iDreamPost
android-app
ios-app

కోల్కతా డాక్టర్ కేసు.. నిందితుడికి లై డిటెక్టర్ టెస్టులకు అంగీకరించిన హైకోర్టు

  • Published Aug 19, 2024 | 8:49 PM Updated Updated Aug 19, 2024 | 8:49 PM

Kolkata Junior Doctor Case Update: కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ లో రాత్రి విధులు నిర్వహిస్తున్న జూనియర్ డాక్టర్ ని అత్యాచారం చేసి హత్యాచారం చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి కీలక అప్డేట్ ఒకటి బయటకొచ్చింది.

Kolkata Junior Doctor Case Update: కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ లో రాత్రి విధులు నిర్వహిస్తున్న జూనియర్ డాక్టర్ ని అత్యాచారం చేసి హత్యాచారం చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి కీలక అప్డేట్ ఒకటి బయటకొచ్చింది.

కోల్కతా డాక్టర్ కేసు.. నిందితుడికి లై డిటెక్టర్ టెస్టులకు అంగీకరించిన హైకోర్టు

కోల్కతాలో విధి డ్యూటీ చేస్తుండగా జూనియర్ డాక్టర్ ని హత్యాచారం చేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటన మరో నిర్భయ ఘటనను గుర్తు చేస్తుందని అంటున్నారు. ఈ ఘటనను సుప్రీంకోర్టు సుమోటాగా తీసుకుంది. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపడుతోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ ని కోల్కతా పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. అప్పటి నుంచి విచారణ కొనసాగుతుంది. విచారణ వేగవంతం చేసేందుకు ఈ కేసుని సీబీఐకి అప్పగించింది కోర్టు. ఈ క్రమంలో ఈ కేసులో నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ కి పాలీగ్రాఫ్ టెస్టులు చేయాలని సీబీఐ కోల్కతా హైకోర్టుని కోరింది.

నిందితుడికి లై డిటెక్టర్ పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని… అందుకు అనుమతి కావాలని సీబీఐ కోరగా అందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. నిందితుడికి లై డిటెక్టర్ టెస్టులు నిర్వహించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం కస్టడీలో ఉన్న నిందితుడికి శనివారం నాడు సీబీఐ సైకో అనాలిసిస్ టెస్టు నిర్వహించింది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లోని చెస్ట్ డిపార్ట్మెంట్ సెమినార్ హాల్ లో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ మృతదేహాన్ని కనుగొన్నారు. ఆ మరుసటి రోజు నాడు కోల్కతా పోలీసులు సంజయ్ రాయ్ ని అరెస్ట్ చేశారు. 2019లో కోల్కతా పోలీసులతో కలిసి సివిక్ వాలంటీరుగా పనిచేశాడు.

అయితే అతను నాలుగు సార్లు పెళ్లి చేసుకున్నాడని.. తనను తాను విమెనైజర్ గా చెప్పుకున్నాడని సంజయ్ రాయ్ గురించి అధికారులు చెబుతున్నారు. నిందితుడు సంజయ్ రాయ్ ఒక బాక్సర్ అని.. కొన్నేళ్ల పాటు సీనియర్ పోలీస్ అధికారులతో తిరిగి సన్నిహిత సంబంధం పెంచుకున్నాడని ఓ జాతీయ మీడియా తెలిపింది. కోల్కతా పోలీస్ వెల్ఫేర్ బోర్డుకి ట్రాన్స్ఫర్ అయిన సంజయ్ రాయ్.. ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వద్ద పోలీస్ అవుట్ పోస్ట్ గా నియమించబడ్డాడు. ఆగస్టు 9న డ్యూటీలో ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ ని అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు. కాగా నిందితుడు తానే చేశానని అంగీకరించినట్లు తెలుస్తుంది. అయితే నిందితుడికి లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని సీబీఐ కోరడంతో కోర్టు అందుకు అంగీకరించింది. రేపు నిందితుడికి లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించనుంది సీబీఐ.