P Krishna
ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా సిద్ద రామయ్య ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే జోరు కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది.
ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా సిద్ద రామయ్య ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే జోరు కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది.
P Krishna
సాధారణంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాళ్ల చుట్టు హై సెక్యూరిటీ ఉంటుంది. వారు ఎక్కడికి వెళ్లినా భద్రతా వళయంలో ఉంటారు. కానీ కొంతమంది ముఖ్యమంత్రులు మాత్రం ప్రజాక్షేత్రంలోకి స్వేచ్చగా వెళ్తుంటారు.. వారి కష్టసుఖాలు స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. కొన్నిసార్లు వారి సంప్రదాయాల ప్రకారం దుస్తులు ధరించి డ్యాన్సులు చేస్తూ సంతోషపరుస్తుంటారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల సీజన్ నడుస్తుంది.. నేతలు తమ పార్టీని బలోపేతం చేసుకునేందుకు ప్రజల్లోకి వెళ్తున్నారు. అధికార పార్టీ నేతలు తాము చేస్తున్న అభివృద్ది సంక్షేమాల గురించి చెబుతుంటే.. ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా సిద్దిరామయ్య ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణలో కర్ణాటక తరహా ఫలితాలు రాబట్టేందుక కాంగ్రెస్ పార్టీ తెగ ప్రయత్నం చేస్తుంది. తాజాగా సిద్ది రామయ్య కి సంబంధించిన ఓ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వివరాల్లోకి వెళితే..
ఈ ఏడాది కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కీ గట్టి పోటీ ఇచ్చి కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. సిద్ద రామయ్య మరోసారి సీఎం బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సిద్ద రామయ్య తాజాగా సంప్రదాయ నృత్యం చేస్తున్న ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కర్ణాటకలోని హంపి లో కర్ణాటక రాజ్యోత్సవ కార్యక్రమం వైభవంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం సిద్ద రామయ్య హాజరయ్యారు. రాజ్యోత్సవ కార్యక్రమంలో భాగంగా స్టేజ్ పై సిద్ద రామయ్య సంప్రదాయ పాటకు అక్కడ ఉన్న కళాకారులతో కలిసి స్టెప్పులు వేశారు. ఎంతో ఉత్సాహంగా ఆయన వారితో డ్యాన్స్ చేయడంతో అక్కడి వాతావరణం మొత్తం చప్పట్లతో మారుమోగింది. గతంలో సిద్ద రామయ్య పలుమార్లు తన డ్యాన్స్ తో అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
విజయనగరం జిల్లాలోని ప్రపంచ ప్రసిద్ది చెందిన హంపీలో ‘కర్ణాటక సంభ్రమన్-50’ పేరుతో కన్నడ సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేస్తున్న కన్నడ రాజ్యోత్సవాలు ఏడాది పొడవునా జరుగుతుంటాయి. గురువారం కరుణదయ జ్యోతి రథయాత్రను ముఖ్యమంత్రి సిద్ద రామయ్య ప్రారంభించారు. సిద్ద రామయ్య స్వగ్రామం సిద్ద రామహుండికి చెందిన కొంతమంది కళాకారులతో వీర మక్కల కుణిత జానపత కళకు సంబంధించిన నృత్యాన్ని ప్రదర్శించారు. ఆ సమయంలో కళాకారులతో కలిసి ఆయన కూడా కాలు కదిపారు. అంత వయసు వచ్చినప్పటికీ సీఎం సిద్దరామయ్య సాంప్రదాయంగా వారితో స్టెప్పులు వేయడం.. అక్కడికి వచ్చిన ప్రేక్షకులు, కార్యకర్తలు చప్పట్లు, ఈలలతో ఉత్సాహపరిచారు. ప్రస్తుతం దీనికి సంభందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Watch Karnataka CM Siddaramaiah Dancing At Hampi #karnataka #cmsiddaramaiah can #dance . He has shown that at he is a #dancer at many occasions. At Karnataka Rajyotsava in #hampi Siddaramaiah once showed that he can move. #viralvideo #viral #politics #dancevideo @siddaramaiah pic.twitter.com/zhseYeeoUu
— Sosouth Official (@SosouthOfficial) November 3, 2023