Arjun Suravaram
Landslide Uttarakhand: ఇటీవల కొన్ని రోజుల నుంచి నార్త్ ఇండియాలోని పలు ప్రాంతంలో భారీగా వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే లోతట్టు ప్రాంతాల్లో ప్రమాదకరమైన వాతావరణం కనిపిస్తోంది. కొండ చరియలు విరిగి పడుతున్నాయి. తాజాగా ఓ భారీ కొండ విరిగిపడింది.
Landslide Uttarakhand: ఇటీవల కొన్ని రోజుల నుంచి నార్త్ ఇండియాలోని పలు ప్రాంతంలో భారీగా వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే లోతట్టు ప్రాంతాల్లో ప్రమాదకరమైన వాతావరణం కనిపిస్తోంది. కొండ చరియలు విరిగి పడుతున్నాయి. తాజాగా ఓ భారీ కొండ విరిగిపడింది.
Arjun Suravaram
ఈ మధ్యకాలంలో ఉత్తర భారతదేశంలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు భారీ వర్షాలకు అతలాకుతలం అవుతున్నాయి. ఇదే సమయంలో చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. అంతేకాక వందల రహదారులు నీటి వరదలో చిక్కుకున్నాయి. ఇక వాన కారణంగా పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఇలా జరిగిన ఘటనల్లో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఉత్తరాఖండ్ లో భారీగా కొండ చరియాలు విరిగిపడ్డాయి. అప్రమత్తమైన స్థానికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటీవల కొన్ని రోజుల నుంచి ఉత్తరాఖండ్ ప్రాంతంలో భారీగా వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే లోతట్టు ప్రాంతాల్లో ప్రమాదకరమైన వాతావరణం కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడుతున్నాయి. తాజాగా మంగళవారం ఉత్తరాఖండ్ లోని చమోలిలో భారీ కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో బద్రీనాథ్ జాతీయ రహదారి కొండ రాళ్లతో దిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో అనేక మంది ప్రయాణికులకు, వాహనాలకు అంతరాయం కలిగింది. జోషి మట్ లోని చుంగి ధార్ వద్ద కొండపై ఉండే పెద్ద భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పెద్ద పెద్ద రాళ్లతో కూడిన ఆ కొండ పేక మేడాల కూలిపోయింది. దీంతో అప్రమత్తమైన వాహనాదారులు ముందుగానే ఆ ప్రాంతం నుంచి దూరంగా వెళ్లారు.
కొండ కుప్పకూలడంతో బద్రీనాథ్, హేమకుండ్ లకు వెళ్లే యాత్రికులు చిక్కుపోయారు. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడి చేరుకున్నాయి. రోడ్డుపై విరిగిపడిన కొండ చరియలును అధికారులు తొలగిస్తున్నారు. ఇక ఆ కొండ చరియలు విరిగిపడే దృశ్యాలు చూస్తే..భయం కలుగుతుంది. పొరపాటున ఆ సమయంలో వాహనాలు ఉంటే..ఘోర ప్రమాదం జరిగి ఉండేది. వీలైనంత త్వరగా రహదారిని తిరిగి మాములు స్థితికి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. గత శనివారం కొండ చరియలు విరిగి పడి.. ఇద్దరు మరణించారు. అలానే ఓ దేశంలో గ్రామంపై కొండ చరియాలు విరిగి పడి…దాదాపు గ్రామమంతా సమాధిగా మారింది. మొత్తంగా ఈ కొండచరియాలు విరిగిపడటం అనేది నార్త్ ఇండియాలో ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం తాజాగా విరిగిపడిన కొండ చరియకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వానలు కురుస్తున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది.
#Video: Massive Landslide Blocks Badrinath Highway In Uttarakhand#BadrinathHighway #Landslide #Uttarakhand #ViralVideo
Read More: https://t.co/V3lyMzlrxc pic.twitter.com/4FtpD1eOvq
— TIMES NOW (@TimesNow) July 10, 2024