iDreamPost
android-app
ios-app

మద్యం ప్రియులకు కిక్ ఇచ్చే గుడ్ న్యూస్! ఇక ప్రతిరోజూ పండగే!

  • Published Aug 08, 2024 | 6:06 PM Updated Updated Aug 08, 2024 | 6:06 PM

రాష్ట్రంలో మద్యం ప్రియుల కోసం తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి మద్యం షాపులు మరి కొన్ని గంటలు పొడిగిస్తున్నట్లు తాజాగా ప్రభుత్వం మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇంతకీ ఎక్కడంటే..

రాష్ట్రంలో మద్యం ప్రియుల కోసం తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి మద్యం షాపులు మరి కొన్ని గంటలు పొడిగిస్తున్నట్లు తాజాగా ప్రభుత్వం మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇంతకీ ఎక్కడంటే..

  • Published Aug 08, 2024 | 6:06 PMUpdated Aug 08, 2024 | 6:06 PM
మద్యం ప్రియులకు కిక్ ఇచ్చే గుడ్ న్యూస్! ఇక ప్రతిరోజూ పండగే!

గత కొన్ని రోజులుగా మద్యం ప్రియులకు ఊహించని విధంగా షాకుల మీద షాకులు తగులుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఏదో ఒక కారణంతో మద్యం దుకాణాలు బంద్ చేయాడం, మద్యం ధరలు పెంచడం, లేక స్టాక్ తక్కువైపోవడం వంటి వార్తలు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో మందు బాబులకు మద్యంకు సంబంధించి ఈ చిన్న వార్త వచ్చిన గుండెల్లో రాయి పడినంత భారంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే.. ఈ మందు బాబులు గుడ్ న్యూస్ ల కంటే.. బ్యాడ్ న్యూస్ లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. తాజాగా ప్రభుత్వం మద్యం ప్రియులకు మంచి కిక్ ఇచ్చే శుభవార్త ప్రకటించింది. ఇక నుంచి రాష్ట్రంలో మద్యం విక్రయాల సమయాన్ని మరి కొన్ని గంటలు పెంచుతున్నట్లు తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

రాష్ట్రంలో ఇక నుంచి మద్యం షాపులు మరి కొన్ని గంటలు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాగా, ఈ నిర్ణయం అనేది కర్ణాటకలో రాష్ట్రంలోని సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రేస్ ప్రభుత్వం తీసుకుంది. అయితే కర్ణాటకలోని బడ్జెట్ రెవెన్యూ లోటును భర్తీ చేసుకునేందుకుగానూ.. మద్యం విక్రయాల సమాయాన్ని పెంచాల సిద్ధరామయ్య సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక అమ్మకాల సమయం పెంచితే.. కొనుగోలు పెరుతుందని, దీని వల్ల ప్రభుత్వంకు ఆదాయం సమకూరుతుందని భావిస్తోంది. ఈ క్రమంలోనే.. కర్ణాటకలోని సర్కార్ మద్యం షాపులను అర్ధరాత్రి ఒంటి గంట వరకు పొడింగించి విక్రయించుకునేందుకు వ్యాపారులకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కర్ణాటకలో ప్రభుత్వం ఈ విషయం పై ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇక సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం మందుబాబులకు గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు.

అయితే సిద్ధరామయ్య జారీ చేసిన ఉత్తవర్వులలో.. నగరంలోని పబ్బులు, క్లబ్బులు, స్టార్ హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లల్లో.. ఇక నుంచి అర్ధరాత్రి 1 గంటల వరకు మద్యం అందుబాటులో ఉండేలా ప్రకటించింది. కాగా, ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వం రెవెన్యూ లోటును భర్తీ చేసుకోవడానికి బీర్ల అమ్మకాలపై వసూలు చేస్తున్న ఎక్సైజ్ ట్యాక్స్‌ను అదనంగా 10 శాతం పెంచింది. అంతేకాకుండా.. బీర్లపై ఎక్సైజ్ ట్యాక్స్ పెంచుతూ చేసిన ప్రతిపాదనలకు.. గతంలోనే కర్ణాటక వార్షిక బడ్జెట్‌లో సిద్ధరామయ్య సర్కార్ చేర్చింది. ఈ నిర్ణయం వల్ల ఏటా కర్ణాటక ప్రభుత్వ ఖజానాకు అదనంగా రూ.1,200 కోట్ల ఆదాయం సమకూరుతోంది.

ఇకపోతే కర్ణాటకలో మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయం భారీగా ఉంటోంది. ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి ముగిసిన 2022-2023 ఆర్థిక సంవత్సరంలో.. కేవలం బీర్ల అమ్మకాల ద్వారా మాత్రమే రూ.800 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇక గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి 390.66 లక్షల కార్టన్ బాక్సుల మేర బీర్లు అమ్ముడు పోయాయి. అయితే అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2021-2022 తో పోల్చుకుంటే ఈ సంఖ్య రెట్టింపు కావడం గమనార్హం. ఇకపోతే  2021-2022 ఆర్థిక సంవత్సరంలో 268.83 లక్షల కార్టన్ బాక్సుల మేర బీర్ల అమ్ముడు పోయాయి. అయితే ఇప్పుడు తాజాగా కర్ణాటకలో సర్కార్ బీర్ల అమ్మకాలపై ఎక్సైజ్ ట్యాక్స్‌ను 10 శాతం పెంచడం మరింత ఆదాయాన్ని తెచ్చిపెట్టనుంది. మరీ, కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వం అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet