Liquor Ban: మందుబాబులకు భారీ షాక్‌.. 4 రోజుల పాటు మద్యం అమ్మకాలు బంద్‌

మందుబాబులకు ఇది భారీ షాకింగ్‌ న్యూస్‌. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4 రోజుల పాటు వైన్స్‌ బంద్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

మందుబాబులకు ఇది భారీ షాకింగ్‌ న్యూస్‌. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4 రోజుల పాటు వైన్స్‌ బంద్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

మందుబాబులకు భారీ షాక్‌ తగలనుంది. వరుసగా నాలుగు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసి వేస్తూ.. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ వార్త తెలిసి మందు బాబులు తెగ గింజుకుంటున్నారు. అరే 4 రోజుల పాటు వైన్స్‌ బంద్‌ చేస్తే.. మా పరిస్థితి ఏంటి.. చుక్క పడకపోతే మాకు తెల్లారదు.. నిద్ర పట్టదు ఎలా మరి. అయినా ఇప్పుడు ఏం ఎలక్షన్స్‌ లేవు.. పండగలు, ర్యాలీలు లేవు.. ఎందుకు ఇన్ని రోజులు మద్యం దుకాణాలు మూసివేస్తున్నారు.. ఈ నాలుగు రోజులు మా పరిస్థితి ఏంటి.. బ్లాక్‌లో కొనాలంటే ఎంత ఖర్చు చేయాలో తెలుసా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మందుబాబులు. మరి ఇంతకు ఎందుకు వైన్స్‌ బంద్‌ చేస్తున్నారు.. కారణం ఏంటి అంటే..

మద్యం అ‍మ్మకాలపై నిషేధం విధించింది మన దగ్గర కాదు బెంగళూరులో. ఫిబ్రవరి 14 నుంచి అనగా బుధవారం నుంచే ఇది అమల్లోకి రానుంది. మరి ఎందుకు వైన్స్‌ బంద్‌ అంటే.. కర్ణాటక శాసనమండలిలో ఖాళీగా ఉన్న ఒక స్థానానికి శుక్రవారం ఉప​ ఎన్నిక నిర్వహించాలని .. భారత ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈకారణంగానే 4 రోజుల పాటు బెంగళూరులో మద్యం అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది.

గత ఏడాది మే 10న జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాజీ ఎమ్మెల్సీ పుట్టన్న శాసనమండలికి, బీజేపీకి రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఈ క్రమంలో తాజాగా ఈ స్థానికి శుక్రవారం నాడు అనగా.. ఫిబ్రవరి 16 ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. ఫిబ్రవరి 20, మంగళవారం నాడు ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎమ్మెల్సీ ఎలక్షన్‌ నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూసేందుకే ప్రభుత్వం బెంగళూరులో నాలుగు రోజుల పాటు మద్యం అమ్మకాలను నిషేధించింది.

అయితే నాలుగు రోజుల పాటు వరసగా మద్యం దుకాణాలు బంద్‌ చేయడం వల్ల భారీగా నష్టం వస్తుంది అంటున్నారు. నిషేధం విధిస్తున్న కారణంగా బెంగళూరులోని పబ్‌లు, బార్లు భారీ నష్టాలను చవి చూడాల్సి వస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఈ నిషేధం కారణంగా సుమారు రూ .500 కోట్లు నష్టపోవచ్చని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా, వాలంటైన్స్ డే సందర్భంగా మద్యం అమ్మకాలు జోరుగా సాగుతాయని వైన్స్‌ యాజమానులు ఆశిస్తున్న తరుణంలో.. ఈ నిషేధం నిర్ణయంతో వారు నిరుత్సాహానికి గురవుతున్నారు. దీంతో బెంగళూరు సిటీ డిస్ట్రిక్ట్ లిక్కర్ ట్రేడర్స్ అసోసియేషన్ (బీసీడీఎల్టీఏ) నగరంలో నాలుగురోజులు డ్రై డేగా విధించడంపై పునరాలోచించాలని ఈసీఐకి లేఖ రాసింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రానికి రూ.300 కోట్ల మేర నష్టం వాటిల్లుతుందని అసోసియేషన్ తెలిపింది.

Show comments