iDreamPost
android-app
ios-app

Kolkata: లేడీ సింగం చేతికి కోల్‌కతా వైద్యురాలి కేసు! ఎవరీ సీమా పహుజా?

  • Published Aug 20, 2024 | 12:54 PM Updated Updated Aug 20, 2024 | 12:54 PM

Kolkata Doctor Case-Seema Pahuja: కోల్‌కతా హత్యాచారం కేసు విచారణ నిమిత్తం లేడీ సింగ్ గా పేరు తెచ్చుకున్న అధికారిణి సీమా పహుజాకు అప్పగించారు. ఆ వివరాలు..

Kolkata Doctor Case-Seema Pahuja: కోల్‌కతా హత్యాచారం కేసు విచారణ నిమిత్తం లేడీ సింగ్ గా పేరు తెచ్చుకున్న అధికారిణి సీమా పహుజాకు అప్పగించారు. ఆ వివరాలు..

  • Published Aug 20, 2024 | 12:54 PMUpdated Aug 20, 2024 | 12:54 PM
Kolkata: లేడీ సింగం చేతికి కోల్‌కతా వైద్యురాలి కేసు! ఎవరీ సీమా పహుజా?

కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో ట్రైనీ వైద్యురాలిపై అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విధుల్లో ఉన్న వైద్యురాలిపై అత్యంత పాశవీకంగా హత్యాచారం చేసి దారుణంగా హతమార్చారు. ఈ సంఘటనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీరు మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనను సుమోటాగా స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం.. మంగళవారం విచారణ చేపట్టనుంది.

సీబీఐ విచారణలో భాగంగా కేసును లేడీ సింగంగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అధికారిణి సీమా పహుజాకు అప్పగించారు. ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం అవుతోంది. ఇలాంటి కేసులను చేధించడంలో ఆమెకు ఎంతో పేరుంది. గతంలో హత్రాస్ వంటి ఈ తరహా కేసులను ఆమె విచారించింది. ఇప్పుడు ఈ కేసును కూడా ఆమెకు అప్పగించడంతో.. ఇక నేరస్తులకు చుక్కలే అంటున్నారు.

ఇంతకు ఎవరీ సీమా పహుజా..

ఈ కేసును సీబీఐకి అప్పగించడంతో.. దేశం మొత్తం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కేసులో సీబీఐ ఎలాంటి విషయాలు బయటకు తీస్తుందో ఏంటో అని ఆసక్తి కబనరుస్తున్నారు. కేసు విచారణ కోసం నియమించిన 30 మంది సభ్యుల బృందంలో సీబీఐ అధికారులు, సీఎఫ్ఎస్ఎల్ నిపుణులు ఉన్నారు. ఈ టీమ్‌కు జార్ఖండ్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సంపత్ నెహ్రా నాయకత్వం వహిస్తున్నారు. అయితే వీరిలో ఎక్కువగా సీమా పహుజా. సీబీఐ ఏఎస్పీ సీమా పహుజా ఈ కేసులో ఉందనడంతో దీనిపై మరింత ఆసక్తి పెరిగింది.

1993లో ఢిల్లీ పోలీస్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా రిక్రూట్ అయ్యారు సీమా పహుజా. ఢిల్లీ పోలీసు ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్నాక.. సీబీఐలోని అవినీతి నిరోధఖ శాక స్పెషల్ క్రైమ్ యూనిట్‌లో చాలా కాలం పని చేశారు. ఐదేళ్లకు ఇన్‌స్పెక్టర్‌గా ప్రమోషన్ సాధించారు. ఆ సమయంలో ఆమె కీలకమైన కేసులను ఎన్నింటినో ఛేదించారు. 2013లో డీఎస్పీగా పదోన్నతి ఇచ్చారు.

డైనమిక్ ఆఫీసర్

డీఎస్పీ అయిన తరువాత మానవ అక్రమ రవాణా, మతమార్పిడి, హత్యలు, బాలికలపై నేరాలకు సంబంధించిన అనే కేసులపై సీమా పహుజా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేశారు. నిందితులకు శిక్షపడే విధంగా సాక్ష్యాలు సంపాదించారు. సిమ్లాలోని కోథాయ్‌లోని గుడియాపై అత్యాచారం హత్య కేసును ఛేదించినందుకు సీమా పహుజా వార్తల్లోకి ఎక్కారు. ఈ కేసు దర్యాప్తును అత్యుత్తమ దర్యాప్తుగా పరిగణిస్తారు. ఇదే కాక దేశం మెుత్తం ఉలిక్కిపడేలా చేసిన హత్రాస్ గ్యాంగ్ రేప్ కేసును కూడా సీమా డీల్ చేశారు. ఇలా ఆమె చేపట్టిన ప్రతి కేసును విజయవంతంగా పూర్తి చేశారు

Seema pahuja CBI officer taken the kolkata doctor case

ఎన్నో అవార్డులు

విధి నిర్వహణలో ఆమె కనబరిచి ప్రతిభాపాటవాలను మెచ్చుకుంటూ.. అనేక అవార్డులు, రివార్డులు గెలుచుకుంది.  సీమా పహుజా 2007లో మొదటి గోల్డ్ మెడల్ బెస్ట్ ఇన్వెస్టిగేషన్ అవార్డును అందుకుంది. 2014లో ఆగస్ట్ 15న ఇండియన్ పోలీస్ మెడల్ లభించింది. 2018 కేంద్ర హోం మంత్రి ఎక్సలెన్స్ ఇన్వెస్టిగేషన్ అవార్డుకు ఎంపికయ్యింది. ఇలా ఆమె సర్వీస్‌లో చాలా అవార్డులు అందుకుంది.

ప్రస్తుతం కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం కేసును సీమా పహుజా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆమె ట్రాక్ రికార్డులో క్లిష్టమైన కేసులను ఛేదించిన అధికారిగా గుర్తింపు ఉంది. కనుక ఈ కేసును కూడా కచ్చితంగా సాల్వ్ చేస్తారని ప్రతి ఒక్కరు నమ్మకంగా ఉన్నారు. మరి ఈ కేసులో ఎలాంటి విషయాలు భయటకు వస్తాయో చూడాలి అంటున్నారు.