iDreamPost
android-app
ios-app

వీడియో: వంతెనపై గాల్లో వేలాడుతున్న RTC బస్సు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న ప్రయాణికులు

  • Published May 21, 2024 | 10:24 PM Updated Updated May 21, 2024 | 10:25 PM

అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వంటి కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఎక్కువగా ప్రైవేటు వాహనాలు ప్రమాదాలకు గురవుతుంటాయి. దీనికి ఆర్టీసీ బస్సులేమీ మినహాయింపు కాదు. తాజాగా ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. వంతెన మీద వేలాడుతూ కనిపించింది.

అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వంటి కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఎక్కువగా ప్రైవేటు వాహనాలు ప్రమాదాలకు గురవుతుంటాయి. దీనికి ఆర్టీసీ బస్సులేమీ మినహాయింపు కాదు. తాజాగా ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. వంతెన మీద వేలాడుతూ కనిపించింది.

  • Published May 21, 2024 | 10:24 PMUpdated May 21, 2024 | 10:25 PM
వీడియో: వంతెనపై గాల్లో వేలాడుతున్న RTC బస్సు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న ప్రయాణికులు

ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు ఎక్కువైపోయాయి. అతివేగం, మద్యం తాగి నడపడం, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వంటి కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణించేటప్పుడు గుండెలు అరచేతిలో పెట్టుకునే పరిస్థితి వస్తుంది కొన్నిసార్లు. ఎందుకంటే కొంతమంది డ్రైవర్లు అతివేగంతో నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తుంటారు. అనేక సందర్భాల్లో ప్రైవేటు బస్సులు ప్రమాదాలకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆర్టీసీ ప్రయాణం సురక్షితం అని.. ఆర్టీసీలో ప్రయాణించండి అని అంటారు. అయితే ఆర్టీసీ బస్సులో ప్రయాణం కూడా కొన్నిసార్లు సురక్షితం కాదని అప్పుడప్పుడు జరిగే ప్రమాదాలు రుజువు చేస్తాయి. దాదాపు అందరూ ఇలా ఉండరు కానీ కొంతమంది డ్రైవర్లు నిర్లక్ష్యంగా ఉంటారు.

తాజాగా ఒక ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు వంతెన మీద గాల్లో వేలాడుతూ కనిపించింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ ఊపిరి బిగపట్టుకుని కూర్చున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. మే 18న కేఎస్ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. తుమకూరు రోడ్డులోని నేలమంగళ పట్టణ సమీపంలో మదనాయకనహళ్లి మీదుగా వంతెన మీద వెళ్తుండగా బస్సు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొంది. దీంతో బస్సు ముందు భాగం వంతెన బయటకు వచ్చింది. గాల్లో వేలాడుతున్న బస్సుని చూసి పెద్ద ఎత్తున జనం గుమిగూడారు.

ఈ ప్రమాదంలో డ్రైవర్, కండక్టర్ సహా ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. అయితే అదృష్టవశాత్తు బస్సు పడిపోలేదు. ఎలాంటి ప్రాణ హాని జరగలేదు. ప్రయాణికులు జాగ్రత్తగా వెంటనే బస్సు దిగేయడంతో ప్రమాదం తప్పింది. ఒక కారు సడన్ గా బస్సు వెళ్తున్న లేన్ లోకి రావడంతో డ్రైవర్ తన లేన్ ని మార్చాడని.. అందుకే అదుపుతప్పి డివైడర్ ని ఢీకొట్టిందని చెబుతున్నారు. అయితే పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్స్ స్పందిస్తున్నారు. డ్రైవింగ్ లో ఉండగా మొబైల్ ఫోన్ మాట్లాడడం వల్లే ఇలా జరిగి ఉంటుందని అంటున్నారు.