iDreamPost
android-app
ios-app

కుమార్తె పెళ్లిలో అతిథులకు వెరైటీ బహుమతులు ఇచ్చిన తండ్రి!

ఈ ఆధునిక సమాజంలో.. చాలా మంది అత్యాధునికంగా తమపెళ్లిని జరుపుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలానే మరికొందరు సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చేలా తమ కుటుంబలోని వివాహలను చేస్తున్నారు.

ఈ ఆధునిక సమాజంలో.. చాలా మంది అత్యాధునికంగా తమపెళ్లిని జరుపుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలానే మరికొందరు సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చేలా తమ కుటుంబలోని వివాహలను చేస్తున్నారు.

కుమార్తె పెళ్లిలో అతిథులకు వెరైటీ బహుమతులు ఇచ్చిన తండ్రి!

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది చాలా ప్రత్యేకమైనది. ఈ మధురమైన వేడుక జీవితాంతం గుర్తుండిపోయేలా జరుపుకోవాలని యువత భావిస్తుంది. ఇక వారి ఆలోచనకు పెద్దలకు కూడా సహకరిస్తున్నారు. అందుకే ఇటీవల కాలంలో పెళ్లి కార్డు మొదలు కొన్ని పెళ్లి మండపంలో జరిగే ప్రతి కార్యక్రమాల్లో చాలా ప్రత్యేకతలు కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే కొందరు తమ పెళ్లితో సమాజాన్నికి సందేశం ఇవ్వాలని భావిస్తారు. ఇటీవలే ఒక వ్యక్తి..తన పెళ్లి వేడుకలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి.. అందరికి ఆదర్శంగా నిలిచారు. తాజాగా ఓ తండ్రి తన కుమార్తె పెళ్లిలో అతిథులకు అరుదైన బహుమతులు ఇచ్చారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

నేటికాలంలో రోడ్డు ప్రమాదాలా కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు ఎక్కువగా మరణిస్తున్నారు. ఇక చిన్నప్రమాదాలకు సైతం కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకు కారణం.. వారు హెల్మెట్  ధరించకుండా ప్రయాణం చేయడం. ఇలా హెల్మెంట్ లేని కారణంగా చిన్నపాటి ప్రమాదాల్లో కూడా ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. బైక్ పై వెళ్తున్నప్పుడు శిరస్త్రాణాలను ధరించండి అంటూ ప్రభుత్వాలు, పోలీసులు ఎంత ప్రచారం చేసినా చాలా మందిలో మార్పురావడం లేదు. అలానే పలువురు సామాన్యులు కూడా హెల్మెట్ వినియోగంపై వివిధ రకాలుగా ప్రచారం చేస్తుంటారు. అంతేకాక తమ ఇంట జరిగే వేడుకల్లో కూడా వీటి గురించి ప్రస్తావిస్తుంటారు. అలానే ఓ తండ్రి కూడా తన కుమార్తె వివాహానికి హాజరైన అతిథులకు హెల్మెట్స్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. తన కుమార్తె పెళ్లి ద్వారా ఈ బహుమతులు ఇవ్వడంతో కొన్ని ప్రాణాలకు అయినా రక్షణ ఇచ్చినట్లు ఉంటుందని ఆయన భావించాడరంట. ఈ ఘటన ఛత్తీస్ గఢ్ లో చోటుచేసుకుంది.

ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా నగరంలో ముదాపర్‌ ప్రాంతానికి చెందిన సెడ్‌ యాదవ్‌కి నీలిమ అనే కుమార్తె ఉంది. ఆమెను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. అలానే నిత్యం జరిగే రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారిని చూసి యాదవ్ కలత చెందారు. ముఖ్యంగా హెల్మెట్ ధరించని కారణంగా మరణించేవారిని చూసి.. చిన్నపాటి నిర్ణక్ష్యం ప్రాణాలు పోతున్నాయని బాధ పడ్డారు. తన ఇంట జరిగే కార్యక్రమంలోత హెల్మెట్ల వినియోగంపై జనాలకు అవగాహన కల్పించాలని భావించాడు. ఇటీవలే యాదవ్ కుమార్తె నీలిమాకు అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. సోమవారం నీలిమా వివాహం ఘనంగా జరిగింది. ఇక ఈ వివాహానికి పెద్ద సంఖ్యలో అతిథులు విచ్చేశారు. నూతన వధువరులను ఆశీర్వదించారు.

అలానే ఈ సందర్భంగా అతిథులకు యాదవ్‌ బహుమతులు పంపిణీ చేశారు. అయితే అందరూ అనుకున్నట్లు ఇంట్లో వినియోగించే వస్తువులు కావు.. ప్రాణాలు నిలిపే హెల్మెట్లు. తన కుమార్తె పెళ్లికి వచ్చిన బంధువులకు, అతిథులకు యాదవ్ హెల్మెట్లు బహుమతిగా ఇచ్చారు. అంతేకాదు.. ఆయన కుటుంబసభ్యులు హెల్మెట్లు ధరించి పెళ్లి మండపంలో డ్యాన్స్ చేశారు. ఈ సందర్భంగా యాదవ్ మాట్లాడుతూ.. ఇదంతా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడానికే చేశామని చెప్పుకొచ్చారు. జీవితం చాలా విలువైందని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని అతిథులను, ప్రజలను ఆయన కోరారు. మరి.. తన కుమార్తె పెళ్లిలోనే సమాజానకి ఉపయోగ పడే సందేశం ఇచ్చిన ఈ తండ్రిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.