iDreamPost
android-app
ios-app

ఆ వాహనాలపై ఉక్కుపాదం మోపిన రాష్ట్ర ప్రభుత్వం!

High Beam LED Headlight Vehicles: ఇటీవల కాలంలో వివిధ రకాల వాహనాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు , నిషేధాలను విధిస్తున్నాయి. గతంలో బీఎస్4, బీఎస్ 5 వాహనాల విషయంలోనూ కేంద్రం కీలక అంశాలను ప్రస్తావించిన సంగతి తెలిసింది. తాజాగా ఓ రకం వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధిస్తుంది.

High Beam LED Headlight Vehicles: ఇటీవల కాలంలో వివిధ రకాల వాహనాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు , నిషేధాలను విధిస్తున్నాయి. గతంలో బీఎస్4, బీఎస్ 5 వాహనాల విషయంలోనూ కేంద్రం కీలక అంశాలను ప్రస్తావించిన సంగతి తెలిసింది. తాజాగా ఓ రకం వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధిస్తుంది.

ఆ వాహనాలపై ఉక్కుపాదం మోపిన రాష్ట్ర ప్రభుత్వం!

తరచూ ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు అనేవి జరుగుతుంటాయి. అతివేగం, నిర్లక్ష్యం, మద్యం మత్తులో వాహనాలు నడపడం వంటి కారణాలతో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. అలానే హై బీమ్ ఎల్ఈడీ హైడ్ లైట్స్ కలిగి ఉంటే వాహనాల కారణంగా కొన్ని రకాల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇది ఇలా ఉంటే..కొన్ని రకలా వాహనాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాల ఆంక్షలు విధిస్తుంటాయి. అలానే మరికొన్ని సందర్భాల్లో ఏకంగా నిషేధాలను విధిస్తాయి. తాజాగా కొన్ని రకాల వాహనాలపై ఓ రాష్ట్ర ప్రభుత్వం ఉక్కపాదం మోపింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ఈ మధ్యకాలంలో వాహనాలకు హైబీమ్ ఎల్ఈడీ హెడ్ లైట్స్ వినియోగం బాగా పెరిగిపోతోంది. వీటి కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ లైట్స్ ను వినియోగించడం వల్ల ఎదురుగా వచ్చే వాహనదారులకు రోడ్డు కనపడదు. అలా ఎదురు దారి కనిపించకుండా యాక్సిడెంట్స్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. హైబీమ్ ఎల్ఈడీ హెడ్ లైట్స్ వినియోగం కారణంగా జరిగే ఈ ప్రమాదాలను అరికట్టేందుకు కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాక హైబీమ్ ఎల్ఈడీ హెడ్ లైట్స్ వాడే వాహనాలపై ఉక్కుపాదం మోపింది. ఇలా  హై బీమ్ ఎల్ఈడీ హెడ్ లైట్స్ ఉన్న వాహనాలను గుర్తించి..పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో  పోలీసులు తనిఖీలు చేపట్టారు. అలా ఒక్క వారంలోనే 8244 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు అధికారులు.

ఇక ఈ హైబీమ్ ఎల్ఈడీ లైట్స్ వాడకం ప్రమాదాలకు దారి తీస్తుందని, అనేక సమస్యలు, ఇబ్బందులు ఎదురువుతున్నాయంటూ.. చాలా మంది వాహనదారులు ప్రస్తావిస్తూనే ఉన్నారు. అలానే ఇలాంటి లైట్స్ ను వినియోగించే వాహనాల విషయంలోనూ అనేక ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ప్రభుత్వం తొలిసారి వీటి వాడకంపై చర్యలకు సిద్ధమైంది. సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని దేశం మొత్తం ఇదే విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నారు పలువురు కోరుతున్నారు.

ఈ హైబీమ్ ఎల్ఈడీ లైట్స్ వినియోగించే వాహనాలకు రోడ్డు క్లియర్ గా కనిపిస్తుంది. ఈ లైట్స్ నుంచి భారీ గా కాంతి ప్రసరిస్తుంది.  ఈ కారణంగా  ఎదురుగా వస్తున్న వాహనదారులకు రోడ్డు ఏమి కనిపించదు. దీంతో ఎదురుగా వచ్చే వాహనాలను, గుంతలను, మూలమలుపు గుర్తించకలేక.. ప్రమాదానికి గురవుతుంటారు. ఇలా అనేక ఘటనలు జరిగి.. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మరెందరో తీవ్రంగా గాయాలతో జీవితాన్ని నరకయాతనగా అనుభవిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి వాహనాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో కర్నాటక ప్రభుత్వం చర్యలకు దిగింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి