iDreamPost
android-app
ios-app

బైక్‌ మెకానిక్‌ ‌కి కలిసి వచ్చిన అదృష్టం.. ఏకంగా రూ.25 కోట్లు

  • Published Oct 11, 2024 | 11:22 AM Updated Updated Oct 11, 2024 | 11:22 AM

Karnataka: అదృష్టం ఎప్పుడు కలిసి వస్తుందో ఎవరూ ఊహించలేరు. ఒక్కొక్కరి ఫేట్ ఒక్కో సమయంలో అనుకోకుండా మారిపోతుంది. అదృష్ట లక్ష్మి వరించి బీదరికంలో ఉన్నవారు రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారిపోయిన సందర్భాలు ఉన్నాయి.

Karnataka: అదృష్టం ఎప్పుడు కలిసి వస్తుందో ఎవరూ ఊహించలేరు. ఒక్కొక్కరి ఫేట్ ఒక్కో సమయంలో అనుకోకుండా మారిపోతుంది. అదృష్ట లక్ష్మి వరించి బీదరికంలో ఉన్నవారు రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారిపోయిన సందర్భాలు ఉన్నాయి.

  • Published Oct 11, 2024 | 11:22 AMUpdated Oct 11, 2024 | 11:22 AM
బైక్‌ మెకానిక్‌ ‌కి కలిసి వచ్చిన అదృష్టం.. ఏకంగా రూ.25 కోట్లు

ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి అన్న సామెత వినే ఉంటారు. అదృష్ట దేవత ఎవరి తలుపు ఎప్పుడు తడుతుందో ఎవరికీ తెలియదు. అదృష్టం కలిసి వస్తే బిచ్చగాడు సైతం రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోవొచ్చు. దురదృష్టం వెంటాడితే కోటీశ్వరుడు బిచ్చగాడైన సందర్భాలు ఉన్నాయి. కాలం ఎవరిని ఎప్పుడు ఎక్కడ నిలబెడుతుందో ఎవరూ ఊహించలేరు.  ఉద్యోగాలు, వ్యాపారాలు చేసి పైసా పైసా కూడబెట్టినా కోటీశ్వరులు కావడం కష్టం. అందుకే చాలామంది ఎప్పటికైనా లక్ష్మీదేవి కరుణిస్తుందనే నమ్మకంతో లాటరీలు కొంటారు. కోట్ల మందిలో ఎవరికో ఒక్కరికి జాక్ పాట్ తగులుతుంది. ఓ సాధారణ బైక్ మెకానిక్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

కర్ణాటకలోని మైసూర్‌లో ఓ బైక్‌ మెకానిక్‌ ఎప్పుడో ఒకప్పుడు తన అదృష్టం మారుతుందనే నమ్మకంతో 15 ఏళ్లుగా లాటరీ టిక్కెట్లు కొంటున్నాడు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా లాటరీ టికెట్ కొని రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. మాండ్య జిల్లా పాండవపురకు చెందిన అల్తాఫ్ పాషాకు కేరళా ప్రభుత్వం నిర్వహించే తిరుఓనమ్ లాటరీలో ఏకంగా రూ.25 కోట్లు గెల్చుకున్నాడు. కేరళాలో స్నేహితుడి ఇంటికి అప్పుడప్పుడు వెళ్లే అల్తాఫ్ ప్రతిసారి అక్కడ లాటరీ కొనడం అలవాటు. ఇటీవల అల్తాఫ్ వయనాడ్ జిల్లా సుల్తాన్ బాతేరిలో రూ.500 పెట్టి టికెట్ కొనుగోలు చేశాడు. ఈ నెల 9న తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి డ్రా తీశారు. అల్తాఫ్ కు మొదటి బహుమతి వచ్చింది.

అల్తాఫ్ కొన్న టీజీ 43422 నంబర్ గల టిక్కెట్ కి రూ.25 కోట్లు వచ్చినట్లు లాటరీ నిర్వాహకులు ఫోన్ చేసి చెప్పారు. మొదట అల్తాఫ్ నమ్మలేదు.. కానీ అది నిజం అని స్నేహితుడు, బంధువులు చెప్పడంతో ఆనందంతో ఎగిరి గంతేశాడు. జీవితంలో ఒక్కసారైనా తనకు అదృష్టం కలిసి రాదా అన్న నమ్మకం ఇన్నాళ్లకు నిజమైందని అంటున్నాడు అల్తాఫ్.  ఈ డబ్బుతో బెంగుళూరులో సెటిల్ అవుతానని, అప్పులన్నీ తీర్చి మంచి ఇళ్లు కొనుగోలు చేస్తానని, తన కూతురుని డాక్టర్ చేస్తానని అల్తాఫ్ అంటున్నాడు. వాస్తవానికి  నేను రెండు లాటరీ టికెట్లు కొన్నాను. అందులో ఒకటి నా స్నేహితుడికి ఇవ్వాలని భావించాను. ఆ సమయంలో నా భార్య అడ్డుపడి రెండు మనవద్దే ఉంచానని పట్టుబట్టింది. లక్కీగా అదే నెంబర్‌కి లాటరీ తగిలింది. అన్ని ట్యాక్స్ లు పోను అల్తాఫ్ కి రూ.13 కోట్ల వరకు రావొచ్చని అంటున్నారు. అందుకే అంటారు అదృష్టం కలిసి వస్తే ఎవరూ ఆపలేరని.. అల్తాఫ్ కుటుంబ సభ్యులు ఇప్పుడు సంతోషాల్లో మునినిపోయారు.