Arjun Suravaram
CM Sangma: సాధారణంగా సీఎం, మంత్రుల స్థాయి నేతలు పరిపాలనకు సంబంధించిన పనుల్లో చాలా బిజీగా ఉంటారు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఇతర మాత్రమే వెరైటీగా కనిపిస్తుంటారు. తాజాగా ఓ సీఎం గిటార్ పట్టుకుని సందడి చేశారు.
CM Sangma: సాధారణంగా సీఎం, మంత్రుల స్థాయి నేతలు పరిపాలనకు సంబంధించిన పనుల్లో చాలా బిజీగా ఉంటారు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఇతర మాత్రమే వెరైటీగా కనిపిస్తుంటారు. తాజాగా ఓ సీఎం గిటార్ పట్టుకుని సందడి చేశారు.
Arjun Suravaram
సాధారణంగా ముఖ్యమంత్రులు, మంత్రుల స్థాయి నేతలు పరిపాలన పనుల్లో చాలా బిజీగా ఉంటారు. నిత్యం ప్రజల సమస్యల గురించి తెలుసుకుని వాటి పరిష్కార మార్గాల కోసం కృషి చేస్తుంటారు. అంతేకాక అధికారులతో, ఇతర ఉద్యోగులతో పరిపాలనకు సంబంధించిన వ్యవహారాల గురించి చర్చిస్తుంటారు. ఇక వారు వ్యక్తిగత అభిరుచులకు టైమ్ ఇవ్వడం అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. ఇక ముఖ్యమంత్రులు, మంత్రులు స్థాయి నేతలు వివిధ డ్యాన్సులు, ఇతర సందడి కార్యక్రమాల్లో చాలా అరుదుగా కనిపిస్తుంటారు. తాజాగా ఓ రాష్ట్ర సీఎం కూడా గిటార్ తీసుకుని వాయించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నిత్యం ప్రజా సమస్యలతో క్షణం తీరిక లేకుండా ఉండే మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా కాస్త విరామం తీసుకున్నారు. ఓ సంగీత కచేరీలో కాన్రాడ్ సంగ్మా పాల్గొన్నారు. అంతేకాక అక్కడ సంగీత కచేరీని ఎంతో ఉత్సాహంగా ఆస్వాదించారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం సంగ్మా గిటార్‌ను వాయించారు. తనదైన మ్యూజిక్ తో సీఎం అక్కడి వచ్చిన అతిథులను ఆకట్టుకున్నారు. ఇక సీఎం గిటార్ వాయించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అంతేకాక సీఎంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. మీరు గ్రేట్ సార్.. అంటూ అభినందనలు తెలిపారు.
1986లో రిలీజైన సమ్‌వేర్ ఇన్ టైమ్ ఆల్బమ్‌లోని పాటను తన గిటార్‌తో వాయించారు. ఇక్కడ విషయం ఏమిటంటే.. సీఎం తన గిటార్ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగానే దాన్ని కొన్ని గంటల్లోనే సుమారు 3 లక్షల మంది చూడడం గమనార్హంఇక మేఘాలయ ముఖ్యమంత్రి సంగ్మాకు సంగీతం అంటే చాలా ఇష్టం. అందుకే గతంలోనూ చాలా సార్లు సంగీత కార్యక్రమాల్లో పాల్గొన్ని సందడి చేశారు. గతంలో ఓ వేదికపై ఐరన్ మైడెన్ పాటకు ఆయన ఎలక్ట్రిక్ గిటార్‌ను వాయించి తన ప్రతిభను చూపించారు. దానికి సంబంధించిన వీడియోను ఆయన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. గతంలో కూడా ఆయన ఎన్నో సందర్భాల్లో గిటార్ ప్లే చేశారు. వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. సంగీతం తనకు ఎనలేని సంతోషాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుందని సీఎం కాన్రాడ్ తెలిపారు. మరి.. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.