sai
sai
ఇటీవల బంగ్లాదేశ్ లో జరిగిన సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో ఆటగాళ్లు పొట్టు పొట్టు కొట్టుకున్న విషయం తెలిసిందే. ఇరు ఆటగాళ్లు ఒకరిపై ఒకరు ఇష్టమొచ్చినట్లుగా దాడి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయ్యాయి. అయితే ఈ ఘటన మరువక ముందే తాజాగా కబడ్డీ ఆటగాళ్లు కోర్ట్ లోనే కొట్టుకున్నారు. ఇదే వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి. ఇంతకు వీళ్లు ఎందుకు కొట్టుకున్నారు? ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కాన్పూర్ ఐఐటీలో శనివారం వార్షిక క్రీడా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగానే వైఎంసీఏ-ఎన్ఎస్ యూటీ జట్ల మధ్య కబడ్డీ పోటీ జరిగింది. అయితే ఈ క్రమంలోనే ఉన్నట్టుండి ఇరుజట్ల ఆటగాళ్లు కుర్చీలతో ఒకరిపై ఒకరు విచక్షణా రహితంగా దాడి చేసుకున్నారు. వీళ్లు దాడి చేసుకుంటుండగా కొందరు వ్యక్తులు వీడియోలు తీశారు. అదే వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి. అయితే వీరి ఘర్షణకు కారణం తెలియాల్సి ఉంది.
कानपुर: IIT में उद्घोष -2023 चल रहा है, कबड्डी खिलाड़ी आपस में भिड़ गए…।
देश भर के 450 कॉलेज के करीब 3000 स्टूडेंट ने उद्घोष में पार्टिसिपेट किया है…।#IIT #kanpur pic.twitter.com/G8cTDZL3J2
— Dilip Singh (@dileepsinghlive) October 9, 2023