iDreamPost
android-app
ios-app

హోటల్ లో సర్వర్ స్థాయి నుంచి కోట్ల ఆదాయం! ఆ చిన్న ప్రయోగంతో సక్సెస్..!

చిన్నతనంలో తండ్రి వదిలేసినా.. హోటల్ లో ప్లేట్ కడుగుతు జీవనం సాగించాడు ఓ వ్యక్తి. అయితే ఇదే నా నా జీవితం.. ఇంకేదో సాధించాలనే క్రమంలో అతడికి వచ్చిన చిన్న ఆలోచన..నేడు కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది.

చిన్నతనంలో తండ్రి వదిలేసినా.. హోటల్ లో ప్లేట్ కడుగుతు జీవనం సాగించాడు ఓ వ్యక్తి. అయితే ఇదే నా నా జీవితం.. ఇంకేదో సాధించాలనే క్రమంలో అతడికి వచ్చిన చిన్న ఆలోచన..నేడు కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది.

హోటల్ లో సర్వర్ స్థాయి నుంచి కోట్ల ఆదాయం! ఆ చిన్న ప్రయోగంతో సక్సెస్..!

ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నత స్థితిలో చేరుకోవాలని కోరుకుంటారు. మంచిగా సొంత ఇళ్లు, పెద్ద పెద్ద కార్లలో తిరగాలని కోరుకుంటారు. ఈ క్రమంలో కొందరు సక్సెస్ అవుతుంటారు. మరికొందరు ఫెయిల్యూర్ అవుతారు. ఇంకొందరు మాత్రం సక్సెస్ సాధించే వరకు పోరాడుతుంటారు. ఇదే సమయంలో కొందరికి.. వారిలో పుట్టే చిన్న ఆలోచనలే పెద్ద విజయాన్ని తెచ్చి పెడతాయి. అలానే ఓ వ్యక్తి విషయంలో జరిగింది. చిన్నతనంలో తండ్రి వదిలేసినా.. హోటల్ లో ప్లేట్ కడుగుతు జీవనం సాగించాడు ఆ వ్యక్తి. అయితే ఇదే నా నా జీవితం.. ఇంకేదో సాధించాలనే క్రమంలో అతడికి వచ్చిన చిన్న ఆలోచన..నేడు కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. ఇంతకీ ఆ వ్యక్తి  ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

కర్ణాటకలోని కుందాపూర్‌ చెందిన కేఆర్ భాస్కర్ సక్సెస్ స్టోరీ ఎంతో మంది యువతకు ఆదర్శం. ఆయన బాల్యం గురించి తెలిస్తే.. నిరాశలో ఉన్నవారికి కూడా ధైర్యం ఇస్తుంది. భాస్కర్ తండ్రి చిన్నప్పుడే కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో తన తల్లి లచ్చమ్మ షెట్టి తీసుకుని భాస్కర్ బెంగుళూరు వెళ్లాడు. అప్పటికే ఐదు తరగతి చదివిన భాస్కర్ ..చదువుకు పుల్ స్టాప్ పెట్టాడు. ఓ హోటల్ లో క్లీనర్ గా చేరి…వచ్చిన సంపాదన తో కుటుంబాన్ని పోషించేవాడు. హోటల్ లోబల్లు తుడుస్తూ. ప్లేట్ లు తోముతూ తనకొచ్చిన జీతాన్ని తెచ్చి తల్లికి ఇచ్చేవాడు.

కొన్నేళ్ల తరువాత ఇంకా ఏదైనా చేస్తే..ఇంకాస్త ఎక్కువ సంపాదించొచ్చనే ఆలోచనతో చిన్న పాన్‌షాప్‌ను పెట్టాడు. సరిగ్గా ఆదాయం రాకపోవడంతో మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది. చివరకు మిగిలిన డబ్బుతో పానీపూరీ, చాట్‌ బండి పెట్టుకున్నాడు. అందులో ఆదాయం రాకపోగా.. ఆ బండిని ఎవరో దొంగిలించారు. ఈ క్రమంలోనే ఏదైనా కొత్తగా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ ఆలోచనే భాస్కర్ జీవితాన్ని మలుపు తిప్పింది. బొబ్బట్లూ, సంప్రదాయ చిరుతిళ్లనూ అమ్ముతూ ఏడాదికి దాదాపు పద్దెనిమిది కోట్ల రూపాయల లాభాలను అందుకుంటూ ఎందరికో స్ఫూర్తినిస్తున్నా భాస్కర్. బొబ్బట్టును ‘భాస్కర్స్‌ మనె హోళిగె’ పేరుతో దాదాపు 25 రకాల రుచుల్లో అందిస్తూ సంవత్సరానికి  18 కోట్ల టర్నోవర్ సాధిస్తున్నారు. తమ దగ్గర బొబ్బట్లకు ఉన్న ఆదరణను గుర్తించిన భాస్కర్‌ ఇంట్లోనే వీటిని తయారుచేసి ప్యాకెట్లలో పెట్టి బెంగళూరుతో పాటు  చుట్టుపక్కల ప్రాంతాల్లోని షాపులకు సప్లయ్ చేయడం ప్రారంభించాడు.

ఈ క్రమంలోనే ఓ సారి ఓ ఛానల్‌లో వంటలపోటీ జరుగుతుంటే సరదాగా పాల్గొన్నాడు. అక్కడ బొబ్బట్లను నాలుగైదు రుచుల్లో తయారుచేసి చూపించడంతో భాస్కర్‌ గురించి అందరికీ తెలిసింది. ఆ కార్యక్రమం చూసిన అతడి స్నేహితుడు ఓ సలహా ఇచ్చాడు. రుచి, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూబొబ్బట్లకూ ఓ బ్రాండ్‌ సృష్టించమంటూ సలహా ఇవ్వడంతో ధైర్యం చేసి ‘భాస్కర్స్‌ మనె హోళిగె’ పేరుతో చిన్న స్టోర్‌ను తెరిచాడు. అలా నాణ్యత, నమ్మకాన్నే పెట్టుబడి పెట్టుకుని అందరి మన్ననులు పొంది నేడు కోట్ల రూపాయల ఆదాయాన్ని అర్జిస్తున్నారు భాస్కర్. ఈయన జీవితం ఎంతో మంది యువతకు ఆదర్శం. మరి..కేఆర్ భాస్కర్ సక్సెస్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.