iDreamPost
android-app
ios-app

బాలుడిపై పగ బట్టిన నాగు పాము.. 2 నెలల్లో 9 సార్లు!

బాలుడిపై పగ బట్టిన నాగు పాము.. 2 నెలల్లో 9 సార్లు!

నాగుపాము పగబడితే ఏళ్లు అయినా వదిలిపెట్టదు అంటారు. కానీ, సైన్స్‌ మాత్రం పాములు పగబట్టవు అంటోంది. కొన్ని సార్లు ఆ సైన్స్‌కు కూడా అంతుచిక్కని సంఘటనలు చోటుచేసుకుంటూ ఉన్నాయి. పాములు మనుషుల్ని పగబట్టినట్లుగా వారిపై దాడులకు తెగబడ్డాయి. ఒకే వ్యక్తిని ఒకే పాము పలు సార్లు కాటు వేసిన సంఘటనలు కూడా చాలా జరిగాయి. తాజాగా, కర్ణాటక రాష్ట్రంలో కూడా ఓ సంఘటన వెలుగుచూసింది. ఓ నాగు పాము ఓ బాలుడ్ని పగబట్టింది. ఒకటి కాదు రెండు కాదు.. రెండు నెలల్లో 9 సార్లు కాటు వేసింది.

ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కలబురగి జిల్లా, చిత్తాపుర తాలూకా, హలకటి గ్రామానికి చెందిన ప్రజ్వల్‌ అనే బాలుడి జీవితం రెండు నెలల ముందు వరకు సాధారణంగానే ఉండేది. పదవ తరగతి చదువుతున్న అతడి జీవితం జులై నెలలో ఓ కీలక మలుపు తిరిగింది. జులై 3వ తేదీ మొదటి సారి అతడ్ని ఓ నాగు పాము కరిచింది. ప్రజ్వల్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లటంతో ప్రాణాపాయం తప్పింది. ఇంట్లో ఉండగా పాము కాటు వేయటంతో తల్లిదండ్రులు ఆ ఇళ్లు, ఊరు విడిచి వెళ్లిపోయారు. చిత్తాపురలో ఇళ్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు.

అయితే, ఇళ్లు.. ఊరు విడిచిన తర్వాత కూడా పాము అతడ్ని కరిచింది. ఇలా రెండు నెలల్లో 9 సార్లు ఆ పాము అతడ్ని కరిచింది. ఇన్ని సార్లు ప్రజ్వల్‌ను పాము కరిచినా.. ఒక్కసారి కూడా ఆ పామును కుటుంబసభ్యులు ఎవ్వరూ చూడలేదు. ఆ పాము కేవలం ప్రజ్వల్‌కు మాత్రమే కనిపిస్తోంది. 9 సార్లు పాము కరవగా.. 6 సార్లు ఆస్పత్రి పాలయ్యాడు. ఆస్పత్రినుంచి డిశ్చార్జ్‌ అయిన రెండు, మూడు రోజుల్లోనే పాము మళ్లీ అతడిపై దాడి చేస్తోంది. ఇక్కడ ఓ ప్రశ్న కుటుంసభ్యులతో పాటు అందర్నీ వెంటాడుతోంది. ప్రజ్వల్‌ను నిజంగానే పాము కరుస్తోందా? లేక అబద్ధం ఆడుతున్నాడా? అని. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.