iDreamPost
android-app
ios-app

Ayodhya Ram Mandir: ప్రాణ ప్రతిష్టకు దూరంగా ఎల్ కే అద్వానీ..!

అయోధ్యలో అపూర్వ ఘట్టం చోటుచేసుకుంది. 500 చరిత్రల నాటి వివాదానికి 2019లోనే తెరపడినప్పటికీ.. అక్కడ రాముని సాక్షాత్కారం కోసం మరో నాలుగేళ్లు పట్టింది. ఈ అద్భుతం కోసం పోరాడిన యోధుల్లో ఒకరు ఎల్ కే అద్వానీ.. మరీ ఆయన ఇప్పుడు ఎక్కడ..?

అయోధ్యలో అపూర్వ ఘట్టం చోటుచేసుకుంది. 500 చరిత్రల నాటి వివాదానికి 2019లోనే తెరపడినప్పటికీ.. అక్కడ రాముని సాక్షాత్కారం కోసం మరో నాలుగేళ్లు పట్టింది. ఈ అద్భుతం కోసం పోరాడిన యోధుల్లో ఒకరు ఎల్ కే అద్వానీ.. మరీ ఆయన ఇప్పుడు ఎక్కడ..?

Ayodhya Ram Mandir: ప్రాణ ప్రతిష్టకు దూరంగా ఎల్ కే అద్వానీ..!

అయోధ్యలో రామ జన్మభూమి కోసం పోరాడిన యోధుల్లో ముందు వరుసలో ఉంటారు బీజెపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ (ఎల్ కే అద్వాణీ). అయోధ్యలో ఇప్పుడు పురుడు పోసుకున్న రామ మందిర నిర్మాణం కోసం ఓ పెద్ద పోరాటమే జరిగింది. అక్రమ కట్టడంగా ఉన్న బాబ్రీ మసీదుపై సోమనాథ్ నుండి దండయాత్రను చేపట్టి ఎన్ని అడ్డంకులు వచ్చినా వెన్ను చూపని ధైర్యం ఆయనది. డిసెంబర్ 1992, ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థలు, బీజెపీ మద్దతుదారులు, కర సేవకులు బాబ్రీ మసీదును కూల్చివేశారు. ఈ సమయంలో ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి వంటి నేతల ప్రసంగాలు.. రామ జన్మభూమి కోసం పోరాడేలా చేశాయి.

ఎల్ కే అద్వానీ ఆనాడు చేసిన పోరాటానికి ఇప్పుడు ప్రతిఫలం దక్కింది. అయోధ్య-బాబ్రీ మసీదు వివాదానికి సుప్రీంకోర్టు తెరదించింది. వివాదాస్పద 22.7 ఎకరాల భూమి రామ్ లల్లాకు చెందుతుందని, ఆ భూమిని ట్రస్ట్ ఏర్పాటు చేసి.. రామాలయం నిర్మించాలని 2019లో అప్పటి చీఫ్ జస్టిస్ రంజన్ గోగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. దీంతో 500 ఏళ్ల నాటి కలను అడుగు పడింది. అప్పటి నుండి నిర్మాణం చేపట్టగా..ఎట్టకేలకు పూర్తయ్యి.. ఈ రోజు బాల రాముడికి ప్రాణ ప్రతిష్ట జరిగింది. కాగా, అయోధ్య నిర్మాణానికి బాటలు వేసిన తొలి తరం నేతలకు ఆహ్వానాలు అందాయి. ఈనేపథ్యంలో ఎల్ కే అద్వానీకి కూడా ఆహ్వానం అందింది. అయితే వయస్సు దృష్ట్యా ఆయన వస్తారా రారా అన్న సందేహం నెలకొంది.

అయితే రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ సైతం ఆహ్వానించినప్పటికీ.. వయస్సు నిమిత్తం ఇంటి వద్దే ఉండి వీక్షించాలని సూచించింది. ప్రస్తుతం ఆయన వయస్సు 96 సంవత్సరాలు. ఈ వయస్సులో ఆయనను ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో ఈ సూచన చేసింది. ఇది ఇలా ఉంటే.. ఆయన అయోధ్య వచ్చేందుకు సిద్దమయ్యారన్న వార్తలు వచ్చాయి. కానీ బీజెపీ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం.. ఆయన వేడుకలకు దూరంగా ఉండనున్నారు. యుపిలో చలి ఎక్కువగా ఉండటంతో పాటు.. ఆయన ఈ వేడుకలకు హాజరు కాలేరని, ఈనెల చివరిలోగా రామాలయాన్ని సందర్శిస్తారని విశ్వ హిందూ పరిషత్ నాయకుడు ఒకరు చెప్పారు. అలాగే ఈ అయోధ్య రామాలయానికి కారకులైన మరో కీలక వ్యక్తి మనోహర్ జోషి కూడా కురు వృద్ధుడు కావడంతో ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నారని తెలుస్తోంది.