iDreamPost
android-app
ios-app

మోదీ సర్కార్ బంపర్ ఆఫర్.. ఉచితంగా రూ. 22వేలు పొందే ఛాన్స్!

  • Author Soma Sekhar Published - 12:26 PM, Tue - 18 July 23
  • Author Soma Sekhar Published - 12:26 PM, Tue - 18 July 23
మోదీ సర్కార్ బంపర్ ఆఫర్.. ఉచితంగా రూ. 22వేలు పొందే ఛాన్స్!

కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే ఆఫర్ ను తీసుకొచ్చింది. ఈ బంపర్ ఆఫర్ లో భాగంగా.. ఉచితంగానే రూ. 22 వేలు పొందే ఛాన్స్ ను మీకు కల్పిస్తోంది. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం గురించి తెలుసుకోవాల్సిందే. కేంద్ర ప్రభుత్వం రెండు కాంటెస్ట్ లను నిర్వహిస్తోంది. వీటిల్లో పాల్గొని విజేతగా నిలిస్తే.. మీరు ఏకంగా రూ. 22 వేల రూపాయలను సొంతం చేసుకోవచ్చు. అలాగని మీరు ఎంతో కష్టపడనవసరం లేదు. కాస్తంత మీ మెదడుకు పదునుపెడితే చాలు.. మీరు ఆ 22 వేలను గెలుచుకోవచ్చు. మరి ఈ కాంటెస్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మోదీ సర్కార్ ఓ అదిరే ఆఫర్ ను అందుబాటులో ఉంచింది. రెండు కాంటెస్ట్ లలో పాల్గొని విజేతలుగా నిలిచేవారికి రూ.22 వేల బహుమతితో పాటుగా సర్టిఫికెట్ లు కూడా అందించనుంది. ఈ కాంటెస్ట్ కు సంబంధించి మరిన్ని వివవరాల్లోకి వెళితే.. కేంద్ర ప్రభుత్వం కృషి కర్మయోగి అభియాన్ కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. దీనిని డిపార్ట్ మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స వెల్ఫేర్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి కింది స్థాయి వరకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో.. మోదీ సర్కార్ మైగౌవ్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ఈ భాగస్వామ్యంలో భాగంగా.. ఓ కాంటెస్ట్ ను నిర్వహిస్తోంది. అందులో భాగంగా.. కృషి కర్మయోగి అభియాన్ కు ఒక లోగోను డిజైన్ చేయాల్సి ఉంటుంది. వ్యవసాయానికి సంబంధించిన థీమ్ ఆధారంగా ఆ లోగో ఉండాలి. విజేతగా నిలిచిన వారికి రూ. 11 వేలతో పాటుగా ఈ-సర్టిఫికెట్ ఇస్తారు. మీరు ఈ కాంటెస్ట్ లో పాల్గొనాలి అనుకుంటే.. వెంటనే లోగో డిజైన్ చేసి సంబంధిత సైట్ లో సబ్మిట్ చెయెుచ్చు. దీనితో పాటుగా మరో కాంటెస్ట్ ను కూడా నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. లోగో డిజైనింగ్ లో పాలుగా ఈ స్కీమ్ కు సరికొత్త ట్యాగ్ లైన్ పెట్టాల్సి ఉంటుంది. అదిపోయే ట్యాగ్ లైన్ పెట్టి విజేతగా నిలిచిన వారికి రూ. 11 వేల రూపాయలతో పాలుగా ఇ-సర్టిఫికెట్ ఇస్తారు. మైగౌ వెబ్ సైట్ లోకి వెళ్లి మీరు ఈ కాంటెస్ట్ లో పాల్గొనవచ్చు. ఈ రెండు కాంటెస్ట్ కు కూడా ఆగస్ట్ 15 వరకే అందుబాటులో ఉంటాయి. అందువల్ల ఆలస్యం చేయకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు.

ఇదికూడా చదవండి: బ్యాంక్‌ అకౌంట్‌ తెరిచి 6 నెలలు అవుతోందా.. అయితే రూ. లక్ష పొందే అవకాశం!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİ