iDreamPost

RTC Bus: RTC కండక్టర్ ఓవరాక్షన్… ప్రయాణికుడికి లక్ష రూపాయల పరిహారం!

తనను బస్సు నుంచి కండక్టర్ అకారణంగా దించేశాడని భావించిన ఓ ప్రయాణికుడు.. చివరికి ఆ కండక్టర్‌కు చుక్కలు చూపించాడు. కండక్టర్ బలవంతంగా బస్సు నుంచి దించేయడంతో న్యాయపరంగా పోరాటం చేసి విజయం సాధించారు.

తనను బస్సు నుంచి కండక్టర్ అకారణంగా దించేశాడని భావించిన ఓ ప్రయాణికుడు.. చివరికి ఆ కండక్టర్‌కు చుక్కలు చూపించాడు. కండక్టర్ బలవంతంగా బస్సు నుంచి దించేయడంతో న్యాయపరంగా పోరాటం చేసి విజయం సాధించారు.

RTC Bus: RTC కండక్టర్ ఓవరాక్షన్… ప్రయాణికుడికి లక్ష రూపాయల పరిహారం!

ప్రజలు రవాణ సౌకర్యం కోసం ఎక్కువగా వినియోగించే వాటిల్లో ఆర్టీసీ ఒకటి. ప్రతి రాష్ట్రానికి ఆర్టీసీ సంస్థ అనేది ఉంటుంది. ఇక ఈ వ్యవస్థ ద్వారా నిత్యం వేలాది మధ్య గమన్య స్థానాలకు చేరుతుంటారు. ఆర్టీసీ ప్రయాణం సురక్షితం అనే భావన ప్రజల్లో బలంగా ఉంది. అందుకే ఇందులో ఎక్కువగా ప్రయాణం చేస్తుంటారు. అలానే ఆర్టీసీ కూడా ప్రజలకు ఎన్నో సౌకర్యాలతో సేవలు అందిస్తోంది. ఆర్టీసీలోని ఉద్యోగులు కూడా ప్రయాణికుల పట్ల ఎంతో హుందాగా ఉంటూ విధులు నిర్వహిస్తుంటారు. కానీ కొందరు ఉద్యోగులు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. అలా చేసిన ఓ కండక్టర్ కారణంగా.. ఆర్టీసీ లక్ష రూపాయల నష్టం జరిగింది. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

తమిళనాడు రాష్ట్రానికి చెందిన దైవసిగమణి అనే  42 ఏళ్ల వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడులోని విల్లుపురం నుంచి బెంగళూరుకు వెళ్లేందుకు కేఎస్ ఆర్టీసీ బస్సు ఎక్కాడు. అయితే తనతోపాటు భార్య, కుమార్తెకు కూడా ఆన్‌లైన్‌లో బస్ టికెట్ బుక్ చేసుకుని గతేడాది జులై 2 వ తేదీన రాత్రి 8 గంటలకు బస్ ఎక్కాడు. వారితో పాటు 15 కిలోలు వేరుశనగ నూనెను తీసుకెళ్తున్నారు. ఆనూనె డబ్బాను గమనించిన కండక్టర్ జగదీష్.. దానకి అదనంగా రూ.200 చెల్లించాలని డిమాండ్ చేశాడు. అయితే అందుకు దైవసిగమణి నిరాకరించాడు. కేవలం రూ.50 ఇస్తానని చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. సీల్ లేని నూనె క్యాన్లు ఆర్టీసీలో రవాణ చేయకూడదని అధికారులు చెప్పారు. నూనె క్యాన్ లేకుండా తాను మాత్రం బస్సులో ప్రయాణించేది లేదని దైవసిగమణి తేల్చి చెప్పాడు. దీంతో చేసేదేమీ లేక ఆ నూనె క్యాన్ తీసుకుని దైవసిగమణి అర్ధరాత్రి బస్సు దిగిపోగాడు.

దైవసిగమణి.. విల్లుపురంలోని వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించి తాను పడిన ఇబ్బందుల గురించి వివరించాడు. విచారణ చేపట్టిన కన్జూమర్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బస్సు సిబ్బంది టికెట్ తీసుకున్న ప్రయాణికుడిని మధ్యలో దించేయకూడదని తెలిపింది. ఈ కేసులో బాధితుడైన దైవసిగమణికి రూ.1 లక్ష నష్ట పరిహారంతో పాటు టికెట్ డబ్బులు రూ.660 తిరిగి చెల్లించాలని.. కేఎస్ఆర్టీసీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరి.. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి