Nidhan
మహిళల కోసం ఒక అదిరిపోయే పాలసీని ఎల్ఐసీ తీసుకొచ్చింది. అసలు ఏంటా పాలసీ, దాని స్పెషాలిటీ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..
మహిళల కోసం ఒక అదిరిపోయే పాలసీని ఎల్ఐసీ తీసుకొచ్చింది. అసలు ఏంటా పాలసీ, దాని స్పెషాలిటీ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బీమా కంపెనీగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)ను చెప్పొచ్చు. ఈ సంస్థ ప్రజల కోసం ఎన్నో రకాల పాలసీలను తీసుకొస్తోంది. ముఖ్యంగా మహిళల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ప్లాన్స్‌ను ప్రవేశపెడుతోంది. కానీ వాటి గురించి ఎక్కువ మంది కస్టమర్లకు తెలియదు. ఎల్ఐసీలో డబ్బులు పెడితే భారీగా రాబడి వస్తుందని, ఇది ఎంతో ఉపయోగకరమని చాలా మందికి తెలియదు. అయితే ఎల్ఐసీ మాత్రం కొత్త పాలసీలను తీసుకొస్తూ.. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. తాజాగా స్త్రీల కోసం ఒక ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఆ ప్లాన్ పేరు ఎల్ఐసీ ఆధార్ శిలా ప్లాన్. దీని గురించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం..
పిల్లలు, వృద్ధుల కోసం ఎక్కువగా పాలసీలను తీసుకొచ్చే ఎల్ఐసీ.. తాజాగా మహిళల కోసం ప్రత్యేకంగా ఓ ప్లాన్‌ను రూపొందించింది. దీని పేరు ఎల్ఐసీ ఆధార్ శిలా. స్త్రీలు, బాలికల కోసం ఈ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఇది నాన్ లింక్డ్ పర్సనల్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇందులో గనుక పెట్టుబడి పెడితే దీర్ఘకాలంలో పాలసీదారులు మంచి లాభాలు పొందొచ్చు. ఈ ప్లాన్‌లో 8 సంవత్సరాల బాలికల నుంచి 55 సంవత్సరాల వరకు వయసు ఉన్న మహిళలు పెట్టుబడి పెట్టొచ్చు. ఇందులో 10 నుంచి 20 ఏళ్ల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. పాలసీ మెచ్యూరిటీ కోసం బీమా చేసిన వారి గరిష్ట వయసు 70 ఏళ్లలోపు ఉండాలి. ఒక మహిళ తనకు 55 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈ ప్లాన్‌లో పెట్టుబడి మొదలుపెడితే ఆమె 15 సంవత్సరాలు మాత్రమే ఇందులో డబ్బులు పెట్టొచ్చు.
ఎల్ఐసీ ఆధార్ శిలా ప్లాన్‌లో ప్రీమియం వార్షిక, అర్థ వార్షిక, త్రైమాసిక లేదా నెలవారీ ప్రాతిపదికన డబ్బులు చెల్లించొచ్చు. అధిక రాబడులు రావాలంటే ఈ పాలసీలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం బెటర్ అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇందులో ఒక మహిళ రోజుకు రూ.87 డిపాజిట్ చేస్తే ఫ్యూచర్లో ఆమెకు భారీ రాబడి వస్తుంది. రోజుకు రూ.87 చొప్పున నెలకు రూ.2,610, ఏడాదిలో మొత్తం రూ.31,320 కట్టాల్సి ఉంటుంది. అలా ఈ పాలసీలో 10 సంవత్సరాలు డబ్బుల్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. పది సంవత్సరాల్లో మీరు ఈ పాలసీలో రూ.3.13 లక్షలు డిపాజిట్ చేస్తారు. మీకు 75 సంవత్సరాల వయసులో ఈ పాలసీ మెచ్యూరిటీ మీద రూ.11 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని అందుకుంటారు. మరి.. ఎల్ఐసీ ఆధార్ శిలా ప్లాన్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.