iDreamPost
android-app
ios-app

ఓటు వేయకుంటే 3 నెలల జీతం కట్‌.. ఎక్కడంటే

  • Published Apr 27, 2024 | 4:42 PM Updated Updated Apr 27, 2024 | 4:42 PM

Lok Sabha Polls 2024: మన దేశంలో ఓటు హక్కు వినియోగించుకోవడం బాధ్యత. కానీ కొన్ని చోట్ల ఇది తప్పనిసరి విధి. లేదంటే జరిమానా, శిక్షలు విధిస్తారు. ఎక్కడంటే

Lok Sabha Polls 2024: మన దేశంలో ఓటు హక్కు వినియోగించుకోవడం బాధ్యత. కానీ కొన్ని చోట్ల ఇది తప్పనిసరి విధి. లేదంటే జరిమానా, శిక్షలు విధిస్తారు. ఎక్కడంటే

  • Published Apr 27, 2024 | 4:42 PMUpdated Apr 27, 2024 | 4:42 PM
ఓటు వేయకుంటే 3 నెలల జీతం కట్‌.. ఎక్కడంటే

దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు దశల్లో వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. నాలుగో దశలో అనగా మే 13 న పోలింగ్‌ జరగనుంది. నాడు తెలంగాణలో పార్లమెంట్‌ స్థానాలకు ఓటింగ్‌ జరగనుండగా.. ఏపీకి సంబంధించి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ జరుగుతుంది. ఇక ఇప్పటి వరకు జరిగిన రెండు దశల పోలింగ్‌లో ఓటింగ్‌ శాతం తగ్గినట్లు తెలిసింది. ఇక కొన్ని ప్రాంతాల్లో అయితే జీరో ఓటింగ్‌ నమోదయ్యింది. ఇక బెంగళూరు లాంటి మెట్రో నగరాల్లో సగం మందికి పైగా ఓటు హక్కును వినియోగించుకోలేదు. బెంగళూరు అనే కాదు.. ఎన్నికల వేళ మెట్రో నగరాలన్నింటిలో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మన దేశంలో సరిగ్గా ఓటు వేసేది కేవలం గ్రామీణ ప్రాంతాల వారు మాత్రమే.

ఇక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన నాటి నుంచి ఎన్నికల సంఘం ఓటర్లకు ఓటు హక్కు విలువను తెలియజేస్తూ, పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయినప్పటికీ పలు ప్రాంతాల్లో ఓటింగ్‌ శాతం తక్కువగానే నమోదవుతుంటుంది. మన దగ్గర ఓటు వేయకపోతే ఏం అనరు కానీ.. ప్రపంచలోని కొన్ని దేశాల్లో ఓటు హక్కు వినియోగం తప్పనిసరి. ఆయా దేశాల్లోని ఓటర్లు.. కచ్చితంగా తమ ఓటు వేయాలి. లేదంటే కఠిన శిక్షలు ఎదుర్కొవాల్సి వస్తుంది. మరి ఓటేయ్యకపోతే శిక్షించే దేశాలు ఏవి అంటే..

ప్రపంచంలోని 19 దేశాల్లో ఓటు హక్కు వినియోగం తప్పనిసరి చేశారు. ఆయా దేశాల్లో ఓటు వేయని పౌరులను శిక్షించేందుకు ప్రభుత్వాలకు అధికారం ఉంది. ఈ దేశాలలోని పౌరులు తప్పనిసరిగా ఓటు వేయాలి. ఓటు హక్కు వినియోగం తప్పనిసరి చేసిన దేశాల జాబితాలో ఆస్ట్రేలియా, అర్జెంటీనా, బెల్జియం, బ్రెజిల్, చిలీ, సైప్రస్, కాంగో, ఈక్వెడార్, ఫిజీ, పెరూ, సింగపూర్, టర్కీ, ఉరుగ్వే, స్విట్జర్లాండ్ ఉన్నాయి. ఈ దేశాల్లో ఓటు వేయాలనే నియమాన్ని ఉల్లంఘిస్తే శిక్ష విధిస్తారు.

ఆస్ట్రేలియా, అర్జెంటీనా, బ్రెజిల్, సింగపూర్, టర్కీ, బెల్జియం సహా 19 దేశాల్లో ఎన్నికల ప్రక్రియ దాదాపు మన దేశంలోలానే ఉంటుంది. కాకపోతే సింగపూర్‌లో ఎవరైనా ఓటు వేయకపోతే వారు తమ ఓటు హక్కును కోల్పోతారు. ఇక బ్రెజిల్‌లో ఓటు వేయకపోతే పాస్‌పోర్ట్ జప్తు చేస్తారు. బొలీవియాలోని పౌరులెవరైనా ఓటు వేయకుంటే వారి మూడు నెలల జీతం వెనక్కి తీసుకుంటారు. బెల్జియంలో 1893 నుండి ఇటువంటి నిబంధన అమలులో ఉంది. ఆ దేశంలో ఓటు వేయనివారికి జరిమానా విధిస్తారు. మన దేశంలో మాత్రం ఎలాంటి శిక్షలు లేవు. కాకపోతే ఓటు వేయడం మన బాధ్యత అని ప్రచారం చేస్తారు.