iDreamPost
android-app
ios-app

టెక్కీలకు కొత్త కష్టాలు.. అక్కడ నుంచి ఖాళీ చేయాల్సిందేనా?

  • Published Apr 17, 2024 | 9:38 PM Updated Updated Apr 17, 2024 | 9:38 PM

Difficulties for IT Employees: ఇటీవల చాలా మంది టెక్కీలకు తమ రంగంలతోనే కాదు.. ఇతర వ్యవహారాల్లో నానా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.

Difficulties for IT Employees: ఇటీవల చాలా మంది టెక్కీలకు తమ రంగంలతోనే కాదు.. ఇతర వ్యవహారాల్లో నానా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.

టెక్కీలకు కొత్త కష్టాలు.. అక్కడ నుంచి ఖాళీ చేయాల్సిందేనా?

కరోనా ప్రభావం తర్వాత చాలా మంది టెక్కీలు తమ రంగంలో ఉండే సమస్యలతో పాటు ఇతర విషయాల్లో తీవ్ర ఆందోళన, ఇబ్బందులు పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయం కూడా టెక్కీలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ మధ్య కాలంలో పలు రాష్ట్రాల్లో ఐటీ సంస్థలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మార్చడం వల్ల టెక్కీలు నానా కష్టాలు పడాల్సి వస్తుందని అంటున్నారు. తమ స్వస్థలం వీడిచి వేరే రాష్ట్రాలకు వెళ్లిన ఐటీ ఉద్యోగాలు చేస్తున్న వారు అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఉండాల్సి వస్తుంది. ఓ రాష్ట్రంలో ఏర్పడ్డ నీటి కష్టాలు అక్కడి ఐటీ ఉద్యోగులకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టాయి. ఇంతకీ ఏ రాష్ట్రం.. ఆ కష్టాలు ఏంటో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

ఇటీవల కర్ణాటక రాజధాని సిలికాన్ వ్యాలీ, టెక్ కంపెనీల డెస్టినేషన్ గా ఉన్న బెంగుళూరు సిటీ లో భయంకరమైన నీటి ఎద్దడి నెలకొంది. ఫిబ్రవరి నెల నుంచే అక్కడ నీటి కష్టాలు మొదలయ్యాయి. మార్చి, ఏప్రిల్ లో పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది. నీటి కోసం అక్కడ ప్రజలు యుద్దమే చేయాల్సి వస్తుంది. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు నీటి కోసం నానా కష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే నగరంలోని నివసిస్తున్న, స్థిరపడ్డ చాలా మంది టెక్కీలకు చేదు వార్త ఒకటి వైరల్ అవుతుంది. కర్ణాటకలో మరో నగరాన్ని ఐటీ హబ్ గా మార్చేందుకు సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల బెంగుళూరు పరిస్థితిని బూచీగా చూపించి కేరళా ప్రభుత్వం టెక్ కంపెనీలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైన ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఐటీ కంపెనీలు సైతం నీటి ఎద్దడి, ట్రాపిక్ ఇబ్బందుల కారణంగా బెంగుళూరుతో పాటు కర్ణాటకలోని ఇతర నగరాల్లో తమ కార్యాలయాలు ఏర్పాటు చేయడం మొదలు పెట్టాయి. అయితే ఐటీ కంపెనీల చూపు ఇప్పడు మంగుళూరు పై పడింది.

కర్ణాటకలో మంగుళూరు ముఖ్యనగరం.. ఇక్కడ వసతులు చాలా వరకు అనుకూలంగా ఉండటంతో ఐటీ కంపెనీలు ఇక్కడ తమ కార్యాల ఏర్పటుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. మంగుళూరులో ఇప్పటికే టెక్ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, ఇన్వెంచల్ టెక్నాలజీ, కాగ్నిజెంట్, లాంటి ప్రధాన ఐటీ కంపెనీలు తమ ఆఫీసులను ఇక్కడే ప్రారంభిచాయి. ఇటీవల మహింద్రా తన శాటిలైట్ ఆఫీస్ కూడా ఇక్కడే ప్రారంభించింది. రాబోయే రోజుల్లో మంగుళూరులో ఐటీ పార్కులు ఏర్పాటు కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు ఐటీ కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వం మంగుళూరులో తమ ఆఫీస్ ఏర్పాటుకు తోడ్పాటుతో పాటు రాయితీలు కల్పించాలని కోరుతున్నారు. ఐటీ కంపెనీల ప్రతినిధుల నిర్ణయాలకు కర్ణాటక ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించేందుకు సిద్దమైతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కొంతమంది ఐటీ ఉద్యోగులకు కొత్త కష్టాలు మొదలయ్యాయని అంటున్నారు.