iDreamPost
android-app
ios-app

Kolkata: కోలకతా డాక్టర్‌ కేసు.. నవంబరులో పెళ్లి.. ఒక్క రాత్రిలోనే కలలన్ని ఛిద్రం!

  • Published Aug 22, 2024 | 3:22 PM Updated Updated Aug 22, 2024 | 3:22 PM

Kolkata Doctor Case-Married In November 2024: కోల్‌కతా డాక్టర్‌పై హత్యాచార ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తుండగా.. ఆమె తల్లిదండ్రులు బిడ్డ గురించి చెప్పి వ్యాఖ్యలు ప్రతి ఒక్కరిని కంట తడి పెట్టిస్తున్నాయి. ఆ వివరాలు..

Kolkata Doctor Case-Married In November 2024: కోల్‌కతా డాక్టర్‌పై హత్యాచార ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తుండగా.. ఆమె తల్లిదండ్రులు బిడ్డ గురించి చెప్పి వ్యాఖ్యలు ప్రతి ఒక్కరిని కంట తడి పెట్టిస్తున్నాయి. ఆ వివరాలు..

  • Published Aug 22, 2024 | 3:22 PMUpdated Aug 22, 2024 | 3:22 PM
Kolkata: కోలకతా డాక్టర్‌ కేసు.. నవంబరులో పెళ్లి.. ఒక్క రాత్రిలోనే కలలన్ని ఛిద్రం!

కోల్‌కతా మెడికల్ కాలేజీలో డాక్టర్‌పై చోటు చేసుకున్న దారుణ హత్యాచార ఉదంతం దేశాన్ని కుదిపేస్తుంది. ఇంత ఘోరానికి పాల్పడిన దుర్మార్గుడిని.. కఠినంగా శిక్షించాలని దేశమంతా రోడ్డెక్కింది. రోజులు గడుస్తున్న కొద్ది ఈ దారుణానికి సంబంధించి సంచలన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా కేసు విచారణకు సంబంధించిన రిపోర్టును సుప్రీంకోర్టుకు సమర్పించింది. సీబీఐ దీనిలో సంచలన వాస్తవాలను వెల్లడించింది. ఇక ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న సుప్రీం కోర్టు.. మంగళవారం నాడు విచారణ చేపట్టింది. కోల్‌కతా ప్రభుత్వం, పోలీసు అధికారుల తీరుపై విరుచుకుపడింది.

ఇక కేసు దర్యాప్తు కోసం రంగంలోకి దిగిన సీబీఐ.. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న ప్రతి ఒక్కరిని విచారిస్తోంది. అంతేకాక ప్రధాన నిందితుడైన సంజయ్‌.. కాలేజీ మాజీ ప్రిన్సిపాల్‌ సందీప్‌కు పాలీగ్రాఫ్‌ టెస్టులు నిర్వహించేందుకు రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే దారుణ అత్యాచారినికి గురై మరణించిన ట్రైనీ డాక్టర్‌కు సంబంధించిన ప్రతి విషయం ఇప్పుడు  సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలోనే త్వరలో ఆమె పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది అన్న విషయం తెలిసి జనాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా మృతి చెందిన వైద్యురాలి తల్లిదండ్రలు మాట్లాడుతూ.. తమ కుమార్తె పీజీలో గోల్డ్‌మెడల్ సాధించాలనే లక్ష్యంతో.. రాత్రిపగలు తేడా లేకుండా కష్టపడేదని.. చదువు.. చదువు.. చదువు తప్ప మరో ధ్యాస ఉండేది కాదని గుర్తు చేసుకున్నారు.  అంతేకాక మృతి చెందిన వైద్యురాలి పెళ్లి నిశ్చయం అయ్యిందని.. నవంబర్‌లో వివాహం జరిపించాలని భావించినట్లు మృతురాలి తల్లిదండ్రులు వెల్లడించారు. తమ కుమార్తెది ప్రేమ వివాహం అని.. ఎంబీబీస్ కోచింగ్‌ సెంటర్‌లో అనగా సుమారు 12ఏళ్ల కింద మృతి చెందిన ట్రైనీ డాక్టర్‌కు.. ఆమె ప్రేమించిన వ్యక్తి పరిచయం అయ్యాడని.. అది కాస్త స్నేహం, ప్రేమగా మారిందని వారు గుర్తు చేసుకున్నారు.

Kolkatha Doctor

అంతేకాక ఇద్దరు తమ ప్రేమ విషయం ఇంట్లో చెప్పి.. తల్లిదండ్రులను ఒప్పించారు.. ఈ నవంబర్‌లో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వివాహం తర్వాత జీవితం గురించి, భవిష్యత్తు గురించి ఎన్నో అందమైన కలలు కన్నారు. కానీ ఒక్క కాళరాత్రి వారి కలలను నాశనం చేసింది.. తమ బిడ్డను శాశ్వత నిద్రలోకి జారుకునేలా చేసిందంటూ మృతిరాలలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హత్యాచారం జరిగిన ముందు రోజు.. అంటే ఆగస్ట్‌ 8న రాత్రి పదకొండున్నర వరకు.. వైద్యురాలు, ఆమెకు కాబోయే భర్త ఇద్దరు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఇక అదే రాత్రి ఆ ఇద్దరి జీవితాలను మార్చేసింది. వారి అందమైన ప్రేమకథను ఛిద్రం చేసింది. ఆగస్ట్‌ 9న డాక్టర్‌కు ఆ అబ్బాయి ఫోన్ చేస్తే.. రెస్పాన్స్ లేదు. పనిలో బిజీగా ఉందేమో అని భావించి.. డిస్టర్బ్ చేయొద్దని సైలెంట్ అయిపోయాడు. ఆ తర్వాతే ఈ ఘోరం గురించి అతనికి తెలిసింది. వెంటనే బాధితురాలి తల్లిదండ్రులతో కలిసి ఆసుపత్రికి పరుగులు పెట్టాడు.

ఐతే డాక్టర్ డెడ్‌బాడీ దగ్గరికి వెళ్లేందుకు, చూసేందుకు.. పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో సంఘటనా స్థలానికి కొద్దిదూరంలో కుప్పకూలిపోయి కన్నీళ్లు పెట్టుకున్నాడు. 13ఏళ్లుగా తనతో పాటు నడిచి.. తన చేయి పట్టుకొని నడిచిన స్నేహితురాలు ఇక లేదని తెలిసి.. ఆ యువకుడు పడుతున్న వేదన అంతా ఇంతా కాదు. ఇంతలా ప్రేమించుకొని.. త్వరలో పెళ్లి చేసుకుందామనుకున్న ట్రైనీ డాక్టర్‌ది సూసైడ్ అని మొదట్లో చెప్పడం దారుణం అంటూ.. ఇద్దరి ప్రేమ కథ గురించి సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ కోరాలో ప్రిషు అనే యువకుడు పోస్ట్ చేశాడు. ఇది చదివిన ప్రతి ఒక్కరు మీ జీవితాలను నాశనం చేసిన ఎవరిని వదలకూడదు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.