ్డిని మెప్పించి.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు.

Show comments