iDreamPost
android-app
ios-app

ఛీ! ఇంత నీచమా.. చెప్పుపై ఉమ్మేసి నాకించారు! వైరల్‌ వీడియో

  • Published Jul 11, 2023 | 1:59 PM Updated Updated Jul 11, 2023 | 1:59 PM
  • Published Jul 11, 2023 | 1:59 PMUpdated Jul 11, 2023 | 1:59 PM
ఛీ! ఇంత నీచమా.. చెప్పుపై ఉమ్మేసి నాకించారు! వైరల్‌ వీడియో

ఉత్తర భారతంలో జరుగుతున్న దారుణ ఘటనలు ఆటవికుల సైతం అసహ్యించుకునేలా ఉన్నాయి. ఇటీవల ఓ గిరిజనుడిపై బీజేపీ ఎమ్మెల్యే అనుచరుడు మూత్రం పోసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్‌లో ఓ దళితుడిని ప్రభుత్వ ఉద్యోగి తన చెప్పులు నాకించాడు. తాజాగా ఓ వ్యక్తి కేవలం రూ.8 వేల కోసం చెప్పుపై ఉమ్మేసి ఆ ఉమ్మును, చెప్పును నాకించిన దారుణం ఘటన యూపీలో చోటు చేసుకుంది.

ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలో ఒక వ్యక్తి మరో వ్యక్తికి రూ.8,000 తిరిగి ఇవ్వనందుకు చెప్పుపై ఉమ్మేసి, ఆ ఉమ్ముని అప్పు తీసుకున్న వ్యక్తితో నాకించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. దిలీప్ మిశ్రా అనే వ్యక్తి విద్యుత్ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.

అతను ఏప్రిల్ 9, 2023న తన విద్యుత్ బిల్లును తగ్గించమని, సనోజ్ కనౌజియా రూ.8 వేలను దిలీప్‌ మిశ్రాకు ఇచ్చాడు. డబ్బు తీసుకున్న మిశ్రా కరెంట్‌ బిల్లును తగ్గించడంలో విఫలం అయ్యాడు. దీంతో తన రూ.8 వేలను తిరిగి ఇవ్వాలని సనోజ్‌ ఒత్తిడి చేశాడు. దిలీప్‌ మిశ్రా డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో కనౌజియా అతని చెప్పుపై ఉమ్మి వేసి, దాన్ని దిలీప్‌తో నాకించాడు. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: అలాంటి యువకులే ఆమె టార్గెట్‌.. అందంతో ఎర వేసి మరీ..

Jojobet Girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet