iDreamPost
android-app
ios-app

గోవా మద్యపాన నిషేధం? త్వరలో ప్రభుత్వం సంచలన నిర్ణయం!

Liquor in Goa: ఇటీవల కాలంలో మద్యం ప్రియులకు వరుస చిక్కులు వచ్చి పడుతున్నాయి. ఎందుకంటే.. ఈ మధ్య ఏదో ఒక కారణంతో మద్యం దుకాణాలు బంద్‌ అవుతున్నాయి. తాజాగా మరో బ్యాడ్ న్యూస్ వచ్చింది.

Liquor in Goa: ఇటీవల కాలంలో మద్యం ప్రియులకు వరుస చిక్కులు వచ్చి పడుతున్నాయి. ఎందుకంటే.. ఈ మధ్య ఏదో ఒక కారణంతో మద్యం దుకాణాలు బంద్‌ అవుతున్నాయి. తాజాగా మరో బ్యాడ్ న్యూస్ వచ్చింది.

గోవా మద్యపాన నిషేధం? త్వరలో ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఈ మధ్యకాలంలో మద్యం తాగుతున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది.  ఏ చిన్న వేడుక చేసిన అక్కడ మందు తప్పని సరిగా ఉంటుంది. అదిలేనిదే పార్టీ లేదు అంటే అతిశయోక్తి కాదు. ఇక ఆదివారం వచ్చిదంటే చాలు.. చాలా మంది మద్యపానంలో  మునిగి తేలుతుంటారు. కొందరికి అయితే మద్యం తాగడంతోనే రోజు ప్రారంభమవుతుంది. ఇది ఇలా ఉంటే మద్యం అంటే ఠక్కున గుర్తుకు వచ్చే రాష్ట్రం గోవా.  ఎక్కువ మంది మద్యం ప్రియులు అక్కడి వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో  ఆ మందుబాబులు ఓ బ్యాడ్ న్యూస్ వచ్చింది. త్వరలో గోవాలో మద్యపాన నిషేదం జరగనుంది.

మద్యం తాగే వారు ఎక్కువగా టూర్ కి వెళ్లే ప్రాంతం గోవా. కారణంగా.. ఇది మద్యాన్నికి పెట్టింది పేరు. ఇంకా చెప్పాలంటే.. అత్యధిక మద్యం సేవించే రాష్ట్రాల్లో గోవా ఒకటి. మందు తాగుతూ సముద్ర అందాలను వీక్షించేందుకు ఎంతో మంది మంది గోవాలో పర్యటిస్తుంటారు. ప్రత్యేకంగా మద్యం తాగేందుకే గోవా వెళ్లే వారు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇది ఇలా ఉంటే… మందు బాబులకు ఓ బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది.  గోవాలో మద్యం నిషేధించాలనే డిమాండ్ వినిపిస్తోంది. మంగళవారం బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ఈ డిమాండ్ ను అసెంబ్లీలోకి ప్రస్తావించారు. అదే నిజమైతే..త్వరలో గోవాలో మద్యపాన నిషేధం జరగనుందని పలువురు అభిప్రాయా పడుతున్నారు.

మంగళవారం గోవాలో మద్యాన్ని నిషేధించాలని బిజెపి ఎమ్మెల్యే ప్రమేంద్ర షెట్ అసెబ్లీలో డిమాండ్ చేశారు. దీనివల్ల అలా నిషేదించడం ద్వారా మద్యపానాన్ని పెద్ద ఎత్తన అరికట్టవచ్చని తెలిపారు. గోవాలో మద్యం వల్ల పెద్ద సంఖ్యలో రోడ్డు, కంపెనీ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన గోవాను, మరింత అభివృద్ధి చెందిన రాష్ట్రం నిర్మించాలంటే… మద్యపాన నిషేధాన్ని విధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని ఆయన తెలిపారు. మద్యాన్ని నిషేధించిన రాష్ట్రాల జాబితాలో గోవాను చేర్చాలని ఆయన కోరారు. మద్యపాన వినియోగాన్ని సగం అయినా తగ్గిస్తే బాగుంటుందని అన్నారు. అలానే గోవాలో మద్యం ఉత్పత్తి కొనసాగించాలని, అయితే దానిని రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాలకు సప్లయ్ చేయాలని ఎమ్మెల్యే కోరారు.

తాజాగా ఈ మద్య నిషేద ప్రస్తావన రావడానకి కొన్ని సంఘటనలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. గోవాలో విద్యాసంస్థలు, ప్రార్థనా స్థలాలకు దగ్గర్లో 269 మద్యం షాపులను ఏర్పాటు చేయడంతో ఈ ప్రస్తావన వచ్చిందని తెలుస్తోంది. మొత్తంగా గోవాలో మద్యపానం నిషేదం అనే వార్త మందుబాబులను షాకి గురి చేస్తుంది. ఇదే అమలు అయితే తరచూ గోవాకు వెళ్లి.. అక్కడే మద్యం తాగుతూ ఎంజాయ్ చేసేవారికి గట్టి షాక్ అనే చెప్పాలి.