50 జంటలకు అంబానీ ఇచ్చిన బహుమతులు ఇవే.. బంగారం- డబ్బు..!

Gifts Given To The Couples By Mukesh Ambani And Nita Ambani: ముఖేష్ అంబానీ కుటుంబం 50 నిరుపేద జంటలకు సామూహిక వివాహాలు జరిపించిన విషయం తెలిసిందే. అయితే ఆ జంటలకు అంబానీ కుటుంబం ఇచ్చిన బహుమతులు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.

Gifts Given To The Couples By Mukesh Ambani And Nita Ambani: ముఖేష్ అంబానీ కుటుంబం 50 నిరుపేద జంటలకు సామూహిక వివాహాలు జరిపించిన విషయం తెలిసిందే. అయితే ఆ జంటలకు అంబానీ కుటుంబం ఇచ్చిన బహుమతులు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.

గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా ఒక వివాహం గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అదేంటంటే.. అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ వివాహమే. ఇప్పటికే రెండుసార్లు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అలాగే సొంత ప్రాంతంలో ఉండే ప్రజలకు అన్న సేవ కూడా చేశారు. అంతేకాకుండా.. తాజాగా అంబానీ కుటుంబం ఏకంగా 50 నిరుపేద జంటలకు సామూహిక వివాహాలు కూడా జరిపించారు. అక్కడితో ఆగకుండా ఆ 50 నిరుపేద జంటలకు బహుమతులు కూడా ఇచ్చారు. బహుమతులు అంటే అలాంటి ఇలాంటివి కాదండోయ్.. బంగారం, గృహోపకరణాలు, నగదు అంటూ చాలానే ముట్టజెప్పారు

సాధారణంగా ముఖేష్ అంబానీలాంటి కుబేరుల ఇంట్లో పెళ్లిళ్లు అంటే ప్రజలు అందరూ మాట్లాడుకుంటారు. అయితే ఎవరైనా కోటీశ్వరులు, సెలబ్రిటీలు అంటే వారి తంతును వారికి నచ్చిన వారి మధ్య, చాలా ప్రైవేటు స్పేస్ లో జరుపుకుంటారు. కానీ, ముఖేష్ అంబానీ కుటుంబం మాత్రం వారి కుమారుడికి పెళ్లి నిశ్చయమైనప్పటి నుంచి సాంప్రదాయ పద్ధతిలో ఎన్నో కార్యాక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. వాటిలో పూజలు, సంస్కృతి మాత్రమే కాకుండా.. సేవ, సహాయం, ఇలాంటి సామూహిక పెళ్లిళ్లు కూడా ఉన్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు ముఖేష్ అంబానీ కుటుంబం 50 మంది పేద జంటలకు వివాహం చేశారు. అక్కడితో ఆగకుండా వారికి కావాల్సిన సరుకులు, వస్తువులు, బహుమతులు ఇచ్చి వారిని సంతోష పెట్టారు. ఇప్పుడు అంతా అంబానీ ఇచ్చిన బహుమతుల గురించే మాట్లాడుకుంటున్నారు.

ఈ సామూహిక వివాహాలు ముంబయికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫాల్ఘర్ కు చెందిన 50 జంటలకు రిలయన్స్ కార్పొరేట్ పార్క్ లో ఈ సామూహిక వివాహాలు జరిపించారు. అనంత్- రాధికాల వివాహానికి ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ శుభకార్యంతోనే అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ లా వివాహ వేడుకలు ప్రారంభం అవుతాయని నీతా అంబానీ వెల్లడించారు. ఈ సామూహిక వివాహాలకు అంబానీ కుటుంబం మొత్తం హాజరైంది. అలాగే కుమార్తె ఇషా అంబానీ, ఆమె భర్త ఆనంద్ పిరమల్ కూడా ఈ వివాహ వేడుకలకు హాజరయ్యారు. అలాగే వచ్చిన అతిథులు, జంటలకు చెందిన కుటుంబసభ్యులు ఇలా మొత్తం ఈ వేడుకకు దాదాపుగా 800 మంది వరకు హాజరయ్యారు. ఈ వివాహాల తర్వాత అతిథులు అందరికీ మంచి విందు ఏర్పాటు చేశారు. అలాగే గిరిజన సంప్రదాయంలో ఒక అద్భుతమైన నృత్య ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు.

బహుమతులు:

ఈ సామూహిక వివాహాల కార్యక్రమంలో మూడు ముళ్ల బంధంతో ఒకటైన జంటలకు అంబానీ కుటుంబం పెద్దఎత్తున బహుమతులు ఇచ్చింది. ముందుగా ప్రతి జంటకు బంగారు మంగళసూత్రం ఇచ్చింది. అలాగే పెళ్లి ఉంగరాలు, ముక్కుపుడక సహా వెండి వస్తువులు అందజేశారు. అలాగే ఈ జంటలకు ఏడాదికి సరిపడా వస్తువులను అందజేశారు. వాటిలో సరుకులు మాత్రమే కాకుండా.. గృహోపకరణాలు కూడా ఉన్నాయి. అంటే ఫ్యాన్, గ్యాస్ స్టవ్, మిక్సీ, పరుపు, దిండ్లు వంటి వస్తువులు కూడా ఉండటం విశేషం. వీటికి అదనంగా ప్రతి వధువుకు రూ.1.01 లక్షల చెక్కును అందజేశారు. స్త్రీ ధన్ పేరిట ఈ డబ్బును వారి ఆర్థిక బలోపేతానికి అందజేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అంబానీ కుటుంబం చేసిన సామూహిక వివాహాలు, ఇచ్చిన బహుమతుల గురించే మాట్లాడుకుంటున్నారు.

Show comments