iDreamPost
android-app
ios-app

ప్రైవేటు రంగ సంస్థల్లో రిజర్వేషన్ బిల్లుపై వెనక్కి తగ్గిన కర్ణాటక ప్రభుత్వం!

  • Published Jul 18, 2024 | 8:05 PMUpdated Jul 18, 2024 | 8:05 PM

కర్ణాటక రాష్ట్రంలోని ప్రైవేట్ సంస్థలు కన్నడిగులకు ఉద్యోగాలను రిజర్వ్ చేయాలని ఆదేశించి శాసన సభలో నేడు ప్రవేశపెట్టనుండగా.. ఊహించని చుక్క ఎదురైంది. అనుకోని విధంగా శాసన సభలో ప్రవేశపెట్టాలసిన బిల్లు ఆగిపోయింది. కారణం ఇదే..

కర్ణాటక రాష్ట్రంలోని ప్రైవేట్ సంస్థలు కన్నడిగులకు ఉద్యోగాలను రిజర్వ్ చేయాలని ఆదేశించి శాసన సభలో నేడు ప్రవేశపెట్టనుండగా.. ఊహించని చుక్క ఎదురైంది. అనుకోని విధంగా శాసన సభలో ప్రవేశపెట్టాలసిన బిల్లు ఆగిపోయింది. కారణం ఇదే..

  • Published Jul 18, 2024 | 8:05 PMUpdated Jul 18, 2024 | 8:05 PM
ప్రైవేటు రంగ సంస్థల్లో రిజర్వేషన్ బిల్లుపై వెనక్కి తగ్గిన కర్ణాటక ప్రభుత్వం!

ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు ప్రధాన్యత ఇచ్చే విధంగా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కన్నడికులు ఈ మధ్య కన్నడ ప్రభుత్వంకు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రైవేట్ ఉద్యోగాల్లో 75 శాతం రిజర్వేషన్లసు కల్పించేలా చేసిన రూపొందించిన బిల్లుకు ఇటీవలే మంత్రి వర్గం కూడా ఆమోదం తెలిపింది. దీంతో మేనేజ్ మెంట్ ఉద్యోగాల్లో 50 శాతం, నాన్ మేనేజ్ మెంట్ కేటగిరిలో 75 శాతం రిజర్వేషన్లు లభిస్తాయని పేర్కొన్నారు.

ఇక ఈ విషయాన్ని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అంతేకాకుండా.. రాష్ట్ర ప్రజలు సౌకర్యవంతమైన జీవితాన్ని గడపాలని, తమది కన్నడ అనుకూల ప్రభుత్వమని, కన్నడిగుల సంక్షేమమే మా ప్రాధాన్యత అని పేర్కొన్నారు. అదే విధంగా రాష్ట్ర వాసులకు సరైన ప్రాధాన్యత ఇవ్వని కంపెనీలకు జరిమానాలు కూడా విధించనుందని ఆ బిల్లులో ఆమెదించారు. ఇక ఈ బిల్లును గురువారం శాసన సభలో ప్రవేశపెట్టనుండగా.. ఊహించని చుక్క ఎదురైంది. అనుకోని విధంగా శాసన సభలో ప్రవేశపెట్టాలసిన బిల్లు ఆగిపోయింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

కర్ణాటక రాష్ట్రంలోని ప్రైవేట్ సంస్థలు కన్నడిగులకు ఉద్యోగాలను రిజర్వ్ చేయాలని ఆదేశించి శాసన సభలో నేడు అనగా( గురువారం)ప్రవేశపెట్టానున్న బిల్లు విషయంలో తాజాగా ప్రభుత్వం వెనక్కి తగ్గింది.  అంతేకాకుండా.. ఈ బిల్లు పై కర్ణాటక ప్రభుత్వం తదుపరి అధ్యయనం చేయనుంది. ఎందుకంటే.. సోమవారం ఈ ఉద్యోగాల రిజర్వేషన్ల పై ఉద్దేశించి ఆమోదం పొందిన బిల్ ఇంకా తయారీ దశలో ఉందట. దీంతో తదుపరి కేబినెట్ సమావేశంలో సమగ్రంగా చర్చించి ఈ రిజ్వరేషన్లపై తుది నిర్ణయ తీసుకుంటామని ముఖ్యంమంత్రి సిద్ధరామయ్య తాజాగా తన ఎక్స్ పోస్టులో చేశారు.

ఇకపోతే బయోకాన్‌కి చెందిన కిరణ్ మజుందార్-షా వంటి వ్యాపార నాయకులు అలాగే బిజెపి నేతృత్వంలోని ప్రతిపక్షాలు అందరూ.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా టార్గెట్ చేయడంతోనే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఈ నిర్ణయాన్ని వెనుక్క తీసుకున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఏదీ ఏమైనా కన్నడలకు ఉద్యోగాల రిజర్వేషన్ బిల్లు అనేది ఆగిపోవడం తెలుగు రాష్ట్ర ప్రజలకు ఒక రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. మరి, కన్నడ ఉద్యోగులకు ప్రధాన్యత ఇచ్చే రిజర్వేషన్ల  బిల్స్ ఆగిపోవడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి