iDreamPost

బ్యాంక్‌ అకౌంట్‌ తెరిచి 6 నెలలు అవుతోందా.. అయితే రూ. లక్ష పొందే అవకాశం!

  • Published Jul 18, 2023 | 9:41 AMUpdated Jul 18, 2023 | 9:41 AM
  • Published Jul 18, 2023 | 9:41 AMUpdated Jul 18, 2023 | 9:41 AM
బ్యాంక్‌ అకౌంట్‌ తెరిచి 6 నెలలు అవుతోందా.. అయితే రూ. లక్ష పొందే అవకాశం!

దేశీయ దిగ్గజ బ్యాంక్‌ ఎస్‌బీఐలో మీకు అకౌంట్‌ ఉందా.. ఆ ఖాతా తెరిచి ఆరు నెలలు అవుతుందా.. మీరు లక్ష రూపాయలు పొందే అవకాశం ఉంది. అదేంటి బ్యాంక్‌లో అకౌంట్‌ ఉంటే.. లక్ష రూపాయలు ఎందుకిస్తారు అనుకుంటున్నారా.. అంటే అలా ఇచ్చేది లోన్‌ అన్నమాట. అంటే ఎస్‌బీఐలో మీరు బ్యాంక్‌ అకౌంట్‌ తెరిచి.. 6 నెలలు దాటితే.. మీరు లక్ష రూపాయలు లోన్‌గా పొందే అవకాశం ఉంది. ఎలాగో తెలియాలంటే ఇది చదవాలి. ఎస్‌బీఐ బ్యాంక్‌ తన కస్టమర్లకు అనేక రకాల లోన్‌లు అందిస్తోన్న సంగతి తెలిసిందే. పర్సనల్‌, ఎడ్యుకేషన్‌, కార్‌ ఇలాంటి లోన్లతో పాటు ముద్రా లోన్స్ కూడా మంజూరు చేస్తోంది ఎస్‌బీఐ. దీనిలో భాగంగా.. ఎస్‌బీఐలో మీరు అకౌంట్‌ ఒపెన్‌ చేసి 6 నెలలు దాటితే.. రూ.లక్ష వరకు ఇ-ముద్ర లోన్‌ పొందే అవకాశం ఉంది. మరి అది ఎలా పొందాలి.. ప్రాసెస్‌ ఏంటి వంటి వివరాలు..

ఎస్‌బీఐ బ్యాంక్‌ తన కస్టమర్లకు ఇ-ముద్రా స్కీమ్ కింద వేగంగా రుణాలు అందిస్తోంది. బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లకుండానే.. ఈ లోన్‌ అమౌంట్‌ పొందవచ్చు. మరి ఈ ఇముద్ర లోన్‌ పొందాలంటే ఏం చేయాలంటే.. మీరు కచ్చితంగా మైక్రో ఎంట్రప్రెన్యూర్ అయ్యి ఉండాలి. అలానే ఎస్‌బీఐ బ్యాంక్‌లో మీకు కరెంట్ అకౌంట్ లేదా సేవింగ్స్ అకౌంట్ ఉండాలి. అకౌంట్ తెరిచి కనీసం 6 నెలలు అయినా దాటి ఉండాలి. ఇక ఎస్‌బీఐ ఇ ముద్రా లోన్స్ కింద గరిష్టంగా రూ. లక్ష వరకు రుణం పొందొచ్చు. తీసుకున్న రుణాన్ని ఐదేళ్లలోగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఒక వేళ లోన్ ఎమౌంట్‌.. రూ.50 వేల లోపు అయితే బ్యాంక్‌కు వెళ్లే పని లేకుండా ఆన్‌లైన్‌లోనే మీరు ఈ మొత్తాన్ని పొందవచ్చు. అదే రూ. 50 వేలు దాటితే మాత్రం మీరు బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాల్సి ఉంటుంది.

మీరు కనక ఈ ఇముద్ర లోన్ కోసం అప్లై చేసుకోవాలని భావిస్తే.. మీకు ఎస్‌బీఐలో సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్ నంబర్, బిజినెస్ ప్రూఫ్, ఆధార్ నంబర్ , సామాజిక వర్గం వివరాలు (జనరల్/ ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ మైనారిటీ), జీఎస్‌టీఎన్, యూడీవైఓజీ ఆధార్ వివరాలు, షాప్ ప్రూఫ్, బిజినెస్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వంటివి అవసరం అవుతాయి. మీరు కనక 50 వేల రూపాయల వరకు లోన్‌ ఎమౌంట్‌ పొందాలని భావిస్తే.. బ్యాంక్‌కు వెళ్లకుండానే.. ఆన్‌లైన్‌లో ఇందుకోసం అప్లై చేసుకోవచ్చు. ఇందు కోసం మీరు ఎస్‌బీఐ ఇ-ముద్రా వెబ్‌సైట్‌లోకి వెళ్లి లోన్‌ కోసంఅప్లై చేసుకోవచ్చు. మీరు పంపిన వివరాలు అన్ని బాగుంటే.. మీకు లోన్‌ శాంక్షన్‌ అవుతుంది. ఎస్‌బీఐ ముద్రా లోన్ స్కీమ్ కింద గరిష్టంగా రూ. 10 లక్షల వరకు రుణాలు కూడా అందిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి