iDreamPost
android-app
ios-app

ఖలిస్థానీ ఉగ్రవాదుల హెచ్చరికలు.. వరల్డ్‌ కప్‌ ఆతిథ్య స్టేడియంను పేల్చేస్తామంటూ

  • Published Sep 28, 2023 | 7:39 PM Updated Updated Sep 28, 2023 | 7:39 PM
  • Published Sep 28, 2023 | 7:39 PMUpdated Sep 28, 2023 | 7:39 PM
ఖలిస్థానీ ఉగ్రవాదుల హెచ్చరికలు.. వరల్డ్‌ కప్‌ ఆతిథ్య స్టేడియంను పేల్చేస్తామంటూ

కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాదీ హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య.. ఆ తర్వాత దానిపై కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో.. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. నిజ్జర్‌ హత్య నేపథ్యంలో.. ఖలీస్థానీ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. భారత్‌ను లక్ష్యంగా చేసుకుని.. బెదిరింపులకు దిగుతున్నారు. ఈ క్రమంలో త్వరలోనో భారత్‌ వేదికగా జరగనున్న క్రికెట్‌ వరల్డ్‌ కప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న స్టేడియాన్ని పేల్చేస్తాం.. దాడులకు పాల్పడతామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ క్రమంలోనే సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థ అధినేత గుర్‌పత్వంత్ సింగ్ పన్నున్ మాట్లాడినట్లు ఉన్న ఒక ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఖలిస్థాన్ వేర్పాటువాదులు భారత్‌కు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీనిలో భాగంగా క్రికెట్ వరల్డ్ కప్‌‌లో భాగంగా అక్టోబర్ 5 వ తేదీన గుజరాత్, అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయిన నరేంద్ర మోదీ మైదానంలో జరిగే మ్యాచ్ లక్ష్యంగా దాడులకు దిగనున్నట్లు బెదిరింపులకు పాల్పడుతున్నారు.

ఈ మేరకు సిఖ్స్ ఫర్ జస్టిస్ అధినేత గుర్‌పత్వంత్ సింగ్ పన్నున్‌కు చెందిన ఓ ఆడియో.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. దీనిలో గుర్‌పత్వంత్‌ సింగ్‌ ఏకంగా భారత్‌, ప్రధాని నరేంద్ర మోదీకి హెచ్చరికలు జారీ చేశాడు. నిజ్జర్ హత్య, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోను అవమానించినందుకు తగిన ఫలితం చూడబోతున్నారంటూ వార్నింగ్‌ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ బెదిరింపు కాల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

నిజ్జర్‌ హత్య నేపథ్యంలో.. సిఖ్స్ ఫర్ జస్టిస్ గ్రూప్ తరఫున భారత్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ ఆడియోలో గుర్‌పత్వంత్ సింగ్ పన్నూన్ హెచ్చరించాడు. అక్టోబర్ 5న జరగనున్న వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చే నరేంద్ర మోదీ స్టేడియంపై దాడికి ప్రణాళిక రచించినట్లు ఆ ఆడియోలో పేర్కొన్నాడు. నిజ్జర్ హత్య కోసం ఉపయోగించిన బుల్లెట్‌కు వ్యతిరేకంగా.. తాము బ్యాలెట్‌ను ప్రయోగించబోతున్నామని.. భారత్ హింసకు వ్యతిరేకంగా తాము ఓటును ఉపయోగించబోతున్నామని ఆడియోలో చెప్పడం గమనార్హం. ప్రస్తుతం ఈ ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.