Arjun Suravaram
ప్రేమ, ఆప్యాయతలు, ఏడుపు, నవ్వు వంటివి కేవలం మనుషులకే ఉంటాయని అందరు భావిస్తారు. కానీ ఆ భావోద్వేగాలు మూ జీవాలకు సైతం ఉంటాయి. ఆ మాటలు నిజం చేసే ఘటన ఛత్తీస్ గడ్ లో చోటుచేసుకుంది.
ప్రేమ, ఆప్యాయతలు, ఏడుపు, నవ్వు వంటివి కేవలం మనుషులకే ఉంటాయని అందరు భావిస్తారు. కానీ ఆ భావోద్వేగాలు మూ జీవాలకు సైతం ఉంటాయి. ఆ మాటలు నిజం చేసే ఘటన ఛత్తీస్ గడ్ లో చోటుచేసుకుంది.
Arjun Suravaram
సాధారణంగా నవ్వు, ఏడుపు, కోపం, పగా, ప్రేమ.. ఇవన్నీ కేవలం మనుషులకే పరిమితం అనుకుంటాం. అయితే ఈ భావోద్వేగాలకు మూగ జీవాలు కూడా మినహాయింపు కాదు. కొన్ని సంఘటనలు చూసినప్పుడు ఇది నిజమే అనిపిస్తుంది. తమ యజమాని చనిపోతే.. ఆ విషయం తెలియక రోజుల తరబడి ఆయన కోసమే ఎదురు చూసే శనకాలు. తమ తోటి వానర చనిపోతే.. వందలాది వానారులు చుట్టూ చేరే ఘటనలు అనేకం జరిగాయి. తాజాగా కూడా మనస్సుకు హత్తుకునే ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ కోతి చనిపోతే.. దాని అంత్యక్రియలకు వందలాదిగా తోటి వానరాలు వచ్చాయి. ఈ ఘటన ఛత్తీస్ గడ్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఛత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ జిల్లా కోటా ప్రాంతంలో కోతులు సంచారం ఎక్కువగా ఉంది. స్థానికంగా ఉండే దొరికే పదార్థాలను తినుకుంటూ ఆ వానరులు జీవనం సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వానర మృతి చెందింది. కోటా పట్టణంలోని పోస్టాఫీసుకు సమీపంలో హైవోల్టేజీ విద్యుత్ తీగలు తగిలి వానరం చనిపోయింది. సమాచారం అందుకున్న ఓ హైందవ సంస్థ సభ్యులు అక్కడి చేరుకున్నారు.
ఆ కోతికి అంత్యక్రియలు చేయాలని భావించారు. దీంతో ఆ సంస్థ సభ్యులు వానర కళేబేరాన్ని ఓ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. అక్కడ చిన్నపాటి గొయ్యి తవ్వి.. అంత్యక్రియలు మొదలు పెట్టారు. ఇక తమ తోటి వానరానికి అంతిమ వీడ్కొలు పలికేందుకు పెద్ద సంఖ్యలో కోతులు అక్కడికి తరలివచ్చాయి. అంత్యక్రియలు జరుగుతున్న ప్రాంతాన్నికి సమీపంలో ఉన్న భవనం వద్దకు చేరుకున్నాయి. భవనం మీద నుంచి వరుసగా కూర్చొని తమ తోటి వానర అంత్యక్రియలను చూశాయి. అలా ఈ కార్యక్రమం ముగిసేదాక ఆ కోతులన్ని మౌనంగా చూస్తూ ఉండిపోయాయి. ఈ ఘటన చూసిన స్థానికుల కళ్లలలు నీళ్లు తిరిగాయి. ఇలా చనిపోయిన తోటి వానరం అంత్యక్రియలకు గుంపుగా కోతులు హాజరై స్థానికులను ఆశ్చర్యపరిచాయి. ఇలాంటి ఘటనలు గతంలో కూడా అనేకం జరిగాయి. కదిలించే హృదయం కేవలం మనుషులకే కాదు మూగ జీవాలకు సైతం ఉంటుందని ఇలాంటి ఘటనలు నిరూపిస్తుంటాయి.
బంధాలు, అనుబంధాలు మనుషులకే పరితం కాదని ఇలాంటి ఘటనలు నిరూపిస్తాయి. గతంలో ఓ ఆవు చనిపోతే.. దాని చుట్టూ పదుల సంఖ్యలో ఆవులు వచ్చి చేరాయి. అంతేకాక తన తల్లి మరణించిందని తెలియక అక్కడే కూర్చోని ఉండిపోయింది. స్థానికులు ఎంత వచ్చిన.. పక్కకు తోలిన కూడా తరిగి ఆ చినిపోయిన ఆవు వద్దకే దూడ వచ్చింది. అప్పట్లో జరిగిన ఈ ఘటన అందరిని కన్నీరు పెట్టించింది. తాజాగా ఛత్తీస్ గడ్ లో జరిగిన కోతి అంత్యక్రియల ఘటన మరోసారి అందరి మనస్సు బరువెక్కేలా చేసింది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.