iDreamPost
android-app
ios-app

అప్పుడు రూ. 5 కోట్ల విన్నర్.. ఇప్పుడు పాలమ్ముకుంటున్నాడు! అసలేమైందంటే?

  • Author Soma Sekhar Published - 03:01 PM, Sat - 12 August 23
  • Author Soma Sekhar Published - 03:01 PM, Sat - 12 August 23
అప్పుడు రూ. 5 కోట్ల విన్నర్.. ఇప్పుడు పాలమ్ముకుంటున్నాడు! అసలేమైందంటే?

డబ్బు సంపాదించడం ఓ కళ. మరి ఆ సంపాదించిన డబ్బును ఎలా దాచుకోవాలో, వాడుకోవాలో తెసినవాడే అసలైన జ్ఞాని. ఇక చాలా మందికి ఉన్నఫలంగా డబ్బు వస్తూ ఉంటుంది. లక్కీగా లాటరీలోనో లేదా ఏదో ఒక గేమ్ షో ద్వారానో అదృష్టవంతులకు కోట్లలో డబ్బు వస్తుంది. దీంతో వారు రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారిపోతుంటారు. అలానే కోటీశ్వరుడిగా మారాడు సుశీల్ కుమార్. కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్ 5 విన్నర్ అతడు. ఎంతో కష్టపడి కేసీబీ విన్నర్ గా నిలిచిన అతడు రూ. 5 కోట్లు గెలుపొందాడు. కానీ ఊహించని విధంగా అతడిప్పుడు పాలమ్ముకుంటున్నాడు. 5 కోట్ల విన్నర్ ఇప్పుడు పాలమ్ముకోవడానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.

సుశీల్ కుమార్.. 2011 వరకు అతడు అందరిలానే సాధారణ వ్యక్తి. కానీ కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్ 5 విన్నింగ్ తర్వాత అతడో సెలబ్రిటీలా మారిపోయాడు. 2011లో కేసీబి విన్నర్ గా నిలిచిన సుశీల్ కుమార్ కు రూ. 5 కోట్లు వచ్చాయి. ఈ 5 కోట్లతో పాటుగా అతడికి ఫ్రెండ్స్, చుట్టాలు కూడా పెరిగిపోయారు. అప్పటి వరకు నార్మల్ వ్యక్తిగా ఉన్న సుశీల్ కుమార్ ఒక్కసారిగా సెలబ్రిటీ లైఫ్ స్టైల్ కు అలవాటు పడ్డాడు. ఇష్టం వచ్చినట్లుగా విరాళాలు ఇచ్చుకుంటూ వెళ్లాడు. వీటితో పాటుగా అడినవారికి లేదు అనుకుంటూ డబ్బులు ఇస్తూ వెళ్లాడు. ఉన్నపళంగా భారీ స్థాయిలో డబ్బులు రావడంతో.. ముందు వెనక చూడకుండా విచ్చలవిడిగా డబ్బు ఖర్చుపెట్టాడు.

వీటితో పాటుగా ఫ్రెండ్స్ తో పబ్బులు, పార్టీలు అంటూ విపరీతంగా మనీ ఖర్చుపెట్టేవాడు సుశీల్ కుమార్. తాగుడుకు బానిస అవ్వడంతో అతడి భార్య కూడా అతడిని వదిలేసింది. కేవలం నాలుగే సంవత్సరాల్లో తన దగ్గర ఉన్న డబ్బు మెుత్తం మంచినీళ్లలా ఖర్చుపెట్టేశాడు సుశీల్ కుమార్. ఇక డబ్బులేని సుశీల్ కుమార్ దగ్గరకు ఫ్రెండ్స్, బంధులు రావడమే కాదు.. కనీసం తడివైపు చూడ్డం కూడా మానేశారు. దీంతో ఒంటరివాడైన సుశీల్ కుమార్ ప్రస్తుతం రెండు గేదెలతో బ్రతుకు జీవుడా అంటూ జీవిస్తున్నాడు. ఆ గేదె పాలు అమ్ముకుంటూ జీవిస్తున్నాడు. ఇక ఈ విషయం తెలిసిన నెటిజన్లు సుశీల్ కుమార్ ను విపరీతంగా తిట్టిపోస్తున్నారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెత ఎప్పుడూ వినలేదా అంటూ విమర్శిస్తున్నారు. తన జీవితాన్ని తన చేతులతోనే నాశనం చేసుకున్నాడంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. సుశీల్ కుమార్ జీవితంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: కేంద్రం సంచలన నిర్ణయం.. ఫేక్‌ న్యూస్‌ ప్రచారం చేస్తే జైలుకే

Jojobet GirişJojobetJojobetJojobetHoliganbetJojobetHoliganbetjojobetgrandpashabetkralbetcasibomiptvjojobetcasibomcasibomGrandpashabetgrandpashabettaraftarium24 girişEscortes BelgiqueCasibomCasibomgrandpashabetJOJOBET GİRİŞLERİCasibom